BRS: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యూలర్‌ను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చంచల్ గూడ జైలుకు తరలించారు. క్రిశాంక్ నిర్దోషి అని వాదిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో వాదించారు. ఇందుకు నాంపల్లి కోర్టు సానుకూలంగా స్పందించింది.
ఓయూ సర్క్యూలర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారనే ఆరోపణలతో క్రిశాంక్ పై కేసు నమోదైంది. ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి కటకట, విద్యుత్ కోతలు ఉన్నాయని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రభుత్వంపై దాడికి దిగారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అంతకు ముందటి సర్క్యూలర్‌ను పేర్కొంటూ తమ ప్రభుత్వ హయాంలోనే అక్కడ కరెంట్ కోతలు ఉన్నట్టు తప్పుదోవ పట్టిస్తున్నారని తేల్చేశారు. అదే సమయంలో మార్ఫింగ్ చేసిన ఓయూ సర్క్యూలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వెనుక క్రిశాంక్ ఉన్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచారు.
Also Read: సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి
తాజాగా, క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. 25 వేల మొత్తాలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి రోజు పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.