Tuesday, May 28, 2024

Exclusive

Encounter: మరోసారి పేలిన తూటా.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

Encounter: ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి తూటా పేలింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం, ఘటనా స్థలిలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. తాజాగా ఈ మృతుల సంఖ్య 8కి చేరింది. మరింత పెరిగే అవకాశాలూ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏకే 47 రైఫిల్, భారీగా మందుగుండ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర సరిహద్దు అబూజ్‌మడ్ దండకారణ్యంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ జవాన్లు ఈ నెల 29న కూంబింగ్ ప్రారంభించారు. మరుసటి రోజే అబూజ్‌మడ్ సమీపంలోని టేక్ మెటా-కాకూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు బృందానికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఉదయం ఆరు గంటల ప్రాంతంలోనే ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ తర్వాత స్పాట్‌ను పరిశీలించగా ఇద్దరు మహిళా మావోయిస్టులు, మావోయిస్టు క్యాడర్‌ల మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read: రుణమాఫీ బలంగా తీసుకెళదాం

అదే విధంగా స్పాట్‌లో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక ఏకే 47 రైఫిల్ కూడా ఉన్నది. ఆయుధాలతోపాటు రోజువారీగా వినియోగించే వస్తువులనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత సమగ్ర సమాచారం విడుదల కానుంది.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు అసలు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు అసలు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాను కారణంగా పశ్చిమబెంగాల్‌తో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించింది. రెండురోజుల క్రితం తుపాను తీరం...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో ఒక్కోప్రచార దిశ మార్చిన మోదీ మొదట్లో వికసిత్ భారత్ అంటూ ప్రచారం చివరికి వచ్చేసరికి విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు ముస్లింల...

National:బంగ్లా దిశగా రెమాల్

cyclone makes landfall near canning eye of Remal enters bangladesh and bengal తుఫానుగా మారిన రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇది ఉత్తర...