Wednesday, October 9, 2024

Exclusive

RRR: రేవంత్ రెడ్డి రోర్స్.. సింగిల్ ఇంటర్వ్యూతో సెన్సేషనల్ ఇమేజ్

– లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 250 లోపే
– స్థానిక సమస్యలే కీలకం
– పెద్దమనిషి తరహా లేని మోదీ
– కేసీఆర్ కుటుంబం జైలుకే
– వ్యవస్థలను గౌరవిస్తాం.. వ్యక్తులను కాదు
– తెలంగాణలో దోపిడీని ఆపుతాం
– అవినీతి బీజేపీ నేతల సంగతేంటి?
– ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో సీఎం రేవంత్
– సూటిగా సుత్తిలేకుండా హిందీలో అదిరిపోయిన ఇంటర్వ్యూ
– దక్షిణాది లీడర్‌గా తొలి ప్రయత్నంలోనే బలమైన ముద్ర
– ఖర్గే తర్వాత బలమైన సౌత్ లీడర్‌గా ఇమేజ్

హైదరాబాద్, స్వేచ్ఛ: పదేళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనకబడి పోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగా ప్రధాని నిజాయితీ పరుడని అనుకున్నా, ఆయన చుట్టూ ఉన్న అవినీతి పరుల సంగతేంటని నిలదీశారు. ‘రేవంత్‌ రెడ్డి రోర్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)’ పేరుతో గురువారం ఇండియా టీవీ ఇటీవల నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్పష్టమైన హిందీలో యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నలకు సూటిగా, దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబివ్వటంతో ఈ కార్యక్రమానికి ఇప్పటికే జాతీయ స్థాయిలో చక్కని ఆదరణ లభిస్తోంది. రేవంత్ ఇచ్చిన ప్రతి జవాబుకు ప్రేక్షకులు అడుగడుగునా చప్పట్లు కొట్టి ఆయన తీరును స్వాగతించారు. ఈ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసారం అయింది.

మోదీ గెలుపు అసాధ్యం

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం అసాధ్యమని ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు సీఎం రేవంత్ జవాబిచ్చారు. గత ఎన్నికల్లో యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, రాజస్థాన్ వంటి పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఏకపక్ష మద్దతు లభించటం లేదని, దక్షిణాదిని ఉన్న 129 సీట్లలో కర్ణాటకలో 10, తెలంగాణలో రెండు మూడు సీట్లు తప్ప ఇంకెక్కడా ఆ పార్టీ గెలవటం లేదని జోస్యం చెప్పారు. ఈ లెక్కన మోదీ చెబతున్న 400 సీట్లు అసాధ్యమని, గత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తనకు 100 సీట్లు వస్తాయని గొప్పలు పోయారని గుర్తుచేశారు. ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేందుకు కొంత సానుకూల వ్యాఖ్యలు చేయటం పార్టీ నేతలకు సహజమేనని, కానీ, ఇవి వాస్తవికంగా ఉండాలన్నారు. ప్రధాని చెబుతున్నట్లుగా 400 సీట్లు రావాలంటే, బీజేపీ పాకిస్థాన్‌లోనూ పోటీ చేయాలని సెటైర్ వేశారు.

ఈసారి ఓటర్లు ఆలోచించి ఓటు వేయబోతున్నారని, నిరుద్యోగం, అధిక ధరల వంటి అంశాలు ఈసారి ఓటర్ నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయన్నారు. యువతలో 62 శాతం నిరుద్యోగులేనని, వారంతా మోదీకి ఓటేయటం లేదన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ. 15 లక్షలు, ప్రధాని చెప్పిన 20 కోట్ల ఉద్యోగాల్లో వచ్చింది 7 కోట్లేనని గుర్తుచేశారు. దేశంలో రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని, వారి ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని పదేళ్లలో చేసిందేమీ లేదని, రైతుల ఆత్మహత్యలు, మద్దతుధర, రైతుల ధర్నాలను ప్రధాని నిర్లక్ష్యం చేశారన్నారు. నిరుపేదలకు నీడ కల్పించేందుకు చేసిన ఇళ్ల హామీ ఎటు పోయిందో ఎవరికీ తెలియదన్నారు. మోదీకి ముందున్న ప్రధానులంతా కలిపి రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మోదీ పదేళ్లలో రూ.113 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని, గత ప్రధానులు పదికాలల పాటు నిలబడే పనులు చేశారని, ఈయన హయాంలో చేసిన అలాంటి ఒక్కపని కూడా లేదని ఆరోపించారు. మూడోసారి ప్రధాని కావాలనే ఆయన కలలు కల్లలేనని స్పష్టం చేశారు.

Also Read: ఆకాశమంత స్ఫూర్తి.. అంబేద్కర్

వ్యవస్థలను గౌరవించే వ్యక్తిగా ప్రధానిని తప్పక గౌరవిస్తానని, తాను సీఎం అయ్యాక తొలిసారి తెలంగాణకు వచ్చిన మోదీని ‘బడే భాయ్‌’ అన్న మాట నిజమేనని, ఈ విషయంలో మోదీ తన పెద్ద మనసును మంచి నిర్ణయాల ద్వారా చాటుకోవాలన్నారు. గుజరాత్‌లో సబర్మతిని అందంగా తీర్చిదిద్దిన మోదీ అదే రీతిలో మా హైదరాబాద్ మూసీ సుందరీకరణకూ సాయం చేయాలన్నారు. మోదీ మాట్లాడే 5 ట్రిలియన్ ఎకానమీ నిజం కావాలంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా.. వంటి నగరాలన్నీ సమంగా అభివృద్ధి చెందాలని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణకు రావల్సిన ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌‌కు తరలించారని, మోదీతో తన భేటీని కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధుల భేటీగానే చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరమని, తమ నేత రాహుల్ గాంధీ మాదరిగా బీజేపీతో తానూ సైద్ధాంతిక పోరాటమే చేస్తున్నానని అన్నారు. ఒక సీఎంగా తాను మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటానని స్పష్టత ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలను సీఎంగా తాను ఆహ్వనిస్తానని, కానీ వారు వనరులు దోపిడీ చేయటానికి ప్రయత్నిస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. అదానీ తెలంగాణకు రూ. 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టారనీ, ఇందుకు భిన్నంగా మోదీ విమానాశ్రాయాలు, హైవేలు, రేవులను అదానీకి చౌకగా కట్టబెట్టారన్నారు.

ఆ అరెస్టు అక్రమమే

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని అక్రమంగా అరెస్టు చేశారని, కానీ, ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించటం తప్పేమీ కాదన్నారు. రెండేళ్లుగా కేసులు నడుస్తుంటే సరిగ్గా లోక్‌సభ ఎన్నికల టైంలోనే అరెస్టు చేయటం వెనక మర్మం ఏమిటో దేశ ప్రజలకు కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిని తాను సమర్ధించటం లేదని, కానీ, అరెస్టు చేసే పద్దతి, సమయం కూడా లెక్కలోకి తీసుకోవాలన్నారు. కేజ్రీవాల్‌కి మద్యం వ్యాపారులు వందకోట్లు ఇచ్చిన మాటను ప్రచారం చేస్తున్న బీజేపీ, అదే వ్యాపారి తమ పార్టీకీ రూ.400-500 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చిన సంగతినీ బయటపెట్టాలన్నారు. మొత్తం రూ.22,500 కోట్ల ఎన్నికల బాండ్లలో ఒక్క బీజేపీకే రూ.7వేల కోట్లు వచ్చాయని గుర్తుచేశారు.

Also Read: తెలంగాణ బీజేపీలో తెగని తండ్లాట

కేసీఆర్‌ అవినీతిని తేల్చుతాం

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎలాంటి అకారణమైన ప్రతీకారం తీర్చుకోవడం లేదని, నిజంగా తనకు అలాంటి కోరికే ఉంటే ఏనాడో అసెంబ్లీలోనే ఆయన చేసిన తప్పులకు చెంప చెళ్లుమనిపించేవాడినన్నారు. తెలంగాణలో జరిగిన అవినీతికి కవితను అరెస్టు చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతి విషయంలో ఆమెను అరెస్టు చేశారని రేవంత్‌ గుర్తుచేశారు. తెలంగాణలో కవిత అరెస్టు గురించి ఎవరూ మాట్లాడుకోవటం లేదని వెల్లడించారు. కేసీఆర్ మీద పూర్తి స్థాయి యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదని, పిల్లులు, కుక్కలపై గాక పులిమీదే పోరాటానికి దిగుతానన్నారు. అవినీతికి పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యలందరరూ విడివిడిగా ఉండటం తనకు ఇష్టం లేదని, వారికోసం చంచల్ గూడ జైల్లో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని ఆయన సెటైర్ వేశారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...