Monday, October 14, 2024

Exclusive

Phone Tapping: ట్యాపింగ్ కుట్రలు.. తెరవెనుక చీకటి వాస్తవాలు

– కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు
– 21 మందితో వాట్సప్ గ్రూప్
– పోల్-2023 పేరుతో కుట్రకు తెర
– హస్తం నేతల ఎన్నికల డబ్బే టార్గెట్
– ప్రభాకర్ ఆదేశాలతోనే అన్నీ చేశాం
– బీఆర్ఎస్ గెలుపు కోసమే కష్టపడ్డాం
– కామారెడ్డిలో రేవంత్ ఓటమికి స్పెషల్ టీమ్
– తిరపతన్న వాంగ్మూలంలో సంచలన నిజాలు

‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ కథనం

దేవేందర్ రెడ్డి,

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన కథనాలు ఇస్తోంది స్వేచ్ఛ. నిందితుల కన్ఫెషన్ రిపోర్టుల్లో ఉన్న వాస్తవాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుట్రలను జనం ముందు ఉంచింది. రోజురోజుకు ఊహించని మలుపులు తిరుగుతోంది ఈ కేసు. ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు అధికారుల వాంగ్మూలాలు సేకరించిన పోలీసులు తాజాగా ఈ కేసులో మరో కీలక నిందితుడైన ఎస్సై తిరపతన్న ఇచ్చిన వాంగ్మూలంలోని కొన్ని కీలక అంశాలను స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం సంపాదించింది. కాంగ్రెస్ ఓటమికి బీఆర్ఎస్ నేతల కోసం ప్రభాకర్ రావు, ప్రణీత్ కుమార్ ఆదేశాల మేరకు తాను ఏమేం చేసిందో ఈ వాంగ్మూలంలో తిరపతన్న పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

300 మందిపై నిఘా

1999లో నల్గొండ జిల్లాలో ఐపీఎస్ అధికారిగా ఉన్న ప్రభాకర్ రావు పనిచేసే కాలంలోనే వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఉద్దేశించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో తాను ఎస్సైగా పనిచేశానని తిరుపతన్న తెలిపాడు. ‘విధి నిర్వహణలో భాగంగా తరచూ మా పై అధికారిగా ఉన్న ప్రభాకర్ రావును కలిసేవాళ్లం. తర్వాత 2021 డిసెంబరు నుంచి 2023 డిసెంబరు మధ్యకాలంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టాను. ఈ సమయంలో పట్టణ, నగర ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదులకు నైతిక మద్దతు తెలిపే ప్రజాసంఘాల అనుపానులు కనిపెట్టి పై అధికారులకు ఉప్పందించటం ప్రధానమైన పనిగా ఉండేది. బేగంపేట కార్యాలయం కేంద్రంగా మా పని సాగేది. ఈ క్రమంలో సదరు ప్రజాసంఘాల వ్యక్తులకు చెందిన 300 మంది మీద నిఘా కోసం మా బృందానికి 3 కంప్యూటర్లు ఇచ్చారు. వీటిపై 8 మంది కానిస్టేబుల్స్, ఒక హెడ్ కానిస్టేబుల్ 24 గంటలూ పనిచేసేవారు’ అని అన్నీ తెలిపాడు.

హార్డ్ డిస్క్‌ల ధ్వంసం

తమ నిఘాలో ఉన్న వ్యక్తుల ఫోన్లకు సంబంధించిన సమాచారం మీద తాను ఓ కన్నేసి ఉంచేవాడిని తిరుపతన్న కన్ఫెషన్ రిపోర్టులో పేర్కొన్నాడు. ‘ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక రావటంతో అక్కడి వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘా కోసం నేను మునుగోడు వెళ్లాను. అప్పటికే ప్రణీత్ కుమార్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్‌ఓటీ) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కానీ, ఆయనకు అప్పగించిన బాధ్యతలేమిటో నాకు తెలియదు. అప్పట్లో రోజూ ఎస్‌ఓటీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్న ప్రభాకర్ రావు ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో రోజూ ఎస్‌ఓటీలోని కీలక సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చేవారు. ఎస్‌ఓటీ ఆఫీసు వద్ద అప్పుడప్పుడు ప్రణీత్ కుమార్ కనిపించేవారు తప్ప పెద్దగా మేం కలిసింది లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా సీవోవో ప్రభాకర్ రావు,టీం ఇన్‌ఛార్జి ప్రణీత్ కుమార్ నిర్ణయాల మేరకు మాకు గతంలో ఇచ్చిన కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌‌లు తీసి కొత్తవి వేసి, పాత వాటిని ధ్వంసంచేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు మా విభాగంలోని అనేక ఇతర కంప్యూటర్లు, సర్వర్లనూ మార్చిపారేశారు’ అని చెప్పుకొచ్చాడు.

వాట్సప్ గ్రూప్ కేంద్రంగా సమాచారం

‘2023లో మాకు కొన్ని ఇతర టాస్క్‌లనూ మా సీవోవో ప్రభాకర్ రావు కేటాయించారు. ఆయన ఆదేశాల మేరకు వారు చెప్పిన 40 నుంచి 50 మొబైల్ ఫోన్ల మీద నిరంతరం నిఘా పెట్టాం. కానీ, ఈ నంబర్లెవరివో మాకు తెలియదు. ఆ సమయంలో మా టీంలో ఎస్సై హోదాలో ఉన్న గట్టు మల్లు, చైతన్య, మల్లికార్జున్, ఆరెస్సై రాజవర్ధన్ రెడ్డి తదితరులతో కూడిన 21 మంది పనిచేసేవారు. ఆ టైంలో మా టీమ్ సభ్యులంతా కేవలం వాట్సప్ కాల్స్‌లో మాత్రమే మాట్లాడుకునే వాళ్లం. ఈ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు.. విపక్షాలకు చెందిన ఎన్నికల డబ్బు పంపిణీకి సంబంధించిన ఆపరేషన్స్ చూస్తున్న ప్రణీత్ కుమార్‌తో కలిసి పనిచేయాలని మా సీవోవో ప్రభాకర్ రావు నన్ను ఆదేశించారు. దీంతో నేను ఆ పూర్తిగా ఆ పనిలో ఉండిపోయాను. ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా లోకల్ పోలీసుల మద్దతుతో మేం కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతల డబ్బును పట్టుకున్నాం’ అని వివరించాడు తిరుపతన్న.

కాంగ్రెస్ నేతలే లక్ష్యం

తమ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు టీంలో కానిస్టేబుల్‌గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి 2023 అక్టోబరు 20న ‘పోల్- 2023’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడని, ఈ గ్రూపులో ఎప్పటికప్పుడు తమకు టార్గెట్ చేయబడిన విపక్ష నేతల సమాచారం అందుతుండేదని చెప్పాడు. ‘ఈ గ్రూపులో నేను, గట్టు మల్లు, చైతన్య, మల్లికార్జున్, ఆరెస్సై రాజవర్ధన్ రెడ్డి, కానిస్టేబుళ్లు కిరణ్, దినేష్, నీలగిరి శ్రీనివాసరావు, సదానందం, సాయికుమార్, సుధాకర్ రెడ్డి, వెంకటేష్, చాణక్య, ప్రకాష్, రాజ్ కుమార్, నరేష్ ఉన్నారు. ఆ రోజు నుంచి ప్రణీత్ కుమార్ మాకు అందిస్తూ వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోబీ, సైబరాబాద్, లోకల్ పోలీస్‌ల బృందాలు కలిసి పనిచేస్తూ, కాంగ్రెస్ నేతలకు చెందిన ఎన్నికల డబ్బును భారీగా స్వాధీనం చేసుకోవటం మొదలైంది. ఈ సోదాలన్నింటిలోనూ, మా టీం సభ్యులు నగదు తీసుకెళ్లేవారిని ఫాలో అయ్యేలా నేను ఆదేశాలు ఇవ్వటం, దీనికి స్థానిక పోలీసుల సాయం తీసుకోవటం జరిగింది. సదరు వ్యక్తుల మీద ఆయా పోలీసు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేశాం’ అని వివరించాడు.

పట్టుకున్న నగదు, వాటి యజమానుల వివరాలు

1) పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు గాలి అనిల్ కుమార్‌కు చెందిన రూ. 90 లక్షల నగదును కొల్లూరు దగ్గర పట్టుకున్నాం.
2) పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు కె. వినయ్ రెడ్డి, మరో నలుగురికి చెందిన రూ. 1,99,85,000 నగదును,
3) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన రూ. 7.5 కోట్లు
4) ఇదే సంస్థకు చెందిన రఘురాం రెడ్డి, బిలాల్‌కు చెందిన మరో రూ. 3 కోట్లు
5) కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సన్నిహితులైన చొప్పరి వేణు, ఇతరుల నుంచి మరో రూ. కోటి నగదు
6) రాజగోపాల్ రెడ్డికి మరో సన్నిహితులైన మధు, శ్రీహరి నుంచి రూ. 1.18 కోట్లు
7) రాజగోపాల్ రెడ్డికి మరో సన్నిహితులైన మధు, శ్రీహరి నుంచి మరో రూ. 42,66,500
8) కాంగ్రెస్ నేత జి.వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రతినిధి కందుల రవి కిషోర్ నుంచి రూ. 50,45,000
9) ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నిహితుడైన గిరిధర్ రెడ్డికి చెందిన రూ. 35 లక్షలు
10) పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి చెందిన రూ. 40 లక్షలు
11) ఝాన్సీరెడ్డికి చెందిన బీబీఆర్ హాస్పిటల్‌‌కు చెందిన రూ. 50 లక్షలు
12) జడ్చర్ల కాంగ్రెస్ నేతకు చెందిన రూ. 20 లక్షలు
13) మరో కాంగ్రెస్ నేతకు చెందిన రూ.70 లక్షలు
14) ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పరిచయమున్న ఫెస్టిసైడ్ షాపు యజమాని నుంచి రూ. 10 లక్షలు

కామారెడ్డిలో రేవంత్ ఓటమే లక్ష్యం

‘మా సీవోవో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2023 నవంబర్ చివరి వారంలో కామారెడ్డి అసెంబ్లీ సీటు పరిధిలో నిఘా పనుల కోసం మా బృందంలోని ఎస్సై గట్టు మల్లు, ఆర్ఎస్సై రాజవర్థన్ రెడ్డి, కానిస్టేబుల్ నరేష్ గౌడ్‌‌లను ప్రణీత్ కుమార్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించాను. నవంబరు 27న వారు ప్రణీత్ కుమార్ ఆదేశాల మేరకు ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడి విపక్ష నేతల కదలికల మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపు కోసం కామారెడ్డిలో చురుగ్గా పనిచేస్తున్న ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఆయన సహచరులని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరు కాంగ్రెస్ నేతలకు చెందిన రూ. 56.84 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు’ అని తిరుపతన్న తెలిపాడు.

అంతా ఆయనే చేశాడు

మొత్తంగా తాము కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులకు చెందిన డబ్బును స్వాధీనం చేసుకోవటం ద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి విజయం సాధించేందుకు పనిచేశామని చెప్పాడు. ‘ఇదంతా మా సీవోవో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేం చేశాం. గతంలో నా బ్యాచ్‌మేట్, ఇంటెలిజెన్స్‌లో అడిషినల్ ఎస్పీగా ఉన్న భుజంగరావు తరచూ మా కార్యాలయంలో ప్రభాకర్ రావును కలిసేవారు. ముఖ్యంగా వీరు ఎన్నికలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకునేవారు. టాస్క్‌ఫోర్స్ రాధాకిషన్ రావు కూడా తరచూ వచ్చి ప్రభాకర్ రావుతో మాట్లాడేవారు. వీరిద్దరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల డబ్బును పట్టుకోవటం ద్వారా బీఆర్‌ఎస్ విజయానికి పూర్తి స్థాయిలో పనిచేశారు’ అని వివరించాడు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...