Cinema

Hyderabad : మోక్షజ్ఞ జాతకం బాగోలేదా?

Nandamuri Mokshajna cinema entry:
నందమూరి మూడో తరం వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం అదిగో వస్తున్నాడు…ఇదిగో వస్తున్నాడు అనడమే తప్ప మీడియా కు సైతం కనిపించకుండా మోక్షజ్ణ జాగ్రత్త పడుతున్నాడు. బాలకృష్ణ కూడా పాత్రికేయుల సమావేశంలో పలు సందర్భాలలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చేవాడు. అయితే ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞ ఫైట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిలోనూ బాగానే తర్ఫీదు పొందాడు. అయితే మోక్షజ్ఞ  తెర ముందుకు రాకపోవడానికి కారణం ఉందంటున్నారు

కారణం అదే..

తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ ఇవ్వకపోవడానికి ఓ బలమైన కారణం ఉన్నదట. ఆయన జాతకం ప్రకారం 2025 సెప్టెంబర్ వరకు ముహూర్తం బాగోలేదట, అందువల్లనే ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టడం లేదని టాక్. తన జాతకం బాగుండి, మంచి టైమ్ చూసి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణియించుకున్నాడట మోక్షజ్ణ. , అంతే కాకుండా బాలయ్య కూడా సెంటిమెంట్, జాతకాలు చాలా నమ్ముతాడు. అందువలన బాలకృష్ణ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీని లేటుగా ఇప్పించాలి అంటూ ఆలోచిస్తున్నారట. ప్రస్తతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలా రోజుల నుంచి మోక్షజ్ఞ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ ఏపీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు.