Ramgopal Varma : తెలుగు ఇండస్ట్రీలో వివాదాల దర్శకుడు ఎవరని అడిగితే టక్కున చెబుతారు అంతా రామ్ గోపాల్ వర్మ అని. వివాదాలలో తల దూర్చడమే కాదు సృష్టించడంలోనూ వర్మకు మించిన వారు లేరు. ఎప్పడూ ఏదో ఒక సంచలనం క్రియేట్ చేసి వార్తలలోకి ఎక్కేస్తుంటాడు. ఈయన అభిమానులు. ఇక ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. అయితే వర్మ ఏ పని చేసినా అదో సెన్సేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు కాంట్రవర్సీ సినిమాలు, రొమాంటిక్ చిత్రాలు తీస్తూ వచ్చిన ఆర్జీవీ ఇప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అమ్మాయిల అందాలను పొగుడుతూ.. వారితో బోల్డ్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.
చనిపోయిన శ్రీదేవితో కారు ప్రయాణం
తాజాగా ఆయనకు ఆరాధ్య దైవమైన సీనియర్ సినీ నటి శ్రీదేవితో కలిసి కారులో తిరుగుతున్న ఫొటో పెట్టి జనాలకు పెద్ద షాక్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మ.. అప్పట్లో తీసిన గొప్ప సినిమాల్లో… ఒక సినిమాగా.. క్షణక్షణం అని చెప్పవచ్చు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైంది. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారు అప్పట్లో.. ఈ సినిమాలో..మంచి కామెడీ తో పాటు … చక్కని పాటలు కూడా వున్నాయి. అయితే ఆ విషయం పక్కన పెడితే తాజాగా వర్మ చేసిన ఓ పని చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు. అసలేమైదంటే.. ఆర్జీవీకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమె అందానికే ఆయన బానిసై పోయారు. అంతే కాదు ఆమెకు పెద్ద భక్తుడు వర్మ. ఆయన ఎప్పుడూ ఆమెను పొగుడుతూనే ఉంటాడు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ, చనిపోయిన శ్రీదేవితో కారులో హాయిగా షికారు చేస్తున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో శ్రీదేవి వర్మ పక్కన కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటే.. ఆయన సిగరేట్ తాగుతూ కనిపించాడు. ఇక ఆ ఫొటోకు క్యాప్షన్ ఇస్తూ.. శ్రీదేవిని చూడటానికి స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ వర్మ నువ్వు ఏం చేస్తున్నావ్ అసలు.. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.