Saturday, May 18, 2024

Exclusive

Phone Tapping Case: ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్

Prabhakar Rao: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. సీఆర్పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావును అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిందితులు అమెరికాలో ఉన్నందున నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు విజ్ఞప్తి చేశారు. నాంపల్లి కోర్టు ఇందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు, ఐ న్యూస్ మీడియా అధినేత శ్రవణ్ రావులకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను నాంపల్లి కోర్టు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు అధికారులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ప్రణీత్ రావు, భుజంగరావు సహా పలువురు అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కానీ, అంతలోపే ప్రభాకర్ రావు దేశం దాటారు. చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్టు ఆయన సన్నిహితులకు తెలియజేసినట్టు సమాచారం. రెండు మూడు నెలల తర్వాత తిరిగి వస్తాననీ పేర్కొన్నట్టు తెలిసింది. కానీ, ప్రభాకర్ రావు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లిపోయారనే వార్తలూ వచ్చాయి.

Read Also: దేవుడి పేరుతో రాజకీయమా?

ప్రభాకర్ రావును అరెస్టు చేయడానికి పంజాగుట్ట పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి దారులు సుగమం చేసుకుంటున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ముందస్తుగా కోర్టు అనుమతి తప్పనిసరి. అందుకే నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. దీంతో త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ మోసం - భారతీ లేక్ వ్యూ పేరుతో వసూళ్లు - అతి తక్కువ ధరకే ఫ్లాట్ అనడంతో ఎగబడ్డ జనం - రోజులు గడుస్తున్నా...

Hyderabad:పోలీసుల తీరుపై మల్లారెడ్డి ఫైర్

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత కోర్టు వివాదంలో ఉన్న మల్లారెడ్డి స్థలం ఆక్రమించుకోవడానికి యత్నించిన వ్యక్తులు అల్లుడు, కొడుకుతో వెళ్లి అడ్డుకున్న మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న...

Hyderabad:హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

ల్యాండ్ వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్ 2003లో గీత లక్ష్మీ నుండి ప్లాట్ కొనుక్కున్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్లాట్ పై బ్యాంకులకు హక్కులున్నాయన్న డీఆర్టీ డీఆర్ఠీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరిన...