- ఓట్ల కోసం మళ్లీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీ
- తొలి విడత ఎన్నికలలో తగ్గిన ఓటింగ్ సరళి
- ఓటింగ్ శాతం తగ్గడంతో ఓటమి భయం కమలనాధులకు ఓటమి భయం
- రెండో విడత ఓటింగ్ శాతం పెంచుకోవడానికి ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు
- కాంగ్రెస్ వస్తే ముస్లిములు రెచ్చిపోతారన్న మోదీ
- మీ ఆడవారి మంగళ సూత్రాలు తెగిపోతాయని హెచ్చరిక
- మోదీ పాలనలో ఎంత మంది మంగళసూత్రాలు తెగలేదు
- అంటూ ఎదురుదాడికి దిగుతున్న ప్రతిపక్ష పార్టీలు
Modi contravers controversy speaches lok sabha :
మళ్లీ మరో సారి మత విశ్వాసాలను రెచ్చగొట్టి ఓట్లేయించుకోవడానికి మోదీ తహతహలాడుతున్నారు. మత విశ్వాసాలపై అవసరమైతే సర్జికల్ దాడులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. దేశంలో జరిగిన తొలి విడత పోలింగ్ పూర్తయింది. కానీ భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. ఓటింగ్ శాతం తగ్గిందంటే ఎక్కువగా నష్టపోయేది బీజేపీయే. అంటే మోదీ ప్రసంగాలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని ఇప్పటికే వారికి అర్థమై ఉంటుంది. కనీసం రెండో విడతలో అయినా నష్టనివారణ చర్యలు తీసుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. అందుకే తన ప్రసంగాలలో ముస్లిం వ్యతిరేక మాటలు పెంచారు. ఎందుకంటే రెండు సార్లు నిరవధికంగా గెలిచిన మోదీకి ఈ సారి అంత ఈజీ కాదని భావిస్తున్నారు. ఇప్పటికే మోదీ గ్యారెంటీ అంటే ఏదీ గ్యారెంటీ అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.
ప్రధాని స్థాయికి తగినట్ల లేదు
ఇటీవల ఎన్నికల సభల్లో మోడీ ప్రసంగిస్తున్న తీరు ప్రధాని స్థాయికి ఏ మాత్రం తగినట్లుగా లేదు. అందుకే తనకి తెలిసిన విద్య మతాలను రెచ్చగొట్టడమే అని విపక్షాలు అంటున్నాయి. . తాను ఓడిపోతే హిందువుల మంగళ సూత్రాలు వారు అంటే ముస్లిములు లాగేసుకుంటారంటున్నారు. ఆస్తులు ముస్లింలకు పంచేస్తారంటున్నారు. ఇంకా ఏవేవో చెప్పి దేశంలోని అత్యధిక ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తున్నారు. తనను చుట్టుముడుతున్న ఓటమి భయం నుండి బయటపడేందుకు దేశ ప్రజలందరికీ భయాన్ని కల్పించాలనుకుంటున్నారు. ఈ పదేళ్ళలో తాను చేసిన మేలు చెప్పి, ప్రజల మెప్పు పొంది అధికారంలోకి రావడానికి చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు ఏమీ లేవనే తన డొల్లతనాన్ని తనకు తానే తేటతెల్లం చేసుకుంటున్నారు. ప్రధాని స్థాయిని మరింతగా దిగజార్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంగళ సూత్రం వ్యాఖ్యలు
బిల్కిస్ బానో లాంటి అనేకమంది అబలలపై ముష్కరులు పైశాచికంగా ఘోరాలు చేస్తే వారిని శిక్షించక పోగా, రక్షించి, సత్కరించిన కమలం పార్టీ మంగళసూత్రం గురించి, వాటి పవిత్రత గురించి మాట్లాడితే ఎలా? అని మోదీని నిగ్గదీస్తున్నారు. 2020 ఢిల్లీ అల్లర్లలో మతోన్మాదుల చేతుల్లో హతులైన 50 మంది మహిళల మంగళసూత్రాల గురించి ఎన్నడైనా మాట్లాడారా? పుల్వామా ఉగ్రదాడుల్లో హతులైన జవాన్ల భార్యల మంగళసూత్రాలు గంగలో కలిసి పోవడానికి కారకులెవరనేది ఇప్పటికీ మిస్టరీయే కదా. ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసిన స్టాన్‌స్వామి కట్టిన మంగళసూత్రాన్ని తెంచిందెవరు? అక్రమంగా జైళ్ళ గదుల్లో సంవత్సరాలుగా నిర్బంధించబడిన హక్కుల నేతలు, ప్రజాపక్ష జర్నలిస్టుల మంగళసూత్రాల మాటేమిటి? గత పది సంవత్సరాల్లో మీ విధానాల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్న 1,74,000 మంది రైతుల భార్యల మెడల్లో మంగళసూత్రాలు లేకుండా చేసింది ఎవరు? మీ ఏలుబడిలో నాలుగు కోట్ల మంది గ్రామీణ పేదలు పొట్ట చేత పట్టుకుని మాన, ప్రాణాలకు రక్షణ లేని వలస జీవితాల యమ కూపంలోకి నెట్టబడినప్పుడు మంగళసూత్రం గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
ఇన్ని దారుణాలు, ఇంతటి ఘోరాల్లో తెగిపడిన లక్షలాది మంగళసూత్రాల గురించి స్పందించని మీ కంఠం ఇప్పుడు హఠాత్తుగా వాటి గురించి మాట్లాడుతుందంటే మోదీ ఓట్ల కోసం నడిపిస్తున్న రాజకీయ తంత్రం భోధపడుతుంది.