Tuesday, July 23, 2024

Exclusive

National:మరో యాత్రకు రాహుల్ సిద్ధం?

  • యూపీ ఓటర్లకు కృతజ్ఞత తెలిపేందుకు ‘ధన్యవాద్ యాత్ర’
  • అఖిలేష్ యాదవ్ తో కలసి 403 నియోజకవర్గాలలో యాత్ర
  • 11 నుంచి 15 వరకూ యాత్రలో పాల్గొననున్న రాహుల్, అఖిలేష్
  • యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్ కూటమి సీనియర్లు, కార్యకర్తలు
  • పార్లమెంట్ ఎన్నికలలో 43 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ కూటమి
  • కేవలం 33 సీట్లకే పరిమితం అయిన బీజేపీ
  • రాహుల్ కు కలిసొస్తున్న ‘యాత్ర’లు

Rahul Gandhi Akhilesh Yadav Danyavad yatra at Uttar Predesh:
సార్వత్రిక సమరంలో ఫలితాలు దాదాపు తారుమారయ్యాయి. మూడో సారి ప్రధానిగా అధికారం చేపట్టనున్న మోదీకి ఈ ఎన్నికలు చక్కని గుణపాఠం చెప్పాయి. ముఖ్యంగా మత రాజకీయాలు, మత విద్వేషాలతో ఓట్లు రావన్న సంగతి ఇప్పటికైనా బీజేపీ నేతలు గుర్తించాలని రాజకీయ విమర్శకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యూపీలోనే బీజేపీకి మెజారిటీ స్థానాలు తగ్గిపోయాయి. అనూహ్యంగా కాంగ్రెస్ కూటమికి అత్యధిక సీట్లు వచ్చాయి. ఈ ప్రభావం యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే రాహుల్, అఖిలేష్ ఆధ్వర్యంలో యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు కాంగ్రెస్ కూటమి సిద్ధం అవుతోంది. మొత్తం యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో ‘ధన్యవాద్ యాత్ర’ పేరిట ఈ యాత్ర ఉండబోతోంది. ఈ ధన్యవాద్ యాత్ర ఈ నెల 11న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఈ యాత్రలో కూటమి సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు.

33 సీట్లకే పరిమితమైన బీజేపీ

యూపీలో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కూటమి ఏకంగా 43 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ 33 సీట్లకే పరిమితం అయింది. సమాజ్ వాదీ పార్టీ 37.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా.. ఎస్పీ ఒక స్థానం, కాంగ్రెస్ 5 స్థానాల్లోనే గెలుపొందింది.

బీజేపీ ఓటమికి
యూపీలో బీజేపీ కూటమి ఓటమికి బలీయమైన కారణం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని చర్చనీయాంశంగా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి 2021 వరకూ యూపీ ఆర్థిక వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 1.95 శాతం చొప్పున మాత్రమే వృద్ధి సాధించింది. ఇక తలసరి ఆదాయ వృద్ధి సంవత్సరానికి 0.43 శాతం మాత్రమే. అంతకు ముందు అంటే 201217 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సంవత్సరానికి 6.92 శాతం చొప్పను పెరగింది. 2007-12 మధ్యకాలంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కాలంలో 7.28 శాతం చొప్పన పెరిగింది. యోగా అధిత్యనాథ్ హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పటికీ నేరస్థులపై యోగి అనుసరించిన విధానం పౌర హక్కులకు భంగం కలిగించే రీతిలో ఉన్నాయయి విమర్శలొచ్చాయి. పైగా యోగికి బుల్డోజర్ బాబాగా అపఖ్యాతి వచ్చింది. నేరస్థుల ఇళ్లపై బుల్డోజర్ పంపి కూల్చివేయడం వంటి చర్యలు అన్నీ బీజేపీపై వ్యతిరేకత పెంచేలా చేశాయి

రాముడి చుట్టూ రాజకీయాలు

యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా యమునా, గంగ ఎక్స్‌ప్రెస్‌ వే, సనౌటా–పుర్కాజీ ఎక్స్‌ప్రెస్‌ వే, వారణాసి –నోయిడాల మధ్య ఎనిమిది లేన్ల రహదారి వంటి అనేక భారీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. అలాగే కుశినగర్, జేవార్‌ల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికీ ప్రణాళిక సిద్ధమైంది. కానీ, ఈ రెండింటికీ బీజం పడ్డది మాయావతి కాలంలో. అఖిలేశ్‌ ఈ ఆలోచనలను కొనసాగించారు. మొత్తం మీద 2024 ఎన్నికలు హిందూత్వ భావజాలానికీ, సామాజిక న్యాయాన్ని కోరే మండల్‌ వర్గాలకూ మధ్య హోరాహోరీగానే సాగింది. రాముడి చుట్టూ తిరిగిన రాజకీయాలను కాస్తా ప్రజల జీవనోపాధి సమస్యల వైపు మళ్లించిన ఘనత ‘ఇండియా’ కూటమికి దక్కుతుంది. ఇంకోలా చెప్పాలంటే 2014 తరువాత మొదటిసారి బీజేపీ మతతత్వ పాచిక పారలేదని చెప్పాలి.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

National ‘సత్సంగ్’పై అన్నీ సందేహాలే !!

హథ్రస్ లో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో పెరుగుతున్న మృతుల సంఖ్య వందల సంఖ్యలో గుర్తుతెలియని మృతదేహాలు ‘సత్సంగ్’ అనుమతులపై అనేక అనుమానాలు లక్షల సంఖ్యలో భక్తులు కలిగిన భోలేబాబా ఇంటిలిజెన్స్ బ్యూరో...