Monday, July 22, 2024

Exclusive

7 అంచెలు.. 14 సీట్లు.. 4 నెలల పాలన, 6 పథకాలే ప్రధాన ఎజెండా

– చివరి 9 రోజుల్లో హోరెత్తనున్న ప్రచారం
– మే 5, 6, 9న రాహుల్, ప్రియాంకా గాంధీ సభలు
– అభ్యర్థులకు సీఎం, ఇన్‌ఛార్జ్ నిరంతర గైడెన్స్
– ఇన్‌ఛార్జ్‌ల రాకతో క్షేత్రస్ధాయికి నేతలు
– పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించిన నేతలు
– గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన 54 సీట్లపై ఫోకస్
– 14 స్థానాల్లో పైచేయికి నేతల వ్యూహాలు

Telangana: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ప్రచారానికి కేవలం 9 రోజుల సమయమే మిగలటంతో ప్రతి లోక్‌సభ స్థానంలోని చివరి గ్రామం వరకు ప్రచారం జరిగేలా హస్తం నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం 17 సీట్లలో రాజకీయ వాతావరణం, ప్రత్యర్థుల బలాబలాలు, ప్రచార శైలి, జనం స్పందన వివరాలను ఎప్పటికప్పుడు వార్‌రూమ్ బృందాలు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, లోక్‌‌సభ నియోజక వర్గాల బాధ్యుల కమిటీని అందజేస్తున్నారు. స్థానికంగా బలమైన నేతలను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవటం, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయటం, పార్టీకి దూరమైన వర్గాలను సైతం కలుపుకుపోయే ప్రయత్నం చేయటం మీద ప్రధానంగా నేతలు ఈ 9 రోజులూ దృష్టి సారించనున్నారు.

పరిశీలకుల రాకతో పెరిగిన దూకుడు
ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికలతో బాటు కంటోన్మెంట్ ఉపఎన్నిక మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికలు పూర్తైన స్థానాల్లోని సీనియర్ నేతలను తెలంగాణలో పోటీ అధికంగా ఉన్న 11 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. ఆదిలాబాద్‌కు కేరళ సీనియర్‌ ఎమ్మెల్యే షఫీ పరంబిల్‌ను, నిజామాబాద్‌కు కర్ణాటక మంత్రి బోసురాజు, మంతర్ గౌడ్‌ను, మెదక్ సీటుకు కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడికున్నిల్ సురేష్‌ను నియమించారు. కేరళ కాసర్‌గోడ్ సిట్టింగ్ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్‌‌‌కు జహీరాబాద్ బాధ్యతలు, మల్కాజ్‌గిరి బాధ్యత తమిళనాడు సిట్టింగ్ ఎంపీ జ్యోతిమణికి అప్పగించారు. పాలమూరు సీటులో చంద్రశేఖర్, చేవెళ్లలో హిబ్బి ఏడెన్, నాగర్ కర్నూల్‌లో పీవీ మోహన్, సికింద్రాబాద్‌‌లో రిజ్వాన్ హర్షద్, వరంగల్‌లో రవీంద్ర దాల్వి, సికింద్రాబాద్‌లో పి. విశ్వనాథన్ నియమితులయ్యారు. గట్టి పోటీ ఉన్న, ఖచ్చితంగా గెలిచి తీరాలనుకున్న ఈ సీట్లలో ఈ పరిశీలకులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ, నేతలకు గైడెన్స్ ఇస్తున్నారు.

గ్రామ స్థాయి బూత్ నుంచి..
ప్రచారంలో జోష్ పెంచేందుకు మే 5, 6, 9 తేదీల్లో రాహుల్‌, ప్రియాంకా గాంధీలు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ప్రచారానికి సమయం 8 రోజులే ఉండటంతో మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, అభ్యర్థులతో పీసీసీ అధ్యక్షుడు, సీఎం, రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌లు జూమ్‌ మీటింగ్‌లు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. గ్రామ, మండల స్థాయి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ పరిస్థితిని అంచనా వేయటంతో బాటు మంచి పనితీరును కనబరచిన వారికి ఇందిరమ్మ కమిటీల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. చేరికలు, పథకాల ప్రచారంతో అసెంబ్లీ ఎన్నికల ఓట్లకు మరింత జోడించే యత్నం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి, పాత నేతలు కలిసి పనిచేసేలా చూసే బాధ్యతను మంత్రులే పర్యవేక్షిస్తున్నారు.

ఓడిన అసెంబ్లీ సీట్లపై ఫోకస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిన 54 సీట్ల మీద సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌‌ ఎంపీ పరిధిలో ఖానాపూర్ మాత్రమే కాంగ్రెస్ దక్కించుకోగా, మిగిలిన 6 సీట్లలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆ బాధ్యతను అక్కడ ఓడిన అభ్యర్థులతో బాటు కొత్తగా పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్ వంటి నేతలకు అప్పగించారు. ఇదే రీతిలో అన్ని సీట్లలోనూ వ్యూహాలను రూపొందించారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన కారణాలను విశ్లేషించుకుని, వాటిని సరిదిద్దుకునే భాధ్యతను అక్కడి ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని అటు మొగ్గిన నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. అలాగే గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన బూత్‌ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రచారం జోరు పెంచారు.

పట్టణాలు, నగరాలపై నజర్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌కు, పట్టణ ఓటర్లు బీఆర్ఎస్, బీజేపీ వైపు మొగ్గారు. ఈ నేపథ్యంలో పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలు, గతంలో కాంగ్రెస్ అక్కడ చేసిన అభివృద్ధిని ఓటర్లకు హస్తం నేతలు గుర్తుచేస్తున్నారు. ఆ ప్రాంతంలోని కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక కార్యకర్తల మనసు గెలిచేందుకు మంత్రులు వారిని కలుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌కు ఓటేస్తే సమస్యలు పరిష్కరించటం సులభమవుతుందనే కోణంలోనూ ప్రచారం సాగుతోంది.

భారీ మెజారిటీలకు చెక్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించిన కుత్బుల్లాపూర్‌ (85,576), కూకట్‌పల్లి (70,387), మల్కాజ్ గిరి( 49,530), సికింద్రాబాద్‌ (45,240) వంటి పాతిక సీట్ల మీద కూడా సీఎం దృష్టి పెట్టారు. చేరికలు, ఇంటింటి ప్రచారంతో ఆ మెజారిటీలను నేలకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి ఓటర్లకు ఓటరు స్లిప్‌లను ఇంటి వద్దే అందించి, ఎన్నిక రోజున వారంతా పోలింగ్‌కు తరలి వచ్చే ఏర్పాటు జరుగుతోంది. ఈసారి తమకు ఓటేస్తే అండగా ఉంటామని లోకల్ నేతలచే ఓటర్లకు హామీ ఇప్పించే ప్రయత్నం సాగుతోంది.

7 అంచెల పిరమిడ్ వ్యూహం
సీఎం రేవంత్ రెడ్డి రూపొందించిన 7 అంచెల పిరమిడ్ వ్యూహాన్ని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారు. ఇందులో తొలి 3 దశలైన గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోలింగ్ బూత్‌ల బాధ్యతలను స్థానిక పార్టీ కమిటీలకు, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులకు అప్పగించారు. నాలుగో దశలో వీరిపై ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయిదో దశలో వీరిపైన ఆ సీటు బాధ్యత తీసుకున్న రాష్ట్ర మంత్రి, అక్కడ నియమితులైన ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులు పనిచేస్తున్నారు. వీరు ఏడో అంచెలోని సీఎం, దీపాదాస్ మున్షీలతో కూడిన కోర్ టీంకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, కీలక విషయాల్లో వారి సలహాలు తీసుకుంటున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...