Tuesday, May 28, 2024

Exclusive

Warning: దమ్ముంటే టచ్ చెయ్..! కేసీఆర్‌కు సీఎం మాస్ వార్నింగ్

– కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలాగా హైటెన్షన్ వైర్‌లా నేనున్నా
– కేసీఆర్.. దమ్ముంటే టచ్ చేసి చూడు
– కాకి వాలినట్టు వాలితే.. మాడిపోతావ్
– గతంలో కరీంనగర్ ప్రజలు తిరస్కరిస్తే పాలమూరుకు వచ్చావ్
– ఇక్కడ గెలిచి ఇచ్చిందేంటి? తెచ్చిందేంటి?
– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్‌పై కుట్ర
– వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ నిప్పులు

Telangana CM Revanth reddy Mass Warning To KCR: కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారు టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు హైటెన్షన్ వైర్‌లా తాను కాపలాగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్‌కు దమ్ముంటే తమ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైటెన్షన్ వైర్ పై వాలితే కాకి మాడిపోయినట్టే మాడిపోతారు అంటూ హెచ్చరించారు.

మహబూబ్ నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ బహిరంగ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సీఎం పాలమూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘నా అడ్డా.. నా గడ్డ పాలమూరు. నేను పాలమూరు బిడ్డను. 2009లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తిరస్కరించారు. అందుకే ఆయన పాలమూరుకు అప్పుడు వలస వచ్చారు. ఇక్కడి నుంచి గెలిచి ఆయన పాలమూరు ప్రజలకు ఇచ్చిందేంటి? తెచ్చిందేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. జూరాల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా పార్లమెంటులో పాలమూరు గురించి మాట్లాడారా? ఆయనకు మళ్లీ ఓటు వేస్తే ప్రయోజనమేంటి? ఇప్పుడు పాలమూరు ప్రజలను ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడుగుతారు?’ అని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Also Read:ట్యాంపరింగ్‌,ఈవీఎంల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నలు.!

ఇదే ర్యాలీలో కేసీఆర్‌ కామెంట్స్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. చిటికె వేస్తే వస్తారని చెబుతున్నారు. చిటికె కాదు కదా మిద్దె ఎక్కి డప్పు కొట్టుకో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చుడు కాదు కదా నీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు ఉండరు. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తోడేళ్లుగా పడి ఒక్కొక్కరిని ఎత్తుకుపోవాలని అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఆ ఆటలు సాగవు. ఇప్పుడు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. కంచె వేసి కాపాడుకుంటా. హైటెన్షన్ వైర్ పై వాలితే కాకి ఎలా మాడి మసైపోతుందో తెలుసు కదా. దమ్ముంటే కేసీఆర్ ఒకసారి ప్రయత్నించి చూడు. కేసీఆర్ నీకు దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు’ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలి అని పాలమూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ‘కారుకు రిపేర్ వచ్చిందని, గ్యారేజీలో ఉన్నదని కేటీఆర్ అంటున్నారు. అది రిపేర్‌కు కాదు దాని ఇంజిన్ చెడిపోయింది. కారును తూకానికి పెట్టి అమ్మాల్సిందే. కారుదే కాదు.. కేసీఆర్‌కు కూడా అనుం చెడ్డది. ప్రమాణ స్వీకారం రోజే బోర్లా పడి బొక్కలు ఇరగ్గొట్టుకున్నారు. ఇప్పటికి కూడా సరిగా నడవలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలు కారును బండకేసి కొట్టిర్రు. వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టిర్రు. ఇంతా జరిగినా కేసీఆర్ ఇంక బింకాలకు పోతున్నారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని అన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా? అని అడిగితే తానే వారించినట్టు వివరించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తం గూటికి చేరుకున్నారు. రేపో మాపో ప్రకాష్ గౌడ్ కూడా జంప్ అవుతున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు షాకిస్తున్నా, ఇంకోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెబుతుండడం ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నమేనన్న చర్చ జరుగుతోంది.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy name: ఒక తరానికి ఆయన ఆరాధ్య పురుషుడు. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, పౌరాణిక పాత్రల కోసమే పుట్టాడా అనిపించే యశస్సు కలిగిన...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు సన్నాహాలు కేసును నీరుగార్చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నయీంతో రాజకీయ నేతల సంబంధాలపై ఆరా గ్యాంగ్ స్టర్ ఆస్తులపై తేలని లెక్కలు ...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో ఒక్కోప్రచార దిశ మార్చిన మోదీ మొదట్లో వికసిత్ భారత్ అంటూ ప్రచారం చివరికి వచ్చేసరికి విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు ముస్లింల...