Wednesday, May 22, 2024

Exclusive

Hyderabad: ఇకపై రేవంత్ మార్క్

  • జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరిపే యోచన
  • త్వరలో జరగనున్న మంత్రి వర్గ భేటీలో కీలక అంశాలపై నిర్ణయం
  • ఆంధ్రా ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
  • తెలంగాణలో కేసీఆర్ సెంటిమెంట్ ను దూరం చేసేందుకు కసరత్తు
  • ఇప్పటికే అధికార చిహ్నాల మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పై నిర్ణయం
  • తెలంగాణలో కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రంతో కేసీఆర్ మూలాలన్నీ చెరిపేసే యత్నం
  • రేవంత్ నిర్ణయానికి సీనియర్ కాంగ్రెస్ నేతల మద్దతు
  • క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కేడర్ ను పెంచుకునే యత్నం

Reventh Reddy latest news(Telangana Congress news):
అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టి..సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతూ తనదైన మార్పును చూపించిన సీఎం రేవంత్ ఇకపై తన మార్క్ ను చూపించబోతున్నారు. ఒక పక్క జాతీయ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని, అస్తిత్వాన్నికాపాడేది కాంగ్రెస్ పార్టీయే అని బలంగా జనంలో నాటుకుపోయేలా చేయాలని చూస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా వంద రోజుల పాలన అవగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ తో పథకాలన్నీ పెండింగ్ లో ఉండిపోవడం…అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి రావడంతో ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి తన మార్క్ ను చూపించలేకపోయారు. ఇకపై తెలంగాణ ప్రాంతీయతను కూడా మిళితం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ మూలాలపై దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పుకుంటూ తెలంగాణ తెచ్చింది తానేనంటూ తెలంగాణ జాతి పితగా, తెలంగాణకు తానే ఓ బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్న కేసీఆర్ ను అటు పార్టీ పరంగా..ఇటు సెంటిమెంట్ పరంగా జనానికి దూరం చేయాలనే యోచనలో రేవంత్ ఉన్నారని రాజకీయ విమర్శకులు అంటున్నారు. జూన్ 2న జరగబోయే తెలంగాణ ఆవిర్భవ దశ వార్షికోత్సవాన్ని వైభవంగా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు

త్వరలో జరగనున్న మంత్రి వర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ విభజన అంశాలు అందుకు సంబంధించిన ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై నివేదికలివ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేవించారు. వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించాలని ఆదేశించారు. సున్నితమైన ఉద్యోగుల బదిలీ అంశం కూడా సయోధ్యతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జఠిలమైన కృష్ణా జలాల అంశాలపైనా చర్చించనున్నారు. ఇక జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం తర్వాత ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భవ వేడుకలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి వర్గ భేటీలో ఈ అంశాల ప్రస్తావన కూడా ఉంటుందని భావిస్తున్నారు.

అధికార చిహ్నాల మార్పు

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇకపై కొత్తగా తనదైన మార్క్ చూపించాలని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేసింది.
పదేళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ చిహ్నాలన్నీ మార్చాలని నిర్ణయించింది. గతంలో హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయాలు సైతం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరించింది. వాటిలో ప్రభుత్వ అధికార రాజముద్ర, వాహనాల నంబర్‌ ప్లేట్లపై పేరు మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు వంటివి చేయాలని మంత్రివర్గం సంచలన ర్ణయాలు తీసుకుంది. ఇక ఇన్నాళ్లు వాహనాల నంబర్‌ ప్లేట్లపై కొనసాగుతున్న టీఎస్‌ పేరును కాస్త టీజీగా మార్చాలని కూడా నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసే వాహనాల నంబర్ ప్లేట్లన్నీ టీజీ పేరుతో కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్ర గేయంపై ఉన్న గందరగోళానికి గత మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టత వచ్చింది. రాష్ట్ర అధికార గేయంగా ‘జయ జయహే తెలంగాణ’ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్ ఆనవాలు కనిపించకుండా..

గత బీఆర్‌ఎస్‌ పాలనలో తీసుకున్న చిహ్నాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాజముద్ర వంటివి మారుస్తున్నట్లు సీఎం స్పష్టంచేశారు. అవన్నీ గత ప్రభుత్వం దొరలతనానికి నిదర్శంగా అవి ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇకపై ఆ చిహ్నాలన్నీ తెలంగాణ ఆత్మ ప్రతిబించించేలా ఉండాలని అనుకుంటున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేస్తానని, ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ తనదని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు అప్పట్లో. ‘గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగదు. గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేసే బాధ్యత మాది. ఏం చింతించకండి.. ఇకపై బీఆర్‌ఎస్‌ ఒక్క ఆనవాలు కూడా కనిపించదు. మీ ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ నాది’ అని అన్నారు. దీనితో రేవంత్ స్ట్రాటజీ ఏమిటో అర్థమవుతోంది. కేసీఆర్, బీఆర్ఎస్ మూలాలను సమూలంగా పాతర వేసేలా రేవంత్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ విషయంలో చొరవచూపి వచ్చేలా చేస్తే…తెలంగాణ రాష్ట్రం తనవలనే వచ్చిందని చెప్పుకుంటూ సెంటిమెంట్ ఓట్లతో పదేళ్లు పాలించిన కేసీఆర్ ఆటలు ఇకపై సాగనివ్వకూడదని అనుకుంటున్నారు రేవంత్ అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో క్యూ కట్టేలా చేస్తూ బీఆర్ఎస్ పార్టీని కుదేలుగా మార్చిన రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణ సెంటిమెంట్ నుంచి కేసీఆర్ ను దూరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Don't miss

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు - కాకతీయ వర్సిటీలో వీసీ దిష్టిబొమ్మకు శవయాత్ర - పది వర్సిటీలకు ఇంచార్జి వీసీల నియామకం - సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు Incharge...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఐటీ కారిడార్ గణనీయంగా అభివృద్ధి చెందింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్‌ను కూడా దీటుగా అభివృద్ధి...

Harish Rao: అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి

Bonus: కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లతోపాటు మిగిలిన అన్ని పంటలకూ కనీస మద్దతు ధర, దానిపై బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా మద్దతు ధర,...