TGPSC Group 1 Hall Tickets To Release On June 1st:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అప్డేట్‌ని అందించింది. జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను జూన్ 1వ తేదీ నుండి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం శాంపిల్ ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.జూన్ 9న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించున్నట్లు పేర్కొంది.
Also Read:‘రవాణా’ప్రక్షాళన షురూ
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ఇప్పటి వరకు రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష జరగగా..పేపర్ లీక్, ఇతర కారణాల వల్ల రెండు సార్లు ఎగ్జామ్ రద్దు అయ్యింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. ఆ పోస్టులకు మరికొన్ని జాబ్‌లు యాడ్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
జూన్ 9 ప్రిలిమినరీ పరీక్ష జరగనుండగా.. అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించునున్నారు. 563 పోస్టుల కోసం దాదాపు 4.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. జూన్ 9న జరగబోయే ప్రిలిమ్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తోంది. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా అన్నిరకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది టీజీపీఎస్సీ కమిషన్.