Saturday, May 18, 2024

Exclusive

Nizamabad : ఇందూరు సీటు పొందేదెవరో?

 

– పసుపు రైతుల ఓట్లు కీలకం
– ఫలితాన్ని నిర్దేశించనున్న మున్నూరు కాపు ఓట్లు
– పసుపు బోర్డు, మోదీ చరిష్మా గట్టెక్కిస్తాయని బీజేపీ అశలు
– రేవంత్ నాయకత్వం, పథకాలే గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్
– కుల సమీకరణాలనే నమ్ముకున్న బీఆర్ఎస్

హైదరాబాద్, స్వేచ్ఛ: త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ.. అందరి చూపు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై పడింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి ఫైట్ జరగనుంది. బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరోసారి సీటు దక్కించుకోగా, బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్థన్‌ను బరిలో దించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రేపో మాపో తేలనుంది. అయితే.. ఈ త్రిముఖ పోరులో గెలిచేదెవరు? ఈసారి ఇందూరు పోరులో విజేతలుగా నిలిచేదెవరు? ఈ ఎన్నికల్లో ఏ అంశాలు కీలకంగా మారనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నిజామాబాబ్ పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలుండగా అందులో అయిదు నిజామాబాద్‌ జిల్లాలో, రెండు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. కోరుట్ల, జగిత్యాల, బాల్కొండలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌లలో బీజేపీ, నిజామాబాద్‌ రూరల్‌, బోదన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ నుంచి ఈ ప్రాంతం మీద గట్టి పట్టున్న ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ రెండో స్థానం, కోరుట్లలో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జోష్‌తో పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మైనారిటీలంతా కాంగ్రెస్ వైపు మొగ్గటం, గ్రామీణప్రాంతాల మీద గట్టిపట్టు ఉండటంతో ఈ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడితీరుతుందని కాంగ్రెస్ అంచానా వేస్తోంది. మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వయోభారాన్ని లెక్కచేయకుండా ఈ సీటులో పార్టీని గెలిపించి అధిష్ఠానానికి కానుకగా ఇవ్వాలని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఫీల్డులో పనిచేస్తున్నారు.టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఈ ఎంపీ సీటు పరిధిలోని వ్యక్తి కావటం, ఇటీవలే ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన కూడా కాలికి బలపం కట్టుకుని నిజామాబాద్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తూ, క్యాడర్లో జోష్ నింపుతున్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు చెందిన సిట్టింగ్‌ ఎంపీ మధుయాష్కిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి న కల్వకుంట్ల కవిత విజయం సాధించి తొలిసారిగా గులాబీ జెండా ఎగురవేశారు. 2019లో ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి అందరి దృష్టిలో పడ్డారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో 42వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తారు. ఐతే కొంత కాలంగా పసుపుకు గిట్టు బాటు ధర లేక, పసుపు దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు పసుపు సాగు తగ్గించారు. నిరుడు జిల్లాలో 25వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా.. ఈ సారి 20వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. మార్కెట్ ఒడిదొడుకులు పసుపు సాగుకు రైతులను దూరం చేస్తోంది. పసుపుకు మద్దతు ధర లేకపోవడం, గిట్టుబాట ధర రాకపోవడంతో సాగుకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రంగా ప్రకటించిన పసుపు బోర్టు అంశం ఈ సీటు పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లను తమవైపు మళ్లిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.

దీనికి తోడు రెండు పర్యాయాలు నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన చట్టాలే తమకు ఓటు బ్యాంకుగా మారతాయని, గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు సీట్లు బీజేపీ గెలుచుకోవటంతో బాటు జగిత్యాలలో ఓట్లు పెరగటాన్ని బట్టి గెలుపు తమదేనని అరవింద్ ధీమాగా ఉన్నారు. ఈ స్థానంలో మున్నూరు కాపుల ఓట్లు కీలకంగా మారతాయని, అవన్నీ తనకే వస్తాయని అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా బీఆర్‌ఎస్ అభ్యర్థి గోవర్ధన్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటమే గాక క్షేత్ర స్థాయిలో ప్రభావ శీలమైన నేతగా ఉండటంతో ఆ సామాజిక వర్గపు ఓట్లలో భారీగా చీలిక రానుంది.

ఈ స్థానంలో ఈసారి అన్ని పార్టీలకు నిజాం దక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల అంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలున్నాయి. కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని ముత్యంపేట, నిజామాబాద్‌ జిల్లా బోదన్‌లలో ఉన్న ఎన్‌డీఎస్‌ఎల్‌ యూనిట్లు మూతపడి ఏళ్లు గడుస్తున్నప్పటికీ వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలూ ఏ ప్రభుత్వాలూ తీసుకోలేదు. దీంతో ఈ అంశాన్ని ప్రచారానికి వాడుకునేందుకు మూడు పార్టీలు తమదైన కోణంలో ప్రచారానికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి తోడు పసుపు రైతుల సమస్యలు, గల్ఫ్‌ బాధితుల సమస్యలు ఈసారి ప్రధాన అంశాలుగా మారనున్నాయనేది విశ్లేషకుల అంచనా.

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఓటర్‌కు రూ. 500 చొప్పున డబ్బులు పంచాడని ఆరోపించారు. ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఈ నెల 18న విడుదల కానుంది. మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు వీటిని టీటీడీ ఆన్‌లైన్‌లో...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు శుక్రవారం...