Wednesday, May 22, 2024

Exclusive

Telangana: అభయ హస్తం సీట్లు ‘రిజర్వుడ్ ’

  • రిజర్వుడ్ స్థానాలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
  • నాలుగింట ఒక వంతు ఉన్న దళితులు, ఆదివాసీలు ఓట్లే కీలకం
  • గత అసెంబ్లీ ఎన్నికలలో 31 స్థానాలలో 23 కాంగ్రెస్ కైవశం
  • 14 ఎస్టీ, ఎస్సీ స్థానాలలో 9 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్
  • కలిసొచ్చిన చేవెళ్ల కాంగ్రెస్ డిక్లరేషన్
  • రిజర్వేషన్లు రద్దు చేస్తారేమోనని బీజేపీకి దళిత వర్గాలు దూరం
  • ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన బీఆర్ఎస్
  • ఆదిలాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస
  • ఆదినుంచీ కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్న వెనకబడిన వర్గాలు
  • రాజకీయ విశ్లేషకుల సర్వేలో వచ్చిన ఆసక్తికరమైన అంశాలు

 

Congress Party targeted s.c., s.t. voters in Lok sabha elections:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలోనూ అత్యధిక స్థానాలలో పాగా వెయ్యాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ…ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తిస్తూ…క్షేత్ర స్థాయి కార్యకర్తలనుంచి ఎన్నికల బరిలో నిలచిన అభ్యర్థుల దాకా ఉత్సాహపరుస్తూ పార్టీ క్యాడర్ లో పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉండేలా అహర్నిశలూ శ్రమిస్తున్నారు. అధిష్టానం తనకు ఇచ్చిన అవకాశాన్ని మరో సారి నిరూపించుకునే దిశగా రేవంత్ రెడ్డి అన్ని పార్టీల కన్నా మిన్నగా తెలంగాణలో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేసి అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా తమ పాలన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎస్సీ, ఎస్టీ,, ఆదివాసీల ఓట్ల అండతోనే మరోసారి పార్లమెంట్ విజయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యూహాలతో సాగుతున్నారు. ముఖ్యంగా ఎస్టీ నియోజనవర్గాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, ఎస్సీ నియోజకవర్గాలైన పెద్దపల్లి, వరంగల్ పై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీనితో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు విజయం రిజర్వుడ్ అయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంతో సత్ఫలితాలు

గత అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యంచాటిన సంగతి విదితమే. మొత్తం 31 నియోజకవర్గాల్లో 23 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఎస్సీ స్థానాల్లో 14, ఎస్టీ స్థానాల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్‌ చేజిక్కించుకోగా.. బీఆర్ఎస్ 5 ఎస్సీ, 3 ఎస్టీ స్థానాల్లో విజయం సాధించింది. తొలినుంచీ ఈ నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ అనుకున్న ఫలితాన్ని పొందగలిగింది. లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం పేరుతో ఏడాదిగా ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. పంచాయతీ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులను ఎంపిక చేసుకొని వారికి వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణనిచ్చింది. గులాబీ పార్టీ సిట్టింగ్‌ అభ్యర్థులను నమ్ముకొని ఎక్కువశాతం టికెట్లు వారికే ఇచ్చి నష్టపోయింది. కాంగ్రెస్‌ పాత అభ్యర్థులతో పాటు కొత్తగా బలమైన అభ్యర్థులనూ బరిలోకి దించింది. దళితబంధు కొంత మందికే ఇవ్వడం, మూడెకరాల భూపంపిణీలో ప్రభుత్వ వైఫల్యం వంటి వాటిని విస్తృతంగా ప్రచారంచేసింది.

దళిత, ఆదివాసీల ఓట్లే కీలకం
ఈ సారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరాంగణంలో నాలుగింట ఒక వంతు ఉన్న దళితులు, ఆదివాసీలు కీలకపాత్ర పోషించనున్నారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచార సరళిలో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల్లోని ఒక్కో కుటుంబానికి అంబేద్కర్​ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది. ఈ కేటగిరీల్లో టెన్త్​ నుంచి పీహెచ్​డీ స్టూడెంట్లకు ‘విద్యా జ్యోతి పథకం’ కింద రూ.10 వేల నుంచి 5 లక్షల దాకా ప్రోత్సాహకాలిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేస్తామని తెలిపింది.

తెలంగాణలో పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభా

.తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 15.45 శాతం మంది ఉన్నారు. 2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల నిష్పత్తి 9.08 శాతం. అయితే ఆగస్టు 2018లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్సీలు, ఎస్టీల నిష్పత్తి వరుసగా 18 శాతం 10 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాలలో ఎస్సీ ఓటర్ల సంఖ్య 15 శాతానికి పైగా ఉన్నట్లు ఎన్నికల గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం17 స్థానాలలో 4 స్థానాలలో ఎస్టీ ఓటర్ల సంఖ్య 10 శాతానికి మించి ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లే కీలకంగా మారారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2,472 గిరిజన తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ల పరిమాణాన్ని 10 శాతానికి పెంచారు. ఎస్టీ వర్గాలకు దళిత బంధు తరహాలో గిరిజన బంధును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులందరికీ గత ఏడాది జూన్‌ నుంచి పోడు భూమి పట్టాలను పంపిణీ చేస్తామని ఆర్భాటంగా చెప్పారే గానీ ఏవీ కూడా గిరిజనులకు అందలేదు.

కాంగ్రెస్ అంబేద్కర్ అభయహస్తం

తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ , బీఆర్ ఎస్ దళిత, ఆదివాసీ ఓట్లను చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. గత ఏడాది కాంగ్రెస్ చేవెళ్ల లో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషనుతో విజయం సాధించింది. దళిత బంధు పథకానికి అంబేద్కర్ అభయ హస్తంగా నామకరణం చేసి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తింప చేస్తామని,గృహ లక్ష్మిని ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకంగా మారుస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ,ఎస్టీ కుటుంబానికి ఇల్లు-స్థలం, ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షల సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చేవెళ్ల డిక్లరేషన్‌లో మూడు కొత్త ఎస్సీ కార్పొరేషన్లు-మాలలు, మాదిగలు, ఇతర ఉపకులాలకు ఒక్కొక్కటి- ఏర్పాటు చేస్తామని, వీటిలో ఒక్కొక్కదానికి రూ.750 కోట్ల వార్షిక గ్రాంట్‌లు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఎస్టీల కోసం కూడా మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, యెరుకల కార్పొరేషన్ వీటిలో ఒక్కొక్కదానికి రూ. 500 కోట్ల వార్షిక గ్రాంట్లను కేటాయిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. సమ్మక్క-సారలమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తిస్తామని కాంగ్రెస్, బీజేపీలు హామీ ఇచ్చాయి.

Publisher : Swetcha Daily

Latest

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Don't miss

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Hyderabad:రేవంత్ టీమ్ రెడీ

ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి కార్యాలయం కార్యాలయంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సీనియర్లు మంత్రులకు సంబంధించిన కీలక ఫైళ్ల క్లియరెన్స్ లో తీవ్ర జాప్యం తమకు చెడ్డపేరు వస్తోందని సీఎంకు ఫిర్యాదు చేసిన మంత్రులు ...

Hyderabad:వ్యవసాయం ..నో ‘సాయం’

బీఆర్ఎస్ హయాంలో ప్రకటనలకే పరిమితమైన వ్యవసాయం గడచిన మూడేళ్లుగా తెలంగాణ రైతాంగం ఆగం రైతులకు అందని సాయంపై కేంద్రంపై నిందలు రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకున్న బీఆర్ఎస్ సన్నవడ్ల సబ్సిడీ అన్న...

Telangana: ఏ జిల్లా.. ఏ జిల్లా?

- మళ్లీ తెరపైకి జిల్లాల అంశం - కేసీఆర్ హయాంలో శాస్త్రీయంగా జరగని విభజన - అన్ని జిల్లాలకు నిధులు సమకూర్చలేక అవస్థలు - అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లాలను కుదిస్తామన్న రేవంత్ రెడ్డి - ఎన్నికల కోడ్...