Monday, July 22, 2024

Exclusive

TS Private Schools: ప్రైవేటు స్కూళ్ల దోపిడీని అడ్డుకోరూ?

Stop private schools : ఈ విద్యా సంవత్సరం ఇంకా పూర్తి కానేలేదు. అప్పుడే తెలంగాణలో కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల జాతర మొదలైంది. ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌ స్కూల్‌, ఇంటర్‌నేషనల్ స్కూల్ వంటి ఆకట్టుకునే పేర్లతో వేల కోట్ల వ్యాపారానికి రంగం సిద్ధమైపోయింది. ఇక, వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు పూర్తయ్యాయంటూ కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు బోర్డులు కూడా పెట్టేశాయి. అడ్మిషన్లతోపాటు పనిలో పనిగా తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకుంటూ పై తరగతులు పుస్తకాలు కూడా ముద్రించి అమ్మేస్తున్నారు. వీటికి తోడు షూస్, యూనిఫాం, బస్ ఫీజు, స్పోర్ట్స్‌ డ్రెస్, బెల్టు ఇతర స్టడీ మెటీరియల్‌ పేరుతో ముందస్తు వసూళ్లు సరేసరి. ఏటికేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ కార్పొరేట్ స్కూళ్లు పిల్లల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. తమ పిల్లలను ఉన్నతమైన, నాణ్యమైన చదువులను చదివించాలని తల్లిదండ్రుల ఆంకాంక్షను ఈ కార్పొరేట్ స్కూళ్లు దోపిడీకి సాధనంగా మలచుకోవటం విషాదం.

విద్యాహక్కు చట్టం సెక్షన్‌-6 ప్రకారం నిబంధనల మేరకే అడ్మిషన్లు ఇవ్వాలి. సెక్షన్‌-11 ప్రకారం, ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. అలాగే విద్యార్థుల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్‌ 1, 2 ప్రకారం స్కూల్‌ బోధనా, బోధనేతర సిబ్బంది విద్యార్హతలు, వారి వివరాలు, వేతనాల లెక్కలతో సహా నోటీస్‌ బోర్డ్‌లో పెట్టాలి. బోధనా సిబ్బందికి డీఎడ్, బీఎడ్ అర్హత ఉండాలి. సెక్షన్‌ -12 ప్రకారం టీచర్‌, విద్యార్థుల నిష్పత్తి 1:20కి మించరాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు స్కూలు యాజమాన్యం తన మొత్తం అడ్మిషన్లలో 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగులు వంటి స్టేషనరీ వ్యాపారం, కేంపస్‌లో క్యాంటిన్ నిర్వహించటం నిషేధం. ఏటికాయేడు వసూలు చేసిన ఫీజు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి.

Read More:అధికారం పోయినా.. అహంకారం పోలే..!

మున్సిపాలిటీలోని స్కూళ్లలో 1000 చదరపు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ అనుమతి తోనే ప్రారంభించాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి. చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, వాటిలో టవలు, సబ్బు వంటివి ఉంచాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్‌ అని బోర్డు పెట్టాలి. అడ్మిషన్లు పూర్తైన నెలలోపు తల్లిదండ్రుల కమిటీని నియమించాలి. ఇందులో 50% తల్లులు, 25% ఉపాధ్యాయులు, 25% తండ్రులు ఉండేలా చూడాలి. ఈ కమిటీని ఏటా మారుస్తుండాలి. ప్రతి నెల పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి మినిట్స్ బుక్‌లో వివరాలు రాయాలి. ప్రతి పాఠశాల కంప్లెయింట్ బాక్స్ పెట్టాలి. ఫీజు స్లిప్పులను చిన్నారుల చేతికి ఇవ్వకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనల గురించి నూటికి 90 శాతం మంది తల్లిదండ్రులకు గానీ, స్కూళ్లలో పనిచేసే టీచర్లకూ అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణ కోసం ఉన్న పై నిబంధనలు, ఉత్తర్వులన్నీ ఆచరణలోకి వచ్చేసరికి గాలిలో తేలిపోతున్నాయి. 1994లో వచ్చిన జీవో నెం1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేసినా, వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు తేల్చి చెబుతున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం – 91లో ఫీజు స్ట్రక్చర్‌‌ను స్పష్టంగా నిర్వచించినా, గతంలోనే దాని అమలును నిలిపివేసేలా ప్రైవేటు యాజమాన్యాలు కోర్టు స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధుల చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసుకొచ్చిన జీవో నెం 46/2010పై కూడా కోర్ట్‌ స్టే తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు వాడకపోవటం, యాజమాన్యాల స్టేషనరీ తదితర కార్యకలాపాల మీద అధికారుల పర్యవేక్షణ కనిపించటం లేదు. అటానమస్‌ హోదా కల్గిన విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. 2002లో ‘టి.ఎ.పారు వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’, 2003లో ‘ఇస్లామిక్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’, 2004లో ‘మోడరన్‌ స్కూల్‌ వర్సెస్‌ ఢిల్లీ ప్రభుత్వం’, 2005లో ‘పి.ఎ. ఇనాందారి వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం’ కేసులలో సుప్రీంకోర్టు పైన జరుగుతున్న అవకతవకల మీద స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలైన ప్రైవేటు విద్యాసంస్థలు క్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయకుండా చూసేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. కానీ, నేటికీ ఈ ఆదేశాలు అమలు కావటం లేదు.

మరోవైపు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఫీజులు ఏటికేడు పెరుగుతూ పోతున్నాయి. ఒలంపియాడ్‌ పేరుతో 6వ తరగతి చదివే విద్యార్థికి రూ.80 వేల ఫీజు వసూలు చేస్తున్నారు. ప్లే క్లాస్‌ విద్యార్థి నుంచి స్కూల్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ. 80 వేల ఫీజులు పిండుతున్నారు. అడ్మిషన్ సమయంలో కొంత మొత్తం కడితే చాలనే స్కూలు యాజమాన్యాలు, అడ్మిషన్ తీసుకున్న వారం నుంచే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, నెల రోజుల్లో 60 శాతం ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే రాయితీలంటూ ప్రకటనలూ ఉన్నాయి. ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్ధాన్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి.

Read More:ఎడారి బతుకుల్లో ఉషస్సు ఎప్పుడు?

తెలంగాణలోని దాదాపు 12 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి 2018లో గత ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన మీదట, బడ్జెట్‌ స్కూళ్ళు (వార్షిక ఫీజు రూ. 20 వేల లోపు ఉండేవి) ఫీజుల నియంత్రణను స్వాగతించాయి. కానీ, స్కూల్‌ డెవలప్‌మెంట్‌ (అభివృద్ధి) చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోను కార్పొరేట్ విద్యాసంస్థలు తెరమీదకు తెచ్చాయి. నిజానికి ఈ పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును ‘అభివృద్ధి’గా చూపించాయనే ఆరోపణా ఉంది. తరగతి గదుల్లో పెట్టిన అత్యాధునిక సౌండ్‌ సిస్టం, టెక్నాలజీ వంటివాటినీ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు ఈ విద్యాసంస్థలు చూపిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రొ. తిరుపతిరావు కమిటీ సిఫారసుల అమలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నమే చేయలేదు.

తెలంగాణ సమాజానికి మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని గత ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచి సామాన్యులకు ఆరోగ్య భద్రత కల్పించిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు, కార్పొరేట్ స్కూళ్ల నియంత్రణ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో రెండు నెలల్లో కొత్త విద్యా సంవత్సరం అమలు కానున్న నేపథ్యంలో, ఈలోగా ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఒక చట్టాన్ని రూపొందించి దానిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని, గతంలో పలు కమిటీలు ఇచ్చిన సిఫారసుల మీద దృష్టిపెట్టి సమగ్రమైన విధానానికి రూపకల్పన చేయాలని మధ్యతరగతి, పేద వర్గాల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు ఆకాంక్షిస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Plastic: ప్లాస్టిక్‌పై పోరాటం, నేటి అవసరం..

Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్‌ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...