Rave party big twist 100 to 150 arrested by Bangalore police:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సన్ సెట్ – సన్ రైజ్ విక్టరీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ వ్యాపారవేత్త వాసు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీ నడిచినట్లు తెలుస్తోంది. ఈవెంట్ మొత్తానికి ఇన్ ఛార్జ్‌గా అరుణ్ వ్యవహరించినట్లు సమాచారం. పార్టీకి పెడ్లర్లు సిద్ధిఖీ, రణ్‌దీర్, రాజ్ వచ్చినట్లు తేలింది. భారీ మ్యూజిక్ సౌండ్‌తో స్థానికులకు నిర్వాహకులు ఇబ్బందులు కలిగించారు
పేర్లు చేర్చని పోలీసులు
. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడి నిర్వహించారు. అయితే రిమాండ్ రిపోర్టులో సినీ, రాజకీయ ప్రముఖల పేర్లను చేర్చకపోవడంతో బెంగళూరు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వాసు బర్త్ డే పార్టీపై బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. .రేవ్ పార్టీలో తెలుగు తమిళ కన్నడ సినీ నటులతో పాటు వ్యాపార రాజకీయ నేతలు కూడా పట్టుబడ్డారు.. 20కి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.. ఎండీఎంఏ డ్రగ్స్ తోపాటు గంజాయి చరస్ స్వాధీన పరుచున్నామన్నారు. నిందితుల జాబితాలలో 100 నుంచి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.