Team India Forced To Camp In Barbados As Airport
స్పోర్ట్స్

Team India: తుఫాన్‌లో చిక్కుకున్న టీమిండియా

Team India Forced To Camp In Barbados As Airport: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన జోష్‌లో టీమిండియా ఉంది. అయితే స్వదేశానికి వచ్చే భారత్‌ టీమ్‌కి తుఫాను రూపంలో కష్టాలు వచ్చిపడ్డాయి. టీమిండియా జులై 1 ఉదయం 11 గంటలకు భారత్‌లో ల్యాండ్‌ కావల్సి ఉండగా బెరిల్‌ తుఫాను టీమిండియాకు రిటర్న్‌లో దెబ్బతీసింది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన బెరిల్ తుఫాను కారణంగా విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి.

దీంతో బార్బడోస్‌లో భారత జట్టు ఇరుక్కుపోయింది. అంతేకాకుండా తుఫాను తీవ్రతతో బార్బడోస్ ఎయిర్‌పోర్టుని మూసివేశారు అధికారులు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరూ బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తుఫాను తగ్గి పరిస్థితి సద్దుమణిగాక టీమిండియా స్వదేశానికి ఆగమనం కానుంది.

Also Read: వింబుల్డ‌న్ పోస్టర్స్‌ వైరల్‌

తుఫాన్‌ కారణంగా చిక్కుకుపోయిన భారత టీమ్‌ బార్బడోస్‌లోని హిల్టన్‌లోనే బస చేయనుంది. ఇక టీమిండియా భారత్‌కు రాగానే ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు క్రికెట్‌ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్‌ సాధించిన టీమిండియా హీరోలకు ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లను కంప్లీట్‌ చేసింది.