Wednesday, September 18, 2024

Exclusive

Hyderabad: టీఎస్ ఆర్టీసీలో జీన్స్, టీషర్ట్స్ నిషేధం

T.S.RTC md Sajjanar taking decision to implement traditional dress code :

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులు వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇకపై సంప్రదాయ వస్త్రధారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జీన్స్ ఫ్యాంటులు, టీ షర్టులు ధరించి ఉద్యోగులు విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వస్త్రధారణలో సంస్థ గౌరవానికి భంగం కలుగుతుందని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ తెలిపారు. ఇప్పటిదాకా ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు కేవలం ఖాకీ డ్రెస్ లో మాత్రమే కనిపించేవారు. ఇక చెక్కింగ్ అధికారులు, సూపర్ వూజర్లు అంతా తెల్లటి వస్త్రాలు ధరించేవారు. అయితే డిపోలు, ఆర్టీసీ కార్యాలయాలలో పనిచేసేవారికి ఒక ప్రత్యేకమైన యూనిఫాం అంటూ లేదు. దీంతో వాళ్లు క్యాజువల్ వస్త్రధారణతో తమ విధులకు హాజరయ్యేవారు. ఈ విసయంపై ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు లేకపోవడంతో రంగురంగుల జీన్స్ ఫ్యాంట్లు, కలర్ ఫుల్ టీ షర్టులు ధరించి విధులకు హాజరవుతూ వస్తున్నారు.వీళ్లే కాదు టీఎస్ ఆర్టీసీలో పనిచేసే పెద్ద పోస్టులలో ఉండే ఉన్నతాధికారులు కూడా క్యాజువల్ డ్రెస్సులతో వస్తున్నారు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విసయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్‌ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్‌లైన్‌ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.

సంస్థ గౌరవాన్ని పెంచేలా డ్రెస్సులుండాలి

దేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్‌) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్‌) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్‌ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్‌ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్‌ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్‌ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు. రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్‌ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్‌ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...