Digestion Issues: కొన్ని కారణాల వల్ల శరీరం ప్రోటీన్‌ను పూర్తిగా జీర్ణించలేకపోవచ్చు. ఇందులో ఎంజైమ్‌ల లోపం, జీర్ణ ప్రక్రియ బాలేకపోవడం లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ప్రోటీన్ జీర్ణ ప్రక్రియ కడుపులో ప్రారంభమవుతుంది. అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ దానిని చిన్న చిన్న పెప్టైడ్‌లుగా విభజిస్తాయి. తరువాత, చిన్న పేగులోకి చేరి, ప్రత్యేక ఎంజైమ్‌లు దానిని అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. తద్వారా శరీరం వాటిని గ్రహించగలుగుతుంది. అయితే, కడుపులో తక్కువ యాసిడ్స్, ప్యాంక్రియాటిక్ లోపం, గట్ డైస్బయోసిస్ వంటి సమస్యలు ఈ ప్రక్రియను అడ్డుకుంటాయి. దీని వల్ల ప్రోటీన్ పూర్తిగా జీర్ణం కాకుండా ఉండిపోతుంది. ఇది కడుపులో అసౌకర్యం, గ్యాస్, పోషకాహార లోపాలకు దారితీస్తుంది. ప్రోటీన్ జీర్ణం కాకపోవడం అనేది పెద్ద సమస్య. ఇది చాలా మందికి తెలీదు. ఈ సమస్యను గుర్తించడం ద్వారాఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. కడుపులో ప్రొటీన్ జీర్ణం కాకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
గ్యాస్
ప్రోటీన్ పూర్తిగా జీర్ణం కాకుండా పేగులో చేరినప్పుడు, అది కుళ్ళి అధిక గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గ్యాస్, అసౌకర్యం. కడుపు నొప్పి కలుగుతాయి.
తిన్న తర్వాత బరువుగా అనిపించడం
Digestion Issues ప్రోటీన్ జీర్ణం సరిగ్గా జరిగితే, భోజనం తిన్న తర్వాత నిదానంగా అరిగిపోతుంది. అయితే కడుపులో ఎంజైమ్‌ల లోపం వల్ల అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం ఎక్కువ సేపు కడుపులో ఉండి అలసట, బరువుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మీకు ప్రొటీన్ జీర్ణం కావడం లేదని అర్థం.
గుండెల్లో మంట
ప్రోటీన్ పూర్తిగా జీర్ణం కాకపోతే, అధిక యాసిడ్ ఉత్పత్తి అవ్వడం, తిన్న ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం కాకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది. అంటే గుండెల్లో విపరీతంగా మంటగా ఉంటుంది.
మలంలో ఆహారం కనిపించడం
ప్రోటీన్ సరిగా జీర్ణం కాకపోతే అరగదు. దాంతో మలంలో అరగని ఆహారం కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల లోపం, పోషకాహార సమస్యలు, పేగుల అలర్జీల సంకేతం కావొచ్చు.
తరచుగా అజీర్ణం లేదా కడుపులో నొప్పి
ప్రోటీన్ జీర్ణ సమస్యలు ఉన్నవారు, మాంసం లేదా ఇతర ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తిన్న తర్వాత తరచుగా కడుపు నొప్పి, అజీర్ణంతో బాధపడుతుంటారు.
అలసట
ప్రోటీన్ కండరాల రిపేర్, నాడీ వ్యవస్థ పనితీరు హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. శరీరం దీనిని పూర్తిగా గ్రహించుకోలేకపోతే అవసరమైన అమైనో ఆమ్లాలు అందకుండాపోతాయి. దీని వల్ల అలసట, బలహీనత, మెదడు మబ్బుగా అనిపించవచ్చు.
కండ పుష్టి తగ్గడం
అమైనో ఆమ్లాలను శరీరం సరిగ్గా గ్రహించుకోలేకపోతే కండరాల పుష్టి తగ్గిపోవచ్చు. దీని వల్ల కండరాలు పెరగవు.. పెరిగినా అవి ఎక్కువ కాలం నిలవవు.
నరాలు, కేశాల బలహీనత
ప్రోటీన్ జుట్టుకు ఎంతో అవసరమైన కెరాటిన్ కూడా అందిస్తుంది. ఇది జుట్టు, గోర్ల ఆరోగ్యానికి అవసరం. ప్రోటీన్ జీర్ణం సరిగ్గా జరగకపోతే, జుట్టు పలచబడటం, ఊడిపోవడం, గోర్లు బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి.
విపరీతమైన ఆకలి
శరీరం ప్రోటీన్‌ను పూర్తిగా గ్రహించుకోలేకపోతే మాంసం, గుడ్లు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువగా తినాలపిస్తుంది. అంటే మీకు మాంసం, పాల ఉత్పత్తులు తినాలని నోరూరుతుంది. పరిపడా ప్రోటీన్ తీసుకుంటున్నప్పటికీ, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తే, ఇది కచ్చితంగా ప్రోటీన్ జీర్ణ సమస్యగా గుర్తించాలి.
రోగనిరోధక శక్తి మందగించడం
ప్రోటీన్ మన రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. తక్కువ ప్రోటీన్ వల్ల వ్యాధులకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. గాయాలు ఒక పట్టాన మానవు. తరచుగా జలుబు, జ్వరం రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
పైన చెప్పిన లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా మీ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుచుకోవాల్సిందే. ఇది పెద్ద రిస్క్ కాదులే అనిపించచ్చు కానీ.. వయసు పెరిగే కొద్దీ అది కాస్తా పెద్ద సమస్యలకు దారి తీస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఎప్పటికప్పుడు లక్షణాలను గమనించుకుంటూ ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.