Saturday, May 18, 2024

Exclusive

Telangana: పల్లె ఓట్లు పదిలం

  • తెలంగాణ పల్లెల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం
  • మెజారిటీ ఓటింగ్ శాతం పల్లెటూళ్ల నుంచే
  • పల్లెల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన పార్టీలు
  • బీఆర్ఎస్ హయాంలో పల్లెలన్నీ నిర్వీర్యం
  • పంచాయతీ నిధులన్నీ పక్కతోవ పట్టించిన బీఆర్ఎస్
  • పదేళ్లుగా బీజేపీ స్మార్ట్ సిటీలకే నిధులు
  • బడ్జెట్ కేటాయింపుల్లోనూ పల్లెలకు అన్యాయం
  • గత ఎన్నికలలో కాంగ్రెస్ కు కలిసొచ్చిన గ్రామీణ ఓటు బ్యాంకు
  • 70 నుంచి 80 శాతం ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామీణులు
  • 40 శాతం ఓటింగ్ మించని పట్టణ ఓటర్లు

 

Telangana rural voters participating high percentage casting votes:

పల్లెల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. పట్టణాలలో నానాటికీ ఓటింగ్ శాతం తగ్గిపోతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ లో అధికార పార్టీని నిర్ణయించింది గ్రామీణ ఓటర్లే అన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో 13 నగరపాలక సంస్థలు ఉంటే 141 పురపాలికలు ఉన్నాయి. మొత్తం 12,769 గ్రామాలు ఉండగా జనాభాలో 61 శాతం గ్రామాలలో ఉంంటుండగా 39 శాతం మాత్రమే పట్టణాలలో ఉంటున్నారు. పైగా ప్రతి ఎన్నికలలో కూడా పట్టణ ఓటర్ల కన్నా పల్లెల్లో ఓటర్లే నిర్ణయాత్మక శక్తులుగా ఎదగుతున్నారు. పైగా ఓటింగ్ శాతం కూడా గ్రామాలలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు వచ్చినా వరుస సెలవలు వస్తే ఏదైనా టూర్ ప్లాన్ చేద్దామా అనే ఆలోచన తప్ప ఓటు వేయాలనే కనీస కర్తవ్యాన్ని పాటించడం లేదు. మరో ముఖ్య కారణం నగర ఓటర్లలో చాలా మందికి ఒక్కొక్కరికీ రెండు ఓట్లుండడం. నగరంలో నివసిస్తున్న వారికి తమ గ్రామంతో పాటు నగరంలో కూడా ఓటు ఉండడంతో ఎక్కువ మంది ఓటు వేసేందుకు గ్రామాలకు తరలివెళ్లారు. ఇది నగరంలో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రధాన పార్టీలన్నీ పల్లె ఓటర్లను ప్రసన్న చేసుకునే పనిలో పడ్డాయి. పల్లె ఓటర్లకు అవి చేస్తాం..ఇవి చేస్తాం అంటూ వాగ్దానాలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల మద్దతుతోనే గెలుపొందడం విశేషం.

గ్రామీణ ప్రాంతాలలోనే ఓటింగ్ సరళి ఎక్కువ

ఇక ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే ఉండటంతో హైదరాబాద్ నగర ఓటర్లు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. అందుకే రాజకీయ నాయకులంతా ఈ ఓటర్లపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. వీళ్లను తమవైపు తిప్పుకునేలా వాళ్ల ఓటు బ్యాంకుపై కన్నేశారు. పల్లెల్లో ఆదాయ మార్గాలు చాలా తక్కువగానే ఉంటాయి. అందుకే వారి ఆదాయానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తన పథకాలను రూపొందించుకుంది. ఆ విషయంలో అసెంబ్లీ ఎన్నికల్ల సక్సెస్ అయింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 హామీలు అన్నీ పల్లె ప్రాంత వాసులకే ఎక్కువ లబ్ది కలిగేలా రూపొందించడం విశేషం. 2014లో బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో 62 శాతం గ్రామీణ ప్రాంతాలవి కాగా… 2018లో 69 శాతం అక్కడివే. 2018లో కాంగ్రెస్‌కు వచ్చిన 19 సీట్లలో దాదాపు అన్నీ గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉన్నవే. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. అందువల్ల పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తున్నారు. పల్లె ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. వారిని చైతన్యం చేస్తే తప్పకుండా తమకే ఓటు వేస్తారనే నమ్మకంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో వివిధ పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తలు పల్లెల్లోనే తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం పార్టీ నాయకులు వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఉదయం మాత్రం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి తమ పార్టీల గురించి చెబుతూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఒకే దగ్గర 200 మంది కూలీలు ఉంటున్నారు. ఒక రోజు ఒక పార్టీ వారు వెళితే.. ఇంకో రోజు మరో పార్టీ వారు వెళ్తున్నారు. సుమారు గంట పాటు వారి వద్దనే ఉంటున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఉదయం వేళ పోలింగ్‌ శాతం పెరిగే ఆస్కారం ఉంది.

పల్లెల్లో ప్రచారం తారాస్థాయికి

మెదక్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, నర్సాపూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాలకు చెందిన ముఖ్యనాయకులు ప్రచారం చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తున్నారు. వీరు పట్టణాల్లోనే రోడ్‌షోలు, బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదు అవుతోంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కేవలం 60 నుంచి 70 శాతం నమోదైంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 70 నుంచి 80 శాతం వరకు నమోదైంది. దీంతో పార్టీలన్నీ పల్లె ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ఎన్నికల అధికారులు ఓటింగ్‌ శాతం పెంచేందుకు ముమ్మరంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంతగా కనిపించడంలేదు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో పట్టణ పోలింగ్‌ ఏ విధంగా ఉంటుందోనని పార్టీలు భయపడుతున్నాయి.

గ్రామీణంలో తిరుగులేని కాంగ్రెస్ జెండా

గత ఎన్నికలలో కాంగ్రెస్ కు పట్టం కట్టిన పల్లె ఓటర్లు ఈ సారి కూడా తమకు పథకాలు అమలు అవ్వాలంటే కాంగ్రెస్ గెలుస్తేసే అవి అమలవుతాయని నమ్ముతున్నారు. పల్లె ఓటర్లు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు. పైగా పల్లెల్లో ఉండే క్యాడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ కు పల్లె ఓట్లు పడటం కష్టమే అంటున్నారు. పంచాయతీ నిధులన్నీ పక్క తోవ పట్టించి. సర్పంచ్ ల నిధులన్నీ పెండింగ్ లో పెట్టడంతో పల్లెల్లో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీతోనే మళ్లీ పల్లెల్లో వెలుగు నిండుతుందని భావిస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడూ పల్లెలను పట్టించుకోలేదు. ఎంత సేపూ స్మార్ట్ సిటీలంటూ దేశంలో ప్రధాన నగరాలకే నిధులు కేటాయించింది. పల్లెలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా నిలిపేసింది. మొదటినుంచీ కాంగ్రెస్ కు పల్లె ప్రాంత ఓటర్లే అండగా నిలబడుతూ వస్తున్నారు. పల్లెల్లో ఎక్కువగా కూలి పనులు చేసుకునే బడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ , బీసీ ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ మోసం - భారతీ లేక్ వ్యూ పేరుతో వసూళ్లు - అతి తక్కువ ధరకే ఫ్లాట్ అనడంతో ఎగబడ్డ జనం - రోజులు గడుస్తున్నా...

Congress: స్తంభాద్రిలో గెలుపు ఏకపక్షమే..

- లక్షకు పైగా మెజారిటీ లెక్కల్లో కాంగ్రెస్ - ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన విపక్షాలు - అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించిన హస్తం Khammam: తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం సీటుకు ఎంతో చరిత్ర ఉంది....

Hyderabad Metro: భాగ్యనగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad metro rail timings changed night service extended 45 minitues: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో నిర్వాహకులు శుభవార్త అందించారు. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక...