- కర్ణాటకలో టెక్కీల కు నీటి కష్టాలు
- వారాంతం లోనే స్నానాలు
- సదుపాయాలు కల్పించలేకపోతున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు
- మంగళూరుకు కంపెనీలు షిప్ట్ చేద్దామనుకుంటున్న పలు ఐటీ కంపెనీలు
- బెంగళూరు కన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ
- మంగళూరుకు మేం రెడీ అంటున్న టెక్కీలు
- ఐటీ కంపెనీలకు ఎర వేస్తున్న కేరళ ప్రభుత్వం
- మంగళూరు ప్లాన్ తో కేరళకు చెక్ పెట్టాలని చూస్తున్న కర్ణాటక సర్కార్
Software companies goes to Mangalore :ఎక్కడ ఉన్నా ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తారు. బడా కంపెనీలు సైతం వారికి సాధ్యమైనంతవరకూ ఫేవర్ చేద్దామని చూస్తాయి.దేశంలో కరోనా మహమ్మారి సమయంలో కార్యాలయాలకు రావడానికి భయపడ్డారు. దీనితో కంపెనీలు వారు కోరినట్లుగానే వర్క్ ఫ్రం హోమ్ కు అనుమతులు ఇచ్చేశాయి. అయితే కరోనా తర్వాత మళ్లీ మామూలు పరిస్థితులకొచ్చినా చాలా మంది ఐటీలు ఇంకా కార్యాలయాలకు రావడానికి సుముఖంగా లేరు. మహానగరాలలో ఉండే ట్రాఫిక్ సమస్యలతో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చేబదులు…వర్క్ ఫ్రం హోమ్ కే ఇంకా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను కూడా మరింత దూరంగా ఊరి చివర్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే తమ ఉద్యోగస్తులకు మం చి సౌకరర్యాలు ఇవ్వడంతో ఇటీవల కాలంలో చాలా మంది ఐటీ ఉద్యోగులు బెంగళూరులో ఉద్యోగం చేసేందుకు సుముఖత చూపించారు. అంతా బాగానే ఉంది. గత ఏడాది వరకూ హ్యాపీగా ఉన్న బెంగళూరు టెక్కీలు ఇప్పుడు హఠాత్తుగా మంగళూరుపై మనసుపడుతున్నారు.
ఫిబ్రవరి నుంచే నీటి కష్టాలు మొదలు
ఇటీవల కర్ణాటక రాజధాని సిలికాన్ వ్యాలీ, టెక్ కంపెనీల డెస్టినేషన్ గా ఉన్న బెంగుళూరు సిటీ లో భయంకరమైన నీటి ఎద్దడి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే అక్కడ నీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చి, ఏప్రిల్ లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. నీటి కోసం అక్కడ ప్రజలు యుద్దమే చేయాల్సి వస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టాయి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
కేరళకు చెక్ పెట్టాలని చూస్తున్న కర్ణాటక
వైట్‌ఫీల్డ్, కేఆర్ పురం, ఎలక్ట్రానిక్స్ సిటీ, ఆర్‌ఆర్ నగర్, కేంగేరీ, సీవీ రామన్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్న అధికారులు.. పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. టి కొరతతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని ఉద్యోగులు కోరుతున్నారు. నీటి లభ్యత ఉన్నచోటుకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజులకు ఓసారి స్నానం చేస్తూ.. ఆహారం కోసం ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని నివసిస్తున్న, స్థిరపడ్డ చాలా మంది టెక్కీలకు చేదు వార్త ఒకటి వైరల్ అవుతోంది. కర్ణాటకలో మరో నగరాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బెంగుళూరు పరిస్థితిని బూచీగా చూపించి కేరళ ప్రభుత్వం టెక్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఐటీ కంపెనీలు సైతం నీటి ఎద్దడి, ట్రాపిక్ ఇబ్బందుల కారణంగా బెంగుళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర నగరాల్లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టాయి. అయితే ఐటీ కంపెనీల చూపు ఇప్పడు మంగుళూరు పై పడింది.
మంగళూరులో అంతా అనుకూలం
కర్ణాటకలో మంగుళూరు ముఖ్యనగరం.. ఇక్కడ వసతులు చాలా వరకు అనుకూలంగా ఉండటంతో ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కార్యాల ఏర్పటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మంగుళూరులో ఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, ఇన్వెంచల్ టెక్నాలజీ, కాగ్నిజెంట్, లాంటి ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను ఇక్కడే ప్రారంభిచాయి. ఇటీవల మహింద్రా తన శాటిలైట్ ఆఫీస్ కూడా ఇక్కడే ప్రారంభించింది. రాబోయే రోజుల్లో మంగుళూరులో ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వం మంగుళూరులో తమ ఆఫీస్ ఏర్పాటుకు తోడ్పాటుతో పాటు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఐటీ కంపెనీల ప్రతినిధుల నిర్ణయాలకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేందుకు సిద్దమైతున్నట్లు వార్తలు వస్తున్నాయి.