Saturday, May 18, 2024

Exclusive

Telangana: ఛలోరె ఛల్ ..అంటున్న నేతలు

  • పోలింగ్ ఘట్టం ముగియడంతో నేతలంతా టూర్లకు సన్నాహాలు
  • వివిధ పార్టీల అగ్ర నేతలంతా విదేశాలకు పయనం
  • ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లు
  • కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్న నేతలు
  • రెండు నెలలుగా అలుపెరుగని ప్రచారం
  • 27న తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక
  • కాంగ్రెస్ తరపున బరిలో తీన్ మార్ మల్లన్న
  • టూర్ కి వెళ్లొచ్చాక ప్రచారంలో పాల్గొంటామంటున్న కాంగ్రెస్ నేతలు

Telangana political leaders one week plan to go tours for Relax:
విమర్శలు, ప్రతివిమర్శలు, ఎత్తులు..పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులపై ప్రచారాస్త్రాలు ధీటుగా ప్రయోగిస్తూ దాదాపు రెండు నెలలుగా తెలంగాణలో అన్ని పార్టీ లీడర్లూ శక్తివంచన లేకుండా దాదాపు అన్ని నియోజకవర్గాలను పర్యటించారు. మండే ఎండలను కూడా లెక్క చేయక దాదాపు తమ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలు రానే వచ్చాయి. ప్రశాంతంగా ముగిశాయి. ఇక వచ్చే నెల 4 దాకా ఫలితాల కోసం నిరీక్షించక తప్పదు. దగ్గరదగ్గర 20 రోజుల సమయం ఉంది. అందుకే తమకు కలిసొచ్చిన ఈ ఇరవై రోజుల్లో ఎవరికి వారు టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీల అగ్ర నేతలంతా విదేశీ టూర్లపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల ఒత్తిడి తర్వాత రిలాక్స్ మూడ్ లోకి వచ్చేశారు నేతలు. మరికొందరు దేశంలో పేరొందిన టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సమ్మర్ వేడి నుంచి ఉపశమనం కలిగేలా ఉండే ప్రదేశాలలో ఓ రెండు వారాలపాటు సేద తీరి వద్దామని భావిస్తున్నారు నేతలు. ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కేరళ, మనాలి వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖత చూపుతున్నారని సమాచారం.

సొంత పనులన్నీ పెండింగ్

ఇప్పటిదాకా తమ సొంత పనులను సైతం పక్కన పెట్టేసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి అలుపెరుగక ఆయా ప్రాంతాలను చుట్టబెట్టిన నేతలంతా ఇప్పుడు ప్రశాతంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక పెండింగ్ లో ఉండిపోయిన తమ సొంత పనులపై దృష్టి సారించారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యులకు సైతం సమయం కేటాయించాలని అనుకుంటున్నారు. ఎన్నికల వేళ దాదాపు 18 గంటల పాటు కష్టపడి అన్ని నియోజకవర్గాలలో వర్కవుట్ చేసి అలసిన నేతలు ఇప్పుడు కనీసం ఓ వారం రోజులపాటైనా శరీరానికి రెస్ట్ ఇద్దామని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం అయినప్పటినుంచి అస్సలు తాను ఇంటికి వెళ్లలేదని ఓ పార్టీకి చెందిన నేత వాపోతున్నాడు. ఎక్కవగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అహోరాత్రులు కష్టపడ్డానని..సమయానికి తిండి, నిద్ర లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెబుతున్నాడు మరో నేత. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నిక కోసం ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాలుగైదు రోజుల తర్వాత ప్రచారంలోకి వెళ్లాలనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కొంత రిలాక్సయితే తప్ప మళ్లీ జనంలోకి వెళ్లలేమంటున్నారు. ఏ పార్టీ నేత ఏ ప్రాంతానికి హాలీడే ట్రిప్ కు వెళదామనేది స్పష్టంగా చెప్పనప్పటికీ వారం రోజులు మాత్రం రిలాక్స్ కాక తప్పదని చెబుతున్నారు.

తెలంగాణలో మరో ఎన్నిక

అయితే ఈ నెల 27న తెలంగాణలో మరో ఎన్నిక జరగబోతోంది. వరంగల్ – అదే ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ చాన్సిచ్చారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు.

టూర్ వెళ్లొచ్చాకే ప్రచారం

ఇటీవల ఎన్నికల ప్రచారం ముగియడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతూ సేదతీరారు. ఇదే తరహాలో ఆ పార్టీ నేతలు కూడా ఈ వారంలోనే టూర్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. తాజా పోలింగ్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల నాయకత్వంతో రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు లీడర్లు మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు పనిచేశామని, తమ శక్తి మొత్తాన్ని ప్రచారానికే వినియోగించామని, ఇప్పుడు రీఫ్రెష్ కావడానికి ఆలోచించక తప్పదన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు మాత్రం నాలుగైదు రోజుల పాటు సొంత నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోతామని, ఈ నెల 27 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనున్నందున ఆ ప్రచారంలోకి దిగుతామన్నారు. .

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఓటర్‌కు రూ. 500 చొప్పున డబ్బులు పంచాడని ఆరోపించారు. ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఈ నెల 18న విడుదల కానుంది. మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు వీటిని టీటీడీ ఆన్‌లైన్‌లో...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు శుక్రవారం...