Monday, October 14, 2024

Exclusive

Telangana:‘రవాణా’ప్రక్షాళన షురూ

  • రాష్ట్ర రవాణా శాఖపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్
  • దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి
  • బీఆర్ఎస్ అండతో రెచ్చిపోయిన రవాణా శాఖ అధికారులు
  • ప్రైవేటు బ్రోకర్ల అండతో దండుకున్న లంచాలు
  • ఒక్కో చెక్ పోస్ట్ లో ఏడాదికి సగటున రూ.8 కోట్ల అక్రమ రాబడి
  • తెలంగాణలోని పలు జిల్లాలలో ఏసీబీ ఆకస్మిక దాడులు
  • దాడులలో భారీగా కార్యాలయాలలోనే దొరికిన సొమ్ము
  • అవినీతి అధికారులను పెంచి పోషించిన బీఆర్ఎస్

Telangana ACB ridings on RTO offices seized correpted money:
తెలంగాణలో పలు జిల్లాలలో ఆర్టీఓ కార్యాలయాలలో , బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై ఒకేసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆర్టీఏ ఏజెంట్లు, ఆఫీసర్లను విచారిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇన్నాళ్లూ అడ్డూ అదుపూ లేకుండా సాగిన రవాణా శాఖ అధికారుల ఆగడాలు తారాస్ఠాయికి చేరుకున్నాయి. దాదాపు గత ఐదారేళ్లుగా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాలు, చెక్ పోస్టులలో భారీ ఎత్తున అవినీతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ మంగళవారం జరిపిన దాడుల్లో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. ఏకంగా కార్యాలయాలలోనే పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. ఇన్ని జరుగుతున్నా ఆర్టీఏ ఉన్నతాధికారులు మౌనంగా ఉన్నారంటే క్షేత్ర స్థాయిలో జరిగే తంతు మొత్తం వీళ్లకి తెలిసే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా శాఖలో ఆన్ లైన్ సర్వీసులు అంటూ ఎంత ఊదరగొట్టినా..ఆర్టీఏ బ్రోకర్లదే హవా. ఆర్టీఏ శాఖలో కొందరు ఉన్నతాధికారులు ప్రైవేటుగా కొందరు బ్రోకర్లను నియమించుకుని వాహనదారులనుంచి అడ్డగోలుగా లంచాలు వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యావరేజ్ న ఒక్కో చెక్ పోస్ట్ లో ఏడాదికి ఆరు నుంచి ఎనిమిది కోట్ల మేరకు అవినీతి జరుగుతోందని అంచనా.

ఒక్కోదానికి ఒక్కో రేటు

పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే టూ వీలర్ కు ఓ రేటు, కారుకు మరో రేటు, స్కూళ్లు, కాలేజీల వంటి బస్సుల లైసెన్స్ లకు మరో రేటు, రవాణా వాహనాల ఫిట్ నెస్ రెన్యువల్ కు ఓ రేటు, లెర్నర్ లైసెన్సుకు కంప్యూటర్ పరీక్షకు ఓ రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. ఒకవేళ వాహనదారులు నేరుగా వెళితే ఏదో ఒక సాకు చెప్పి వాళ్లను మళ్లీ మళ్లీ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ చివరాఖరికి బ్రోకర్లే శరణ్యం అనేటట్లు చేస్తున్నారు. ఇలా బ్రోకర్ల ద్వారా వెళ్లే అప్లికేషన్లకు పెన్సిల్ తో ఓ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చూడగానే వెంటనే పనులు చకచకా అయిపోతాయి.

అక్రమాలకు అడ్డాగా మారిన చెక్ పోస్టులు

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సైతం అక్రమాలకు అడ్డాగా మారాయి. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో ఉన్న అశ్వారావుపేట చెక్ పోస్టులో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. ఇక్కడ సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది కోట్ల అవినీతి జరుగుతోందని అంచనా. అప్లికేషన్లు, అనుమతులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయంటూ లంచం ఇవ్వకుండా వెళుతున్నా లారీలను వెంబడించి కేసులు పెట్టి వాళ్ల నుంచి 20 వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బడి బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఫిట్ నెస్ రెన్యువల్ సర్టిఫికెట్లు కేవలం బ్రోకర్ల ద్వారా వస్తేనే పనులు జరుగుతున్నాయి.

దళారులకు ఎర్ర తివాచీ

రంగారెడ్డి జిల్లాలో ఓ కీలక కార్యాలయానికి కొద్దినెలల క్రితం కొత్త అధికారి వచ్చాక ప్రైవేటు వ్యక్తులను ఆర్టీఏ కార్యాలయంలోకి అనుమతించడం ఆపేశారు. సదరు అధికారి సెలవులో ఉన్నప్పుడు కిందిస్థాయి అధికారులు దళారులకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. పాత వాహనాలకు యజమాని వివరాలు మార్చాలన్నా ఇక్కడ డబ్బు ముట్టజెప్పాల్సిందే. వాహనాల ఫిట్ నెస్ పరీక్షకు ఆటోకు రూ.300, ట్రాక్టర్ కు రూ.500 చొప్పున ఇవ్వాలి. కామారెడ్డి జిల్లాలో ఓ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులో కొద్ది కాలం క్రితం ఏకంగా 21 మంది రవాణా అధికారులు డిప్యూటేషన్ పై కొనసాగారు. హై లెవెల్ పైరవీలతో చాలాకాలం పాటు తిష్టవేసిన వారిని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పింపింది. ఇక్కడ ఉన్న ఉన్నతస్థాయి అధికారులు దాదాపు 20 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకున్నారు. వారి ద్వారా రోజుకు 15 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చూసుకుంటే ఆర్టీఏ శాఖలో ఇలాంటి వసూల్ రాజాలను ప్రోత్సహించింది బీఆర్ఎస్ సర్కారే అన్నది అర్థమవుతోంది.

సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

తెలంగాణలో అవినీత రహిత పాలన అందిస్తామని, అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే దశాబ్దాలుగా ఆర్టీఓ కార్యాలయాలలో పేరుకుపోయిన లంచగొండుల పనిపట్టే పనిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లంచాలతో బదిలీలను ఆపుకుంటూ ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసుకుని కూర్చున్న అధికారులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపించనుంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...