- పట్టు బిగిస్తున్న రేవంత్ రెడ్డి
- పక్కా వ్యూహంతో పార్లమెంట్ ఎన్నికల స్కెచ్
- బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతిగా ధీటైన ప్రణాళికలు
- పూర్తి పగ్గాలు ఇచ్చిన అధిష్టానం
- నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేడు రేవంత్ రెడ్డి
- ప్రసంగాలలో ప్రత్యర్థులపై అస్త్రాలు
పక్కా వ్యూహం, విజన్ తో వెళుతున్న సీఎం - మాటల్లో మెరుపులు, ప్రత్యర్థులపై విరుపులు
- 10 నుంచి 12 స్థానాలు గెలిపించుకునేలా పక్కా వ్యూహం
Telangana C.M. Revanth Reddy Rising Strength Lok Sabha : తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి క్రమంగా పట్టు బిగిస్తున్నారా? రేవంత్ మరో వైఎస్ఆర్ లా మారబోతున్నారా? అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లేనా? పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారా? ఎంపీ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ సూచించిన వారికే అధిష్టానం మొగ్గు చూపిందంటే రేవంత్ పై ఉన్న నమ్మకం అది. ఇక పార్లమెంట్ ఎన్నికలలో పక్కా వ్యూహంతో వెళుతున్న రేవంత్ పది స్థానాలను గెలిపించుకోగలిగితే అటు అధిష్ఠానం, ఇటు పార్టీ సీనియర్ల మద్దతు లభించినట్లే…అది కూడా ఇంకా ఒక్క అడుగు దూరమే ఉంది. భవిష్యత్ లో నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణ వంటి కీలక అంశాలలో నిర్ణయం తీసుకునేలా రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లు. ఇక రేవంత్ మర్క్ అసలు పాలన మొదలుకానుంది.
రేవంత్ అంటేనే ఒక వ్యూహం..ఒక విజన్
రేవంత్ అంటేనే ఒక వ్యూహం..ఒక విజన్ తో పనిచేస్తారనే టాక్ పార్టీ వర్గాలలో ఉంది. మెరుపుల్లాంటి మాటలు..సూటిగా నేరుగా..కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు ఆయనలో కనిపించే ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక రాజకీయ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు ప్రదర్శిస్తారు. ఏ మాత్రం వెనక్కి తగ్గటం తెలియదు. అడుగు వేశాడంటే… ముందుకే వెళ్తారు రేవంత్ రెడ్డి. ఆధారాలు, సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే రేవంత్… తను ఎక్కడ ఉన్నా కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తారనే చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో…. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి… టీటీడీ తరపున బలమైన వాయిస్ గా మారారు. ప్రత్యర్థులు కూడా సమాధానం ఇవ్వలేని విధంగా… తన ప్రశ్నాస్త్రాలను సంధించేవారు. కాంగ్రెస్ లో చేరినప్పుడు పరిస్థితులు పార్టీకి ఎంత మాత్రం అనుకూలంగా లేవు. దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగు అనే పరిస్థితికి వచ్చంది. సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి అన్నీ తానై ముందుండి నడిపించారు. నేతల మధ్య అంతర్గత సమస్యలు ఉన్నా…. వెనక్కి తగ్గలేదు. హైకమాండ్ తో నిత్యం టచ్ లో ఉంటూ… పార్టీని గాడిలో పడేశారు. కీలకమైన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ఏ నేత ప్రచారం చేయని విధంగా… రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేసి…. కాంగ్రెస్ విజయంలో కీలంగా వ్యవహరించారు.
ఏఐసీసీ ప్రమేయం లేకుడానే అభ్యర్థి ప్రకటన
ఇక గతంలో పని చేసిన ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఏఐసీసీ ప్రమేయం లేకుండా అభ్యర్థిని ప్రకటించిన దాఖలలు లేవు. గతంలో వైఎస్సార్ మాత్రమే తన మార్క్ ను చూపిస్తూ అభ్యర్థులను ప్రకటించారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మాత్రం రేవంత్ కు అధిష్టానం పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అటు ఢిల్లీ పర్యటనల్లోను రేవంత్ తన మార్క్ ను చూపించి అదిష్టానం పెద్దలకు ఇక్కడ జరుగుతున్న రిపోర్ట్ ను ఇచ్చారు. దాంతో పూర్తిగా ఆయనను నమ్మిన అధిష్టానం భవిష్యత్ నిర్ణయాలపై కూడ స్వేచ్చ ఇచ్చేశారు. . ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ వ్యవహరించిన వ్యూహం కూడా పార్టీకి కలిసోచ్చింది. కొన్ని చోట్ల తన ముఖ్యమైన అనుచరులు ఉన్న కూడా వారి సీట్లు త్యాగం చేయించి గెలుపు గుర్రాలకు పట్టం కట్టారు. దీంతో రేవంత్ కమిట్ మెంట్ అప్పటి నుండే పార్టీ గుర్తిస్తూ వస్తోంది.
పార్లమెంట్ లో గెలుపు గుర్రాల వ్యూహం
ఇక సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇస్తున్న స్వేచ్ఛకు నిదర్శనం కోస్గి సభలో కేబినెట్‌లోని ముఖ్యమైన మంత్రులు స్టేజీపై ఉండగానే రేవంత్ వంశీచంద్ రెడ్డిని సభలో ప్రకటించడంతో ఇక రేవంత్ స్ట్రాంగ్ అవుతున్నారు అనే వాదనకు బలం చేకూరుతుంది. దీంతో పాటుగా పార్లమెంట్ పై కూడా సీఎం సీరియస్‌గా పోకస్ చేసినట్లుగా ఆర్థం అవుతుంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గానూ 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి, కాంగ్రెస్ హై కమాండ్ కు గిప్ట్ గా ఇవ్వాలని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తానై వ్యవహరించి పార్టీ భాద్యతలు మోసిన రేవంత్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక దీనికోసం కార్పోరేషన్ల భర్తీతో పాటుగా, కేబినెట్ విస్తరణ కూడా రేవంత్ రెడ్డికి స్వేచ్చను ఇవ్వనుంది హైకమాండ్. దీంతో మిషన్ -20 ఇయర్స్ పేరుతో, కాంగ్రెస్ పార్టీని ఇరవై ఎళ్లు అధికారంలో ఉంచేలా నేక్స్ట్ జనరేషన్ లీడర్‌షిప్‌పై పోకస్ చేశారట రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే కార్పెరేషన్ పదవులు, ముఖ్యమైన నియామాకాలు అన్ని రేవంత్ కు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ..
10 నుంచి 12 స్థానాలు టార్గెట్
పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించపెట్టడం కూడా రేవంత్ భుజస్కంధాలపైనే ఉంది. నేతలందరితో కలుపుకుని పోతూ వారి సహకారంతో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత వాటిని భర్తీ చేస్తామని, అందరూ కష్టించి పనిచేయాలని నేతలకు ఎవరికి వారిని ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ శాసనభ ఎన్నికలు జరిగిన వందరోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని టెన్ జన్ పథ్ కూడా లెక్కలు వేసుకుంటుందట.
రేవంత్ రెడ్డి కనీసం పది నుంచి పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం ఆయన ప్రతి నియోజకవర్గానికి తనకు అత్యంత నమ్మకమైన నేతలను నియమించుకుని ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేవంత్ పడుతున్న శ్రమకు వచ్చే ఫలితం తెలియాలంటే జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.