- ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
- ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత
- ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా టాప్
- సెకండ్ ఇయర్‌లో 64.61 శాతం
- సెకండ్ ఇయర్‌లో ములుగు జిల్లా టాప్
- బుధవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలు
- గురువారంనుంచి మే 2 దాకా రీవ్యాల్యూయేషన్
- రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేస్కోవాలి
- మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాయలంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం విద్యార్థులు 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు 64.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో రంగారెడ్డి జిల్లా టాప్ వన్ గా నిలచింది. సెకండ్ ఇంటర్ లో ములుగు జిల్లా టాప్ వన్ గా నిలిచింది. బుధవారం సాయంత్రం నుంచి డౌన్ లోడ్ చేసుకోవడానికి మెమోలు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 25 నుంచి మే 2 దాకా రీవాల్యూషన్, రీ వెరిఫికేషన్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని బోర్డు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 30న ఎస్ఎస్ సీ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల మూల్యాంకనం పూర్తవగా.. ఇప్పుడు రిజల్ట్స్ ప్రకటించింది ఇంటర్మీడియట్ బోర్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషన్ కోర్స్ విద్యార్థుల ఫలితాలను కూడా వెల్లడించింది. మరోవైపు ఇదే నెలలో తెలంగాణ టెన్త్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన గానీ.. మే 1వ తేదీన గానీ ప్రకటించే అవకాశం ఉంది.