Sunday, September 15, 2024

Exclusive

Hyderabad: భాగ్యనగరం ‘అద్దెల’ భారం

  • హైదరాబాద్ నగరంలో భారీగా పెరిగిన అద్దెలు
  • అద్దె ఇంటి వైపే మొగ్గు చూపుతున్న సామాన్యులు
  • పనిచేసే కార్యాలయాల దగ్గర అద్దె ఇళ్లకు డిమాండ్
  • కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హుమ్ ఎత్తివేసిన కంపెనీలు
  • గత నాలుగేళ్లుగా భాగ్యనగరంలో 25 శాతం పెరిగిన అద్దెలు
  • అందుబాటులో లేని అపార్ట్ మెంటుల ధరలు

Hyderabad House rents demand increased:
వేగవంతంగా పెరిగిపోతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. నగరం నాలుగు దిశలలో డెవలప్ మెంట్ పరుగులు తీస్తోంది. ఇక్కడ అన్ని ప్రాంతాల వారూ ఉండదగిన వాతావరణం ఉండటం ప్లస్ పాయింట్. పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం మరో ప్లస్ పాయింట్. అయితే ఎక్కడ నుంచే ఉద్యగోలు, వ్యాపారాల కోసం వలస వస్తుంటారు నగరానికి వచ్చీ రాగానే వాళ్లు ముందుగా సొంతింటి కన్నా అద్దె ఇల్లు అందుబాటుల ఎక్కడ ఉంటుందా అని వెదుకుతారు. విద్యాసంస్థలు, ఉద్యోగ శిక్షణ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో సమీప ప్రాంతాలలో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో గృహాల అద్దెలు గణనీయంగా పెరిగాయి. నెలవారీ సగటు అద్దెలు కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఎనిమిది ప్రధాన నగరాల్లో 25 నుంచి 30 శాతం పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ టెక్‌ ఫ్లాట్‌ఫాం హౌసింగ్‌.కామ్‌ తాజాగా ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 25 శాతం పెరిగాయి. మూలధన విలువల పెరుగుదల కంటే నెలవారీ సగటు అద్దె వృద్ధి ఎక్కువగా ఉందని వెల్లడించింది.

వర్క్ ఫ్రం హోం ఎత్తివేత

దేశీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశించడంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. బహుళజాతి కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌ అనుసరిస్తున్నప్పటికీ సిటీలో నివాసం అనివార్యంగా మారింది. దీంతో కొవిడ్‌ సమయంలో ఖాళీ అయిన నివాసాలన్నీ తిరిగి భర్తీ కావడమే కాదు.. గత రెండేళ్లలో కొత్త ఉద్యోగుల రాకతో డిమాండ్‌ పెరిగింది. ఇవన్నీ కూడా అద్దెల ధరలు పెరగడానికి దోహదం చేశాయి. స్థిరాస్తుల ధరలు పెరగడం కూడా : కొవిడ్‌ అనంతరం ఇళ్లు, భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఆ తర్వాత కూడా పెరుగుదల స్థిరంగా కొనసాగింది. ఇంటిపై వ్యయం చేసేటప్పుడు వచ్చే అద్దెలు ఎంత అనేది కూడా చూస్తారు. దీని ఆధారంగానే కొందరు పెట్టుబడి పెడుతుంటారు. ఐటీ వంటి సేవా రంగం ఆధిపత్యం ఉన్న నగరాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో అద్దెలు 30 శాతానికి మించి పెరిగాయి.

డిమాండ్ కొనసాగుతుంది

మున్ముందు ఇదే విధంగా : రాబోయే రెండు మూడేళ్లలో సిద్ధమైన ఇళ్లు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ అద్దె డిమాండ్‌ కొనసాగుతుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో నిరంతర వృద్ధి కారణంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. ఇంటి అద్దెలు పెరగడానికి ఆర్థిక అంశాలు కూడా మరో కారణం. ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్, నెలవారీ వాయిదా, నిర్వహణ తదితర ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దీంతో చాలామందికి అద్దె ఇళ్లలో ఉండటమే మెరుగైన ఎంపికగా ఉంటుంది. ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉండాలనుకునేవారికి, ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్నవారికి ఇల్లు కొనడం కంటే అద్దె ఇంట్లో ఉండటమే మంచి ఆప్షన్ గా ఉంటోంది. దీంతో దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది.

మిలీనియల్ జీవనశైలి ప్రభావం

అద్దె మార్కెట్ పెరగడానికి మిలీనియల్ జనరేషన్ కూడా ఓ కీలక కారణం. మిలీనియల్స్ ఆస్తుల కంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఒక్కరే సొంతింట్లో ఉండటం కంటే స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉండటానికే మొగ్గు చూపిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, మిలీనియల్స్ కు పెరిగిన కొనుగోలు శక్తి కూడా దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి కారణాలు. మొత్తానికి చూస్తే.. దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు జీవనశైలి మార్పులు కూడా ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న యువతరం ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుంటే అద్దె ఇళ్ల డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది. దీంతో అద్దె మార్కెట్ లో రియల్ పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Apartment Balcony: ఇకపై కట్టే ఇళ్లు మరో లెక్క

appartment balconies extended up to 100 square arrange flower pots new trend : పచ్చని చెట్లు, గడ్డి, మొక్కల మధ్య నడుస్తూ సేద తీరాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాంక్రీట్...

India: నేచర్ రిసార్ట్స్ కు డిమాండ్

ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో పెరిగిన ఇళ్ల కొనుగోళ్లు రెండో ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లు పర్యాటక ప్రాంతాలపై మొగ్గు చక్కని ఆహ్లాదం, ఆరోగ్యం రెండూ కోరుకుంటున్న టెక్కీలు ఫ్యామిలీతో రిసార్టులలో ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఉద్యోగులు ...

Hyderabad : రియల్ ఊపు..ఉత్తరం వైపు

హైదరాబాద్ మధ్యతరగతి వర్గానికి అందుబాటులో అపార్టుమెంట్స్ నగర శివార్ల వైపు మొగ్గు చూపుతున్న మధ్య ఆదాయ వర్గాలు అభివృద్ధి పథంలో మేడ్చెల్ జిల్లా మెరుగైన రవాణా వ్యవస్థ తో పెరిగిన డిమాండ్ ...