Tuesday, December 3, 2024

Exclusive

Modi: సబ్ కా ‘అవిశ్వాస్’

– బీజేపీకి చేటు తెస్తున రిజర్వేషన్ల వ్యాఖ్యలు
– ఆగ్రహంతో ఉన్న దళిత, బీసీ వర్గాల ఓటర్లు
– కుల గణనకు ప్రాధాన్యమివ్వకపోవడంతో అసహనం
– దేశవ్యాప్తంగా ఒక్కటవుతున్న ముస్లిం వర్గాలు
– రిజర్వేషన్లు ఎత్తివేస్తారని బలంగా నమ్ముతున్న జనం
– మోదీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతేనా?
– రాజకీయ పండితుల విశ్లేషణ

BJP: సబ్‌ కా సాథ్‌-సబ్‌ కా వికాస్‌.. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం. సబ్‌ కా విశ్వాస్‌ అనేది తర్వాత ఇచ్చిన నినాదం. భారతీయ మైనారిటీ వర్గాలను ద‌ృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నినాదం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. మోదీ తొలిసారి ప్రధానిగా 2014 మే 25వ తేదీన పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ పార్లమెంట్‌ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఓటు వేసిన వారంతా మనవారే, ఓటు వేయని వారు కూడా మనవారే. వారి విశ్వాసాన్ని కూడా మనం చూరగొనాల్సిన అవసరం ఉంది’ అంటూ దేశంలోని మైనారిటీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మైనారిటీలకు తాము వ్యతిరేకమని, వారిలో భయాందోళనలను సష్టించామని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ మోదీ మొదటి సారి దేశంలో మైనారిటీల దుస్థితి గురించి మాట్లాడారు. కట్ చేస్తే, రెండు పర్యాయాలు అయిపోయింది. ఇప్పుడు వరుసగా మూడోసారి 400 సీట్ల మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. విపక్ష పార్టీలన్నీ ఏకమైనా తమ టార్గెట్ రీచ్ కానంతగా ఓటు బ్యాంకు సాధించాలనే లక్ష్యం పెట్టుకుని మరీ 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగింది. అంతా బాగానే ఉంది కానీ, 400 మెజారిటీ రావాలంటే బీజేపీ పోటీ చేసిన ప్రతి చోటా కనీసం 50 శాతం ఓట్లను రాబట్టుకోగలగాలి. ఇదంతా సాధ్యమయ్యేనా? ఉత్తరాది ఓటర్లు ఎలా ఉన్నా దక్షిణాదిలో ఈసారి మోదీ అస్త్రాలు ఏమీ పనిచేయడం లేదు. చెప్పుకోవడానికి ఆయన పథకాలు ఏమీ లేవని, పైగా దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్‌లో చేసిన అన్యాయం, చూపుతున్న వివక్షతో సౌత్ ఓటర్లు రగిలిపోతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. అటు ఉత్తరాది ఓటర్లలోనూ వ్యతిరేకత కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే 400 కాదు కదా గతంలో వచ్చిన మెజారిటీ కూడా కష్టమే అని అంటున్నారు.

ముస్లిం వర్గాలలో వ్యతిరేకత

పదేళ్లలో పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, అమలు కాని హామీలు, ముఖ్యంగా బ్లాక్ మనీ వెనక్కి తీసుకురావడం వంటి ఫెయిల్యూర్స్ అన్నీ బీజేపీకి ప్రతికూల అంశాలే అని విమర్శకులు అంటున్నారు. ఇక రిజర్వేషన్లు, వెనుకబడ్డ కులాలంటూ పాకులాడుతున్న బీజేపీ సర్కార్ హయాంలో వృత్తికారులే కాక శ్రామిక శక్తులు అయిన బీసీలకు ఏ రకంగానూ ప్రాధాన్యత లేకుండా పోయింది. ఫూలే, అంబేద్కర్ జయంతి, వర్ధంతి వచ్చినప్పుడు విగ్రహాలకు పూలమాలలు వేయడం తప్ప వెనుకబడ్డ వర్గాలకు బీజేపీ సర్కార్ చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీంతో దళిత, బీసీ వర్గాల ఓట్లకు బీజేపీ దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ హయాంలో ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందనే భావన రోజురోజుకూ పెరిగిపోతోంది. గత కొంతకాలంగా ముస్లిం జనాభాకు సరిపడనంతగా పార్లమెంట్‌లో అభ్యర్థులు ఎంపిక కావడం లేదు. కనీసం వాళ్ల తరపున పోరాడే శక్తులే కరువయ్యారు. కొద్దో గొప్పో కాంగ్రెస్ ముస్లింల తరపున, వారి హక్కుల తరపున బీజేపీ సర్కార్‌ను నిలదీస్తూ వస్తోంది. ముస్లింలు కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని దేశ వ్యాప్తంగా ఆలోచనలో పడ్డారు. ఇదంతా కూడా బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. పైగా ముస్లిం రిజర్వేషన్లపై బాహాటంగానే బీజేపీ నేతలు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు.

Also Read: ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు..! ఏమరపాటు వద్దు

అన్యమత మైనారిటీల ప్రభావం

క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూ మతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైన వారు క్రైస్తవ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువమంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం, జనరల్‌ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల, లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. అంబేద్కర్‌ బౌద్ధాన్ని పునరుద్ధరింప చేసారు. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. తప్పకుండా భారత రాజకీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఈ ఓట్లన్నీ బీజేపీకి వ్యతిరేకత చేకూర్చేవే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కుల గణనకు భయపడుతున్న బీజేపీ

దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశం కుల గణన. బీజేపీకి మాత్రం ఇది పంటి కింద రాయిగా మారింది. కులాల లెక్కలు తీయడానికి స్వతహాగానే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం. దేశంలో ఎస్సీ, ఎస్టీలు తప్ప మరో కులం ఉన్నా లేనట్టే అని రెండేళ్ల కిందట కేంద్ర హోంశాఖ స్వయంగా చెప్పేసింది. గతంలో మండల్ కమిషన్‌ నివేదిక అమలు చేశాక పెద్దఎత్తున రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఈసారి ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అనేది బీజేపీ భయం. కులాల వారీగా జనాభా లెక్కలు తేలితే దానికి అనుగుణంగా రిజర్వేషన్‌ లెక్కలు కూడా మారిపోతాయన్న గుబులు వేధిస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న గీతను కేంద్ర ప్రభుత్వమే దాటేసింది. బిహార్‌ బాటలో మిగతా రాష్ట్రాలు కూడా నడిస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల సమస్య పేట్రేగే ప్రమాదం ఉందని సంకోచిస్తోంది కమలం పార్టీ. దీంతో ఓబీసీ, బీసీ, ఉప కులాల ఓట్లన్నీ ఈ సారి మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తాయంటున్నారు రాజకీయ పండితులు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...