- ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ఘటన
- ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోపే
- మంచి మార్కులు వచ్చాయని పార్టీ చేసుకున్న విద్యార్థులు
- ఒకే బైక్ పై నలుగురు కలిసి ప్రయాణం
- మలుపు వద్ద బైక్ ను ఢీకొన్ని ప్రైవేటు బస్సు
- ఎన్నికల సభకు జనాన్ని తరలించి ఖాళీగా వెళుతున్న బస్సు
- మృతులంతా తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం
- ఇల్లంద గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు
Bike Accident Warangal : అప్పుడే పరీక్ష రిజల్ట్స్ వచ్చి కొన్ని గంటలైనా కాలేదు. ఇంటర్ లో మంచి మార్కులతో పాసై భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ విద్యార్థులను మృత్యువు రూపంలో వచ్చిన ఓ ప్రైవేటు బస్సు వారిని బలి తీసుకుంది. హృదయ విదారక ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది.
చావుకొచ్చిన పార్టీ
ఇంటర్ పరీక్షల్లో పాస్ అయిన నలుగురు ఇంటర్ విద్యార్థులను ఘోర రోడ్డు ప్రమాదం బలికొంది. బుధవారం విడుదలైన 2024 ఇంటర్ ఫలితాల్లో పాస్ అయినందుకు పొన్న గణేశ్, తన ముగ్గురు స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. దీంతో నలుగురు కలిసి ఓ ప్రాంతంలో పార్టీ చేసుకుని ఒకే బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు బస్సు వారి బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న నలుగురు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పొయారు. మృతులు గణేష్, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్, సిద్దు గా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాలోని ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఒకే బైక్ పై నలుగురు
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్‌లు ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్నారు. ఓ మూలుపు మలుపు వద్ద ఎదురుగా బస్సు వస్తున్న విషయాన్ని వీరు గమనించలేదు. బస్సు డ్రైవర్ కూడా గమనించకపోవడంతో బైక్ను బలంగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సు హనుమకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెళుతోంది. మరణించిన వారిలో గణేశ్ అనే విద్యార్థి బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. . మృతులంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులని స్థానికులు చెప్పారు. ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం, రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోుదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.