Saturday, September 7, 2024

Exclusive

BRS Party : సారు.. కారు..రేసులో ఆఖరు

  • వరంగల్‌, మహబూబాబాద్‌‌‌ పోరులో లేని కారు
  •  ప్రచారంపై ఆసక్తి చూపని అభ్యర్థులు
  •  మొహం చాటేస్తున్న క్యాడర్
  •  మూడోస్థానానికే పరిమితమయ్యే ఛాన్స్
  •  కాంగ్రెస్‌ గెలుపునకే అవకాశాలు

Sir..Car..The End Of The Race : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం. లోకసభ ఎన్నికల వేళ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ నుంచి జంప్. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి అభ్యర్థులే దొరకని స్థితి. ఇది సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి. ఉమ్మడి వరంగల్‌లో కారు అసలు రేసులోనే లేదనే చర్చ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవుతుందని ముందే అంచనా వేస్తున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రకటించినా ప్రచారంలో జోష్ కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడానికి అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారు. విజయం కోసం కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఓరుగల్లు బీఆర్ఎస్‌కు కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 6 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లిలో హస్తం పార్టీ విజయఢంకా మోగించింది. ఒక్క స్టేషన్ ఘన్ పూర్‌లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం పెద్ద ఎదురుదెబ్బే. ఉద్యమకారుడైన దయాకర్‌కు మచ్చలేని నాయకుడిగా పేరుంది. అలాంటి నేత సిట్టింగ్ ఎంపీగా ఉన్నా బీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు. ఆ సీటును స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు ఇచ్చింది. అవమాన భారంతో దయాకర్ కారు దిగిపోయారు. కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన రాకతో వరంగల్‌లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. బీఆర్ఎస్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. సీనియర్ నేతలతోపాటు చోటామోటా నాయకులు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. క్యాడర్ కూడా దూరమయ్యే పరిస్థితిలో గులాబీ పార్టీ ఉంది. దీంతో కడియం కావ్య ఓటమిని ముందే ఊహించారనే చర్చ నడుస్తోంది. ఆమె పెద్దగా ప్రచారం చేయకపోవటంపైనా అనుమానాలు కలుగుతున్నాయి. తండ్రి కడియం శ్రీహరి ఛరిష్మానే నమ్ముకుని రాజకీయ ఆరంగేట్రం చేసిన కావ్యకు గులాబీ క్యాడర్ నుంచి ఆశించిన ఆదరణ కనిపించడం లేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అందువల్లే ప్రచారంపై స్పీడ్ పెంచడానికి ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Read Also:కేసీఆర్‌ అన్న కొడుకుకి హైకోర్టులో చుక్కెదురు

మరోవైపు, వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ రోజురోజుకు పుంజుకుంటోంది. బీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. కాషాయ పార్టీకి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో బలం ఉంది. 25 నుంచి 30 శాతం ఓటు బ్యాంకు ఉంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం మరో ప్లస్ పాయింట్. ఎంపీగా పోటీకి దిగితే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ కూడా రమేష్‌కే మద్దతుగా ఉంటుందనేది స్థానికుల మాట. మొత్తంమీద చూస్తే వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లు బాగా సాధిస్తుందనే అంచనాలున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. భూపాలపల్లిలోనూ కాంగ్రెస్ తర్వాత బీజేపీకే ఎక్కువ ఓట్లు వస్తాయని అంటున్నారు. స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తిలో మాత్రమే కాంగ్రెస్ తర్వాత రెండోస్థానంలో బీఆర్ఎస్ ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక్కడ బీజేపీకి సరైన క్యాడర్ లేకపోవడమే ప్రధానం కారణం. ఓవరాల్‌గా చూస్తే వరంగల్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ నుంచే పోటీ ఎదురవుతుందనే అంచనా ఉంది. బీఆర్ఎస్ మూడోస్థానానికి పరిమితమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల కడియం కావ్య ప్రచారంపై అంత ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది.

మహబూబాబాద్‌లో గులాబీ వర్గపోరు

మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే మళ్లీ బీఆర్ఎస్ టిక్కెట్ దక్కింది. అయితే పరిస్థితులు సానుకూలంగాలేవని తెలుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలున్నాయి. డోర్నకల్‌లో మాలోత్ కవిత తండ్రి మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మధ్య వర్గపోరు నడుస్తోంది. సత్యవతి రాథోడ్ వర్గం కవితకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. మహబూబాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో మాలోత్ కవితకు ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోయింది. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ పరిస్థితి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ములుగు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ మెజార్టీ ఎంత వస్తుందనేది లెక్క. ఇక నర్సంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. గ్రౌండ్‌లో అంత యాక్టివ్‌గా తిరగడం లేదు. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పినపాక, ఇల్లెందులోనూ కాంగ్రెస్ బలంగా ఉంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపార్టీ అభ్యర్థి మహబూబాబాద్‌లో తీవ్ర వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గులాబీ క్యాడర్ నిత్తేజంగా మారిపోయింది.

Read Also : లోక్ సభ ఎన్నికల వేళ ఐటీ దర్యాప్తు సంస్థ దూకుడు

అందుకే ప్రచారంలో కారు స్పీడ్‌గా ముందుకెళ్లడం లేదు. ఓటమిని ముందే ఊహించిన అభ్యర్థి కవిత మొక్కబడిగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ బరిలో ఉన్నారు. ఆయనకు 55 శాతం నుంచి 60 శాతం ఓట్లు వస్తాయనే అంచనా ఉంది. రెండో స్థానం కోసమే బీజేపీతో బీఆర్ఎస్ పోటీ పడుతోందనే అంచనా ఉంది. బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ బరిలో ఉండటం బీఆర్ఎస్‌కు మైనస్ పాయింట్‌గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్‌కు దాదాపు 20 శాతం ఓట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఓటమి మాత్రమే కాదు మూడో స్థానంలో ఉంటామని భావిస్తున్న గులాబీ పార్టీ ప్రచారంపైనా దృష్టి పెట్టడంలేదు. క్షేత్రస్థాయిలో క్యాడర్ కూడా మొహం చాటేయడంతో గులాబీ అభ్యర్థి ప్రచారంలో ఎక్కడా జోష్ కనిపించడం లేదు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...