– బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ
– తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ వీడియో విడుదల
– కాసేపటికే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
– హేమ, రేవ్ పార్టీ ఫోటోల విడుదల
– సోషల్ మీడియాలో హేమపై ట్రోలింగ్
– సూపర్ వుమన్ అంటూ నెటిజన్ల కామెంట్స్
Hema: వకీల్ సాబ్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అవినీతి లేడీ పోలీస్ తప్పు చేసి దొరికిపోయి, ఒక చోట నుంచి ఇంకోచోటకి జెట్ స్పీట్‌లో జీపులో వచ్చేశానని చెప్తుంది. ఇప్పుడు రియల్‌గా సినీ నటి హేమ మాటలు కూడా అలాగే ఉన్నాయనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈమె కూడా జెట్ స్పీడ్‌లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేశారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఉన్నానన్న హేమ
బెంగళూరులోని ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై సోమవారం ఉదయం పోలీసులు రెయిడ్ చేశారు. బర్త్ డే అంటూ రేవ్ పార్టీ జరుపుకుంటున్న వాసు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సోదాల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంతో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, పట్టుబడ్డ వారిలో సినీ నటి హేమ ఉందని ముందు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలన్నీ ఫేక్ అని, తాను హైదరాబాద్‌లోని ఫాంహౌస్‌లో చిల్ అవుతున్నానని ఓ వీడియో విడుదల చేసింది. ఆ రేవ్ పార్టీలో ఎవరున్నారో తనకు తెలియదని స్పష్టం చేసింది.
ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
హేమ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఫాంహౌస్‌కు సంబంధించిన ఫోటోలు, రేవ్ పార్టీలో హేమ ఉన్నదని, ఆమె ఫొటోను కూడా విడుదల చేశారు. ఆ ఫొటోలో ధరించిన డ్రెస్, హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పిన వీడియోలో వేసుకున్న డ్రెస్ ఒకటే. దీంతో ఆమె రేవ్ పార్టీలో ఉన్నారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. దీనికితోడు పోలీసు వర్గాలు మరో వివరణ ఇచ్చాయి. నటి హేమ వీడియో హైదరాబాద్ ఫాంహౌస్‌లో కాకుండా బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌస్‌లోనే షూట్ చేసినట్టు ఉన్నదని, ఆ చెట్లు అలాగే ఉన్నాయని తెలిపాయి. దీంతో హేమ చెప్పిన కథ అడ్డం తిరిగినట్టయిందని అంటున్నారు. జెట్ స్పీడ్‌లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.