The Actress Gave Kitab To Darling In That Regard: సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ బుజ్జిగాడు. ఈ మూవీలో త్రిషకి సహనటిగా నటించిన సంజన గల్రాని అందరికీ సుపరిచితమే. ఈమె సోగ్గాడు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఐడెంటీటీని సొంతం చేసుకుంది. ఈమె టాలీవుడ్‌తో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె బుజ్జిగాడు మూవీలో ప్రభాస్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి షాకింగ్ విషయాలను చెప్పింది సంజన గల్రాని. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బుజ్జిగాడు షూటింగ్ టైమ్‌లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ టైంలో నేను స్పాట్‌లో లేను కానీ, అది విన్న వెంటనే నేను సెట్‌లోని వాళ్ళందరం ఎక్కడ పని అక్కడ ఆపేసి పరిగెత్తుకుంటూ ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ఏదో టేక్ సమయంలో ప్రభాస్ కిందపడ్డాడు. అప్పుడు ఒక బస్ అయిన మీద నుంచి వెళ్ళిందంటూ ప్రభాస్‌కి అయిన యాక్సిడెంట్ గురించి తెలుసుకొని భయానికి గురయ్యారట సంజన. సాధారణంగా బస్ మనకి తగలకపోయినప్పటికీ మన చాలా క్లోజ్‌గా ఒక బస్ వెళితే ఎంత కంగారుపడతాం.
Also Read:పర్సంటేజీలు ఇచ్చి తీరాల్సిందే..!
అలాంటిది డార్లింగ్ ప్రభాస్ ఏ మాత్రం కంగారు పడకుండా అలాగే ఎవరినీ కంగారు పెట్టకుండా అందరూ వచ్చి అడుగుతున్నా సరే చాలా కూల్‌గా బాగానే ఉన్నాను అన్నారు. ఇది చూసిన చాలామంది ఆయన నిజంగా ఒక రియల్ లైఫ్ హీరో అని అన్నారు. ఇక సంజన మ్యాటర్‌కొస్తే డార్లింగ్ నిజంగా డార్లింగ్ అంటూ ప్రభాస్‌కి కితాబ్ ఇచ్చింది.
#Bujjigadu Incident: During an action sequence #Prabhas fell & a bus went over him. Everyone panicked & rushed to him but he remained calm & gutsy.
His Life is filled with risky moves & that’s what has made him the STAR he is today! #16YearsForBujjigadupic.twitter.com/bRuu6PFLbl
— Hail Prabhas (@HailPrabhas007) May 22, 2024