Kolkotta airport closed 24 hours due to remal cyclone effect trains also stopped:
బంగాళాఖాతంలో అల్పపీడనం రెమల్ తీవ్ర తుఫానుగా బలపడింది. పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం, ఖేపువరా మధ్య గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఆదివారం అర్థరాత్రి తీరం దాటనుంది. దీనితో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కోల్ కతా ఎయిర్ పోర్టను దాదాపు 24 గంటల పాటు మూసివేయనున్నారు. అలాగే పలు రైళ్లను ఇప్పటికే క్యాన్సిల్ చేశారు. కోల్ కతా ఎయిర్పోర్ట్ లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలనుంచి సోమవారం 12 గంటలపాటు విమాన సర్వేసులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, హౌరా, హుగ్లీ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. బాంగ్లాదేస్ ఖేపుపరాకు నైరుతీ దిశలో, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా, క్యాన్సింగ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో వాయుగుండం కేంద్రీకృతం అయింది. తీవ్ర తుఫాన్ గా మారిన రెమాల్ ఖేపుపరా, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెమాల్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు,పుదుచ్చేరి,త్రిపుర, మాణిపూర్, మీజోరం,నాగాలాండ్, అస్సాం,మేఘాలయ, అండమాన్ నీకోబార్ దీవుల ప్రభుత్వాలను ఐఎండీఏ అప్రమత్తం చేసింది.
తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఉత్తర ఒడిశా, బెంగాల్‌లో కొన్ని జిల్లాల్లో సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సగటున దాదాపు 300 కంటే ఎక్కువ విమానాలను నడుపుతారు, ఇప్పుడు తుఫాను ప్రభావంతో వీటి ప్రయాణాలు నిలిచిపోనున్నాయి. వాతావరణ శాఖ తన బులెటిన్‌లో, ప్రజలు ఇంట్లోనే ఉండాలని, బయటికి వెళ్లకుండా ఉండాలని సూచించింది. తుఫానును ఎదుర్కొనేందుకు తమ బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అధికారి ఒక ప్రకటనలో తెలిపారు