Star Heroine Manisha Koirala About Battling Depression And Ocd: కొన్ని కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు కూడా కష్టాలు తప్పవు. తెరముందున్న నవ్వులు తెర వెనుక మనకు కనిపించవు. ఎందుకంటే వారు కూడా మనలాగే వారివారి కుటుంబాల్లో సాధారణ జీవితాన్ని గడపాలి కాబట్టి. ఆ జాబితాలోకి స్టార్ హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె మనీషా కొయిరాల. తన గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అందం, అభినయం కలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా మూవీస్ ఆఫర్లను అందుకుంటోంది.
తన యాక్టింగ్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ రోజుల్లో మనీషా కొయిరాలా మూవీ వచ్చిందంటే చాలు థియేటర్లు హౌస్ పుల్ అయ్యేవి. అంతలా తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని కలిగి ఉంది ఈమె. ఇక ఇదిలా ఉంటే.. అంత పలుకుబడి సంపాదించుకున్న ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన మనీషా కోయిరాల తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో కొద్దికాలం మంచానికే పరిమితమైంది.
Also Read: స్టార్, స్టార్.. మల్టీస్టారర్…
అంతేకాకుండా విడాకులు తీసుకున్న తరువాత తాగుడికి బానిస అయింది. మానసికంగా సమస్యలను ఎదుర్కోలేక డిఫ్రెషన్, యాంగ్జైటీ డిజార్టర్, ఓసీడీ లాంటి సమస్యలను ఎదుర్కొంది. తన మ్యారేజీ గురించి ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. తాను విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిస అయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భామ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సరసన క్రిమినల్ మూవీలో నటించి ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. నేపాల్ మాజీ ప్రధాని బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలే ఈ మనీషా కొయిరాలా. నేపాలీ మూవీ ఫేరిభేతౌలాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.