Tuesday, December 3, 2024

Exclusive

Hyderabad: పవర్ ఛాలెంజ్.. పక్కా ప్లాన్

– తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
– గ్రేటర్ పరిధిలో ఒక్కరోజే 89.71 మిలియన్ యూనిట్ల వాడకం
– గతేడాదితో పోలిస్తే 53.7 శాతం అధికం
– ఫలించిన కాంగ్రెస్ సర్కార్ ముందుచూపు చర్యలు
– వేసవికి ముందే వినియోగంపై సమీక్షలు, కీలక ఆదేశాలు
– అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
– సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌తో కరెంట్ సమస్యలకు బ్రేక్

Telangana current consumption increased double : ఠారెత్తిస్తున్న ఎండలతో పగటి ఉష్ణోగ్రతలు తెలంగాణలో 46 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో పంకాలు, ఏసీలు నిరవధికంగా వినియోగిస్తున్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవడంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్, వినియోగం రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ నెల 3న అత్యధికంగా 89.71 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాది సరిగ్గా అదే రోజు 58.34 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2న 228.50 మి.యూ. వినియోగం నమోదైంది. గతేడాది మే 2 (151.71 మి.యూ.)తో పోలిస్తే ఇది మరింత అదనం. ముందు ముందు హైదరాబాద్‌లో రోజువారీ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లకు పెరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. దాదాపు వర్షాలు పడేదాకా ఇదే పరిస్థితి. మే నెలాఖరు దాకా విద్యుత్ వినియోగం ఇదే తీరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

ఈ సీజన్‌ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడర్‌కు ఇన్‌ఛార్జిగా ఒక ఇంజినీర్‌ను నియమించామని అధికారులు చెబుతున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో, సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 300 మంది ఇంజినీర్లకు ఆపరేషన్‌ విధులు కేటాయించారు. సర్కిల్‌ కార్యాలయాల్లో పనిచేసే అకౌంటింగ్‌ సిబ్బందికి సైతం విధులు అప్పగించాలని ఆదేశించారు. వేసవి డిమాండ్‌ నేపథ్యంలో అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మరో 250 ట్రాన్స్‌ఫార్మర్లను క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని విద్యుత్ సంస్థ ప్రధాన అధికారులు చెబుతున్నారు.

కాంగ్రెస్ సర్కార్ ముందుచూపు

తెలంగాణ‌లో ఇందిరమ్మ రాజ్యం కొలువు తీరాక‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆయా రంగాల‌కు చెందిన అధికారులు, నిపుణుల‌తో తొలి నెల రోజుల పాటు ప్ర‌త్యేకంగా స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుంది? వేసవి రోజుల్లో ఏమేర‌కు పెరుగుతుంది? రాష్ట్ర విద్యుత్ ఉత్పాద‌న సామ‌ర్థ్యం, కొనుగోలు అంశాల‌పై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆ ఫ‌లితాలే ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయని అంటున్నారు అధికారులు.

భవిష్యత్ అవసరాల కోసం

గ‌త ఏడాది మే తొలివారంలో రాష్ట్ర విద్యుత్ వినియోగం స‌రాసరి 150 ఉంచి 160 మిలియ‌న్ యూనిట్లుగా ఉండేది. ఇప్పుడు ఈ విద్యుత్ వినియోగం 225 నుంచి 230 మిలియ‌న్ యూనిట్లు ఉంది. రాష్ట్ర స్థాపిత విద్యుత్ విద్యుత్ ఉత్ప‌త్తి 100 మిలియ‌న్ యూనిట్లు ఉంటే.. దాదాపుగా 150 మిలియన్ యూనిట్ల‌ను కొనుగోలు చేసి ప్ర‌జ‌ల‌కు ప‌వ‌ర్ క‌ట్స్ లేకుండా విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఉప మఖ్య‌మంత్రి చ‌ర్య‌లు చేప‌ట్టారు.తాత్కాలిక అవ‌స‌రాల కోసం విద్యుత్ కొనుగోళ్లు చేప‌డుతున్నా.. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే సొంతంగా విద్యుత్ ఉత్పాద‌క సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు త‌గు నిర్ణ‌యాల‌ను కూడా ఈ ప్ర‌భుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఆల్ట‌ర్నేటివ్ ప‌వ‌ర్ తో పాటు, గ్రీన్, సోలార్ ఎనర్జీ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇప్ప‌టికు స్ప‌ష్టంగా చెప్పారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...