Saturday, May 18, 2024

Exclusive

Phone Tapping : కదులుతున్న డొంక!.

– ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త లింక్స్
– 7 చోట్ల ట్యాపింగ్ సెంటర్లు
– హైకోర్టుకు చేరిన పంచాయితీ
– జడ్జీల ఫోన్ల ట్యాపింగ్ పై పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది. విచారణ జరిపే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాల్లో వార్ రూంలు ఏర్పాటు చేసి, వందల మందిని బ్లాక్ మెయిల్ చేయిన తీరు బయటపడింది. అలాగే, పలువురి నేతల ఫోన్లు ట్యాప్ చేసిన తీరు విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఈ పంచాయితీ హైకోర్టుకు చేరింది.

ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు హైకోర్టుకు చేరింది. గతంలో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ అడ్వొకేట్ అరుణ్ కుమార్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. కానీ, ఇప్పటి వరకూ దానిపైన స్పందన లేదన్నారు. రాజకీయ నేతలు, ఫిల్మ్ ఇండస్ట్రీ, రియల్టర్స్, ఫార్మా, వ్యాపారవేత్తలను వదల్లేదని, చివరకు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పారు. వీరికి ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నాయకులపై పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందని తెలిపారు అరుణ్ కుమార్. లేక పోతే కేసు నుండి వారు తప్పించుకునే అవకాశం ఉంది ఉందంటున్నారు అరుణ్ కుమార్.

కొత్తగా వెలుగులోకి ఖమ్మం లింక్స్

ఇప్పటికే ట్యాపింగ్ కేసుతో నల్గొండ జిల్లా షేక్ అవుతుండగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్‌లో పనిచేసి పార్టీని వీడిన, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. నేలకొండ పల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో ట్యాపింగ్ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని మరీ మాటలు విన్నట్టు చెప్తున్నారు. ఇందుకోసం ట్యాపింగ్ పరికరాలు తేవడంతో పాటు, హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తం ఏడు చోట్ల ట్యాపింగ్ సెంటర్లు

విచారణలో భాగంగా పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. నల్గొండ, హైదరాబాద్‌తోపాటు వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తేల్చారు. మొత్తం ఏడు ట్యాపింగ్ సెంటర్లతో వ్యవహారం అంతా నడిపినట్టు తెలుసుకున్నారు. కీలక నేతల కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కథంతా నడిచిందని అంటున్నారు.

నల్గొండలో పాపాలెన్నో!

నల్గొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ట్యాపింగ్ ద్వారా 40 మంది మహిళలకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబడ్డారు. నల్లగొండ, హైదరాబాద్ లో ర్ రూమ్ లు ఏర్పాటు చేశారు. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్ మెంట్లు చేసిన ఓ పోలీస్ అధికారి, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫోన్లు ట్యాప్ చేశాడు. పోలీసుల విచారణతో టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ గుట్టంతా రాధా కిషన్ రావు విప్పుతున్నారు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని వెల్లడించారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Congress: స్తంభాద్రిలో గెలుపు ఏకపక్షమే..

- లక్షకు పైగా మెజారిటీ లెక్కల్లో కాంగ్రెస్ - ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన విపక్షాలు - అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించిన హస్తం Khammam: తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం సీటుకు ఎంతో చరిత్ర ఉంది....

Hyderabad Metro: భాగ్యనగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad metro rail timings changed night service extended 45 minitues: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో నిర్వాహకులు శుభవార్త అందించారు. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక...

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలపై ఫోకస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో రాష్ట్ర అప్పుల భారం రూ.72,658 కోట్లు పదేళ్ల కేసీఆర్...