Tuesday, June 18, 2024

Exclusive

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాను కారణంగా పశ్చిమబెంగాల్‌తో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించింది. రెండురోజుల క్రితం తుపాను తీరం దాటడంతో బెంగాల్‌ భయంతో వణికిపోయింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో బెంగాల్‌ వ్యాప్తంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి సెంట్రల్‌ కోల్‌కతాలోని ఎంటాలికి చెందిన బిబిర్‌ బగాన్‌ ప్రాంతంలో గోడ కూలి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో సుందర్‌బన్‌ డెల్టాకు ఆనుకుని ఉన్న నమ్‌ఖానా సమీపంలోని మౌసుని ద్వీపంలో ఓ పూరిల్లుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అదే విధంగా వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మరో నలుగురు మృతిచెందారు. కోల్‌కతాలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 5.30 వరకు 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెమాల్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు నీట చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుంచి రెమాల్‌ బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హావ్‌డా, హుగ్లీ జిల్లాల్లో రాష్ట్ర, జాతీయ విపత్తు దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Also Read:వికసిత్ కాదు విద్వేషిత్

నేల కూలిన వృక్షాలను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించాయి. అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో రైళ్లు, మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెమాల్‌ నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో కృషి చేసిన అధికార బృందాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. రెమాల్‌ తుపాను కారణంగా బెంగాల్‌ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.బంగ్లాదేశ్‌ తీరప్రాంతంపై రెమాల్‌ తుపాను తీవ్రంగా విరుచుకుపడింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, కుంభవృష్టితో బరిసాల్, భోలా, పతువాఖాలీ, సఖ్తీరా, ఛట్టోగ్రామ్‌లలో వందలాది గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. తుపాను కారణంగా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వందలకొద్దీ విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కోటీ యాభై లక్షల మందికి గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

National: పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌-గూడ్స్‌ రైలు ఢీ రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య ఉదయం 9గం. ప్రాంతంలో ఘటన ప్రమాదం ధాటికి గాల్లో లేచిన బోగీ ప్రమాదంలో 8 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే...

National:వారసత్వమా వర్ధిల్లు

భారత్ లో పెరిగిపోతున్న రాజకీయ వారసత్వం 1999 నుంచి అనూహ్యంగా పెరిగిపోయిన వారసత్వాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో పెరుగుతున్న వారసులు 2014 లోక్ సభ ఓన్నికలలో కాంగ్రెస్ నుంచి 36 మంది...

National:మోదీకి చెక్ పెట్టే ఏర్పాట్లు?

బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య రోజురోజుకూ పెరుగుతున్న అంతరం బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టిన ఆర్ఎస్ఎస్ రెండు పర్యాయాలూ ఆర్ఎస్ఎస్ సేవలను ఉపయోగించుకున్న మోదీ మూడో సారి మాత్రం దూరంగా పెట్టిన ప్రభావం ...