- రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు
- మార్కెట్లో తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలపై ఫోకస్
- తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో రాష్ట్ర అప్పుల భారం రూ.72,658 కోట్లు
- పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ.6,71,757 కోట్లకు చేరిన రుణభారం
- రుణ భారం తగ్గించుకునే యోచనలో కాంగ్రెస్ సర్కార్
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గతంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ తో భేటీ
- రీ స్ట్రక్చరింగ్ ద్వారా నాలుగు శాతానికి తగ్గనున్న వడ్డీ భారం
- నెలకు రూ.700 నుంచి 900 కోట్ల మేర వడ్డీ ఆదా
- రేవంత్ ఆలోచనా విధానమే కరెక్ట్ అంటున్న ఆర్థిక నిపుణులు
reventh sarkar reduce the interests rates of loans with re-structuring system:
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ సర్కార్ ఎంతో గొప్పగా తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంది. తీరా చూస్తే మేడిపండు చందాన అప్పుల కుప్పగా మార్చేసింది. ఆ అప్పుల భారాన్ని ప్రజలపైనే మోపింది. తెలంగాణ ఏర్పడేనాటికి రూ.72,658 కోట్ల అప్పు ఉంది. ఈ పదేళ్లలో అది రూ.6,71,757 కోట్లకు చేరింది. అంటే సగటున రాష్ట్ర జనాభాలో ప్రతి ఒక్కరిపైనా దాదాపు రూ.1.91 లక్షల అప్పు భారం ఉన్నట్లు లెక్క. అంటే పదేళ్లలో పది రెట్లు రుణభారం పెరిగింది. ప్రభుత్వ గ్యారంటీలతో వివిధ కార్పొరేషన్లు, ఇనిస్టిట్యూషన్లు కింద రూ.2,22,670 కోట్లు తీసుకుంటే నాన్ గ్యారంటీ కింద రూ.59,414 కోట్ల అప్పులను గత బీఆర్ఎస్ సర్కార్ చేసింది. అలాగే బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయాలంటే దాదాపు 97 వేల కోట్లు కావాలి. అంతేకాదు ప్రాజెక్టుల గుత్తేదారులకు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టేశారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి.
నడ్డి విరిచే వడ్డీలు తీసుకున్న బీఆర్ఎస్
కేసీఆర్ సర్కార్ తమ గ్యారెంటీ కింద 95 శాతం అప్పులు తీసుకున్న కార్పొరేషన్లు ఐదు దాకా ఉన్నాయి. వీటికి చెల్లించే వడ్డీలే నడ్డి విరిచేలా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ లో తీసుకునే అప్పుకు యావరేజ్ వడ్డీ రేటు 5.63 శాతం ఉండగా..ఈ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులకు చెల్లించే వడ్డీ 8.93 శాతం నుంచి 10.49 శాతం వరకూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులను సరిదిద్దుకునే ఆలోచన చేస్తోంది. వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘రుణాల రీస్ట్రక్చరింగ్’పై పరిశీలన చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రం అప్పులకుప్పలా మారిపోయిందని.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులు గుదిబండలా మారాయని రేవంత్ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తున్నపరిస్థితిలో ఇప్పుడు వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘రుణాల రీస్ట్రక్చరింగ్’పై పరిశీలన చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరులో అధికారం చేపట్టిన తర్వాత.. కొద్దినెలల వ్యవధిలోనే పార్లమెంటు ఎన్నికలు రావడం, మార్చి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంతో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతగా దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో ఆ అంశంపై దృష్టి పెట్టి.. అప్పుల సమస్యను పరిష్కరించుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందునా ప్రధానంగా కార్పొరేషన్ల గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేయించుకోవాలని ఆలోచిస్తోంది. ఈ రుణాలను ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు బదిలీ చేయించుకుని, వడ్డీ సొమ్మును ఆదా చేసుకోవాలన్నది సర్కారు ఆలోచన. ఇలా కనీసం నెలకు రూ.700-900 కోట్లు ఆదా అవుతాయని భావిస్తోంది. అంటే సంవత్సరానికి ఎంత లేదన్నా రూ.10,000 కోట్లు ఆదా అవుతాయని, ఖజానాకు ఇది పెద్ద ఊరటనిస్తుందని ఆశపడుతోంది.
రీస్ట్రక్చరింగ్ విధానం ఏమిటి?
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను అంతర్జాతీయ స్థాయిలో తక్కువ వడ్డీలకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థలకు బదిలీ చేయడమే రీస్ట్రక్చరింగ్ విధానం. ఇందుకు గాను అంతర్జాతీయ సంస్థల వద్ద నుంచి రుణాలు పొందాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర సర్కార్ తరపున గ్యారంటీ ఇవ్వాల్సివుంటుంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అప్పులను, వాటికి కట్టే వడ్డీలను తగ్గించుకునేందు ఏం చేయాలనే విషయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన సూచనే రుణాల రీ స్ట్రక్చర్ విధానం. ఇప్పటికే ఎన్నికల ముందు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రుణాల రీ స్ట్రక్చర్ పై రేవంత్ రెడ్డి మాట్లాడారు. తక్కువ వడ్డీలతో రుణాలిచ్చే సంస్థలను రుణాల బదిలీకి ఒప్పించాలని అడిగారు. అయితే, కార్పొరేషన్ల పేర తీసుకున్న అప్పులను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు బదిలీ చేయాలంటే ఆ సంస్థలు రకరకాల వివరాలు అడుగుతాయి. గ్యారంటీ అప్పులను చెల్లించే స్థోమత ఆయా కార్పొరేషన్లకు ఉందని ప్రభు త్వం వాటిని సంతృప్తిపరిస్తేనే అప్పుల బదిలీకి అంగీకరిస్తాయి. ఉదాహరణకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.5000 కోట్ల వార్షిక రాబడి ఉంటుందని అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే విషయాన్ని వివిధ బ్యాంకులకు వివరించి అప్పులు తెచ్చారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ మేరకు.. పరిశ్రమలకు సరఫరా చేసే కాళేశ్వరం నీరు, వివిధ మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీకి సరఫరా చేసే నీటికి చార్జీల రూపంలో కార్పొరేషన్‌కు సొమ్ము వస్తుందని.. అది అప్పు, వడ్డీల చెల్లింపునకు ఉపయోగపడుతుందంటూ అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం వివరించనుంది. తద్వారా అంతర్జాతీయ సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలను బదిలీ చేసుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రానికి మేలు చేకూర్చే విధానమే
రుణాల రీస్ట్రక్చరింగ్ తో తెలంగాణకు మేలు జరిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణఉలు చెబుతున్నారు. నెలకు కనీసం రూ.700 నుంచి రూ.800 కోట్ల వడ్డీ ఆదా అయినా చాలు…ఎంతో కొంత ఊపిరి పీల్చుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు ‘జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా)’, ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంక్(ఏడీబీ)’, ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవల్‌పమెంట్(ఐబీఆర్‌డీ)’, కొరియన్ బ్యాంకు వంటివి తక్కువ వడ్డీలకే రుణాలిస్తున్నాయి. వీటి వార్షిక వడ్డీ శాతాలు 2 నుంచి 4 వరకు ఉంటాయి. తీసుకునే రుణ కాల పరిమితి, రుణ గ్రహీత దేశం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంతైనా వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రస్తుత వడ్డీల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది.