– కవిత బెయిల్ పిటిషన్ మీద విచారణ వాయిదా
– ఏప్రిల్ 4న మరోసారి విచారణ
– నైరాశ్యంలో గులాబీ శ్రేణులు
– అటు.. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
– తీహార్ జైలుకు తరలించిన పోలీసులు
– విచారణకు సహకరించటం లేదన్న ఈడీ
– కేసు తేలేదాకా కీలక నిందితులంతా జైల్లోనే..!
Arguments On Bail Of BRS Mlc Kavitha, CM Kejriwal On April-4: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా పడింది. తన కుమారుడి పరీక్షల కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ఆమెకు మధ్యంతర బెయిల్‌తో బాటు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలని సింఘ్వీ కోరారు. కేసు నేపథ్యాన్ని సుదీర్ఘ వాదనల అనంతరం ఈ కేసును ఏప్రిల్ 4 మధ్యాహ్నం 2.30 నిమిషాలకు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేయనున్నట్లు సింఘ్వీ వెల్లడించారు.
మరోవైపు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు విధించిన కస్టడీని మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈ కేసులో ఈడీ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగా, తొలుత 7 రోజులు, తర్వాత మరో 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. సోమవారంతో కస్టడీ సమయం ముగియగా, నేడు కేజ్రీవాల్ కోర్టు ఎదుట హాజరయ్యారు.
Read Also: బెయిల్ కాదు.. జైలే
కాగా.. ఈ కేసులో విచారణకు కేజ్రీవాల్ తమకు సహకరించటం లేదని, తాము అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వకపోగా, దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా జవాబిస్తున్నారని ఈడీ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఆయన తన మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఉపకరణాల పాస్‌వర్డ్‌లను చెప్పటం లేదని వారు కోర్టుకు వెల్లడించారు. కనుక తాము కొన్ని రోజుల తర్వాత మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, అప్పటివరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరగా, ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరైన సమయంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రధాని చేస్తున్న పనులు దేశానికి మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్టై తీహార్ జైలులో ఉండగా, ప్రధాన నిందితుడిగా కేజ్రీవాల్ కూడా చేరటంతో ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది.