Congress: కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పత్ర పేరిట ఏప్రిల్ 5వ తేదీన మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఐదు గ్యారంటీలు.. అందులో ఒక్కోదానికి ఐదేసి హామీలను చేర్చిన మ్యానిఫెస్టోను లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా.. ఆర్థికంగా వారిని పరిపుష్టం చేసేలా ఈ మ్యానిఫెస్టో రూపొందించామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, హిస్సేదారీలను ప్రధానంగా పేర్కొంటూ ఈ మ్యానిఫెస్టో రూపొందించారు. ఇది కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల కోసం రూపొందించింది. కానీ, మోడీ కాంగ్రెస్ కోసం మరో మ్యానిఫెస్టోను ప్రకటించారు.
ఇది విచిత్రంగా అనిపిస్తుంది కదూ. మోడీ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్నాయంటూ చెబుతున్న మాటలకు, న్యాయ్ పత్రలో ఉన్న వివరాలకు పొంతన లేదు. ఇది కాంగ్రెస్ పార్టీకే తెలియని మ్యానిఫెస్టోను మోడీ ప్రకటిస్తున్నట్టేగా! నిజమైన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూస్తే మోడీ మాట్లాడేవి పచ్చి అబద్ధాలను ఇట్టే అర్థమైపోతుంది. ఇదీ మరీ కష్టమైన పనేమీ కాదు కాబట్టి.. మోడీ వ్యాఖ్యలు బూమెరాంగ్ అవుతున్నాయి.
Also Read: ఉత్తరప్రదేశ్‌లో చెమటోడుస్తున్న చిరుత హీరోయిన్.. ఎందుకు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఆస్తిపాస్తులను సర్వే చేసి వారి వద్ద నుంచి లాక్కుని అందరికీ సమానంగా పంచుతారని తన మ్యానిఫెస్టోలో ప్రకటించిందని మోడీ అన్నారు. మన ఆడబిడ్డలు ధరించే బంగారం, ఆదివాసుల వద్ద ఉండే వెండిని కూడా సర్వే చేసుకుని లాక్కుంటారని, ఇది ఆడబిడ్డలు మెడలో వేసుకునే మంగళసూత్రాలను వదిలిపెట్టని పరిస్థితులకు వెళ్లుతుందని భయపెట్టే ప్రయత్నం చేశారు. తాళి అంటే బంగారం కాదని, అది ఆడబిడ్డల స్వాభిమానం అని సెంటిమెంట్ రెచ్చగొట్టే యత్నం కూడా చేశారు.
My letter to PM @narendramodi ji underlining that he has been misinformed on the Congress Nyay Patra. I would also like to meet him in person to explain him our Manifesto, so that he doesn’t make any false statements in future.
Sharing the text of the same —
I am neither… pic.twitter.com/pSDkm4IiBW
— Mallikarjun Kharge (@kharge) April 25, 2024
మళ్లీ హిందూ ముస్లిం భేదాన్ని తెచ్చే ప్రయత్నం మోడీ చేశారు. దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదేనని గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి, ఈ లాక్కున్న సొమ్మును అధిక సంతానం కలిగి, దేశంలోకి చొరబాటుదారులైన వారికి కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతుందని దారుణమైన అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఇది అర్బన్ నక్సల్ ఆలోచనలు అని, మావోవాదుల ఆలోచనా ధోరణి అని, వారి ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ అమలుజేయచూస్తున్నదని ఆరోపించారు.
Also Read: Kaleshwaram: అవసరమైతే కేసీఆర్‌కు నోటీసులు!
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ఒకటి ఉంటే.. ప్రధాని మోడీ ప్రచారం చేస్తున్న మ్యానిఫెస్టో మరోటి ఉన్నది. అదీ కాంగ్రెస్‌పై బురదజల్లేలా.. వర్గాలను రెచ్చగొట్టేలా మోడీ మాటలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విడుదల చేసిన మ్యానిఫెస్టో కాకుండా.. అందులో లేని మాటలను మోడీ మాట్లాడుతున్నారు. దీంతో ఖర్గే మోడీకి ఓ లేఖ రాశారు. ‘ప్రధాని మోడీ గారు.. మా న్యాయ్ పత్రాను మీకు ప్రత్యక్షంగా వివరించే అవకాశం ఇస్తే సంతోషం. తద్వార దేశ ప్రధాని తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా నివారించవచ్చు. కొన్ని పదాలను అసందర్భంగా తీసుకుని ఇష్టారీతిన మార్చి మాట్లాడటం మీకు కొత్తేమీ కాదు. కానీ, మీరు చెప్పే అబద్ధాలు ప్రధాని పదవికి కళంకంగా ఉన్నాయి. మంగళసూత్రం గురించి మీరు మాట్లాడుతున్నారు. మణిపూర్ మహిళలపై అఘాయిత్యాలకు బాధ్యత మీ ప్రభుత్వానిది కాదా?’ అని విరుచుకుపడ్డారు.