- ఎస్ఈ రాధాకృష్ణమూర్తి కనుసన్నల్లో రూ.500 కోట్ల టెండర్లు
- కాంట్రాక్టర్స్‌తో కలిసి అక్షరాలా వంద కోట్లు మాయం
- బోర్డు అప్రూవల్ లేకుండానే విచ్చలవిడిగా ఖర్చులు
- కాంట్రాక్టర్ల కోసం 5 ఎకరాల ఎస్కవేషన్‌కి మూడున్నర కోట్లు
- ఆ ప్రాంతంలో ప్రైవేట్ భూమి విలువ 10 లక్షలే
- అనవసర ఖర్చులు చేసిన రాధాకృష్ణ మూర్తి
- అడ్డమైన పనుల కోసమే మార్కెటింగ్ ఈఈ నుంచి ఎస్ఈగా అదనపు బాధ్యతలు
- తవ్వేకొద్దీ బయటపడుతున్న రాధాకృష్ణ మూర్తి కమీషన్ల దందా
Swetcha Effect Minister Asked About Ware Housing Tenders Scam : వేర్ హౌజింగ్ కార్పొరేషన్‌లో జరిగిన దందాలపై ‘స్వేచ్ఛ’ ఇచ్చిన కథనంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఎస్ఈ రాధాకృష్ణమూర్తిని పిలిచి వివరణ అడిగారు. గతంలో మార్క్‌ఫెడ్, ఎఫ్సీఐ, హాకా, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ ఆధ్వర్యంలో గోదాముల నిర్వహణ జరిగేది. కానీ, వీటిని కాదని నిర్వహణ బాధ్యత వేర్ హౌజింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. తక్కువ ధరకు లీజుకు తీసుకొని మెయింటెన్ చేయడం వల్ల దాదాపు వెయ్యి కోట్లు పోగయ్యాయి. ఆ తర్వాత నెలకు 40 కోట్లు వద్దన్నా ఆదాయం వచ్చి పడుతోంది. అయితే ఈ సొమ్ముని కారు చవకగా కొట్టేసేందుకు అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి అనుచరులు తిరుపతయ్య సాగర్ లాంటి వారు అప్పటి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మార్కెటింగ్ శాఖ ఎస్ఈ గా ఉండే లక్ష్మయ్య తప్పుడు పనులు చేయనని మెండికేశారు. దీంతో అలాంటి పనులు చేయకపోతే లాంగ్ లీవ్ తీసుకోండని అప్పటి మంత్రి ఆదేశించడంతో ఆయన వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఎలాంటి పనినైనా చేస్తానని రాధాకృష్ణమూర్తి ఎంటర్ అయ్యారు.
వేర్ హౌజింగ్‌లోని ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేశారు. ఆ అధికారులు ఉన్నప్పుడు ప్రతి టెండర్ 15 నుంచి 20 శాతం తక్కువకి వేసి దక్కించుకునేవారు. కానీ, రాధాకృష్ణ ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యాదాద్రి చౌల్ల రామారంలో 16.91 శాతం తక్కువ వేసిన టెండర్లను అగ్రిమెంట్ అయ్యాక రద్దు చేశారు. మళ్లీ నిరంజన్ రెడ్డి మనుషుల కోసం 4 శాతం ఎక్కువకి వేశారు. దీంతో 20 శాతం డబ్బులు ప్రభుత్వం లాస్ అయింది. మార్కెటింగ్ శాఖ దగ్గర నిరూపయోగంగా ఉన్న గోదాములను అక్రమంగా వాడేశారు. కార్పొరేషన్‌లో డబ్బులు దండిగా ఉన్నాయని ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించారు. కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించేలా వ్యవహరించారు ఎస్ఈ రాధాకృష్ణ మూర్తి. ఏ కార్పొరేషన్ అయినా టెండర్లను కమిషన్ ఆఫ్ టెండర్స్ అప్రూవల్ అయినా తర్వాతనే టెండర్లు కన్ఫమ్ అవుతాయి. కానీ, ఈ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ మాత్రం బోర్డు అప్రూవల్ మాత్రమే ఉండేలా ప్రత్యేక జీవోలు ఉన్నాయి. అయినా ఆ బోర్డుకు కూడా పంపివ్వకుండానే ఇష్టానుసారంగా ఖర్చులు పెంచేవారని ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నారు.
Read Also : గ్యారెంటీలతో కాంగ్రెస్ గెలుపు ధీమా..!
తిరుపతయ్యతో కలిసి దందా
రాధాకృష్ణకు ఈ ఏడాది మే లో ఉద్యోగ విరమణ ఉంది. పొడిగించిన మూడేళ్లలో ఆయన ఆస్తులు సర్వీస్ మొత్తం సంపాదించిన దానికంటే మూడొంతులు అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మంతా గోవాలో ఉన్న కుమారుడి కంపెనీకి చేరవేసి ఎలాంటి లాభాలు లేని కంపెనీకి ఆదాయం చూపించారట. వేర్ హౌజింగ్ కార్పొరేషన్ డబ్బులు ఎలా లాగేయాలో ఇట్టే పసిగట్టారు. వనపర్తి జిల్లా వీరయ్యపల్లిలో ఎకరం 15 లక్షలకు మించి ఉండదు. చిన్న చిన్న ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటికి ఖర్చు 30 లక్షలకు మించదు. కానీ, 3 కోట్ల 53 లక్షలు ఎత్తేశారు. ఆ డబ్బులు పెడితే చదునుగా ఉన్న పాతిక ఎకరాల భూమి వచ్చేదని అక్కడకు వెళ్లి వచ్చిన అధికారులు చెబుతున్నారు. ఇలా ఎన్నో తతంగాలు చేశారు. సివిల్ వర్క్, రూప్ రోలింగ్ వేరు వేరుగా టెండర్లు పిలిచి పనులు చేయించేవారు. దీంతో అనుభవం ఉన్న కంపెనీలు తక్కువగా బిడ్డింగ్ వేసి దక్కించుకునేవి. కానీ, రాధాకృష్ణ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా తక్కువ టెండర్ జరపలేదు. రూప్ రోలింగ్ కంపెనీలకు సివిల్ కాంట్రాక్టర్స్‌కి లింకులు పెట్టి వారిని ఆయన చేతిలో పెట్టుకుని కమీషన్స్ ఆట ఆడేవారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎల్జిబులిటీ ఉన్న కంపెనీలు అన్నీ అర్హత సాధించకుండా పోయాయి. తిరుపతయ్య సాగర్ లాంటి అనర్హత లేని కంపెనీలు ఫోర్జరీ, మార్ఫింగ్ చేసిన పత్రాలతో అర్హతలు సాధించాయి. వేర్ హౌజింగ్‌లో తిరుపతయ్య చేసిన పనులే 120 కోట్లు ఉంటాయన సహచరులు చెబుతున్నారు.
అప్రూవల్ లేకుండానే టెండర్లు
ప్రతి పనిని ఎక్కువ మొత్తంలో చేయించడంలో దిట్టగా మారిన ఎస్ఈ బోర్డు అనేది ఉందని మర్చిపోయారు. ఇందులో సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్, సీడబ్ల్యూసీ ఈఏం, ఎస్బీఐ బ్యాంకు జనరల్ మేనేజర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెంట్రల్ మెంబర్, సభ్యులుగా ఉంటారు. వీరి అప్రూవల్ లేకుండానే ఎక్కువ ధరకు టెండర్లను ఇచ్చేశారు. బోర్డు మీటింగ్‌కి టెండర్ల విషయం వెళితే ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందేమోనని అక్కడికి వెళ్లకుండానే అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి, ఆయన అనచరుల బలంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
Read More: ఈ దోపిడీ పార్టీ తెలంగాణకు అవసరమా?
ఎస్ఈపై మంత్రి తుమ్మల సీరియస్!
‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ కథనంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఎస్ఈ రాధాకృష్ణను పిలిపించి వివరాలు అడగారు. అయితే, తాను కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి టెటర్ రాశానని చెప్పారు. ఆర్ అండ్ డీ డిపార్టమెంట్ అంటూ మెన్షన్ చేయకుండా మొత్తం మంత్రిత్వ శాఖకు పంపడంతో వివరణ రావడం లేదు. అదే కోర్టును ఆశ్రయించిన కంపెనీకి గంట వ్యవధిలోనే ప్రభుత్వ అఫీషియల్ మెయిల్ ద్వారా తాము ఎలాంటి అనుమతులు పొడిగించ లేదని స్పష్టం చేస్తూ మెయిల్ వచ్చింది. తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మంత్రి వద్ద అనేక విషయాలు చెప్పినట్లు సమాచారం. నిజాలు ఎప్పటికైనా కమీషన్లు తినమరిగిన వారికి చేదుగానే ఉంటాయి. అక్రమాలకు పాల్పడ్డప్పుడు మాత్రమే తియ్యగా తినేస్తారు.
-దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)