Wednesday, September 18, 2024

Exclusive

Telangana: తెలం‘గానం’.. ఓట్ల కోసమేనా?

– పన్నుల రూపంలో లక్షల కోట్ల వసూళ్లు
– కానీ, బడ్జెట్, భారీ ప్రాజెక్టుల కేటాయింపులు నిల్
– అడుగడుగునా తెలంగాణకు అన్యాయం
– కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం పెండింగ్
– మెడికల్, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ, నవోదయ కేటాయింపుల్లోనూ వివక్ష
– అటకెక్కిన విభజన హామీలు
– కానీ, కోటలు దాటుతున్న మాటలు
– బీజేపీ తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు
– గాడిద గుడ్డు ఇచ్చారంటూ కాంగ్రెస్ వర్గాల ఎటాక్

Modi injustice to Telangana state not sanction Funds: దేశానికి తెలంగాణ నుంచి కేంద్రానికి ఏటా కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతుంటాయి. ఒక రకంగా చూస్తే దేశాన్ని పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ చాలా కీలకం. అయితే, ఈ నిధులన్నీ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బడ్జెట్‌లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. భారీ ప్రాజెక్టుల ఊసే ఉండదు. కనీసం విభజన హామీలు పట్టించుకోరు. రైల్వే బడ్జెట్‌లో ప్రతిసారీ ఎదురుచూపులే తప్ప ఏ ఒక్క కేటాయింపులూ ఉండవు. జీఎస్టీ రూపంలో డబ్బులు వసూలు చేయడమే తప్ప తిరిగి రాష్ట్రాలకు నిధులు ఇద్దామనే సోయి ఉండదు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తూ అడుగడుగునా ఉత్తరాది మంత్రం జపిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై సవతి ప్రేమను కురిపిస్తున్నదంటూ ప్రతిపక్షాలు మోదీ సర్కారును తరచూ విమర్శిస్తుంటాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ‘గాడిద గుడ్డు’ ప్రచారం నేపథ్యంలో మరోసారి నిధుల కేటాయింపు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజలను ఓట్లేయడానికి ఉపయోగపడే ఈవీఎం యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిధులన్నీ గుజరాత్‌కేనా?

కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని రీసెంట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2022 జూలైలో ఒకేరోజు రూ.71 కోట్లతో గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు, రూ.293 కోట్లతో మహాసేన-వరేతన వరకు 55 కి.మీ. గేజ్‌ మార్పిడి పనులకు, రూ.74 కోట్లతో సురేందర్‌నగర్‌-పిపావవ్‌ సెక్షన్‌ విద్యుద్దీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ, తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ రూట్లలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌, ఢిఫెన్స్‌ కారిడార్‌ లైన్లను మెరుగుపరిచే ప్రతిపాదనలను మాత్రం అటకెక్కించారు. ఇవన్నీ తెలిసినా తెలంగాణ బీజేపీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తుండటం, కనీస సోయి లేకుండా ఢిల్లీకి బానిసల్లా కొనసాగుతుండటం తెలంగాణ దౌర్భాగ్యం అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

విభజన హామీలన్నీ పెండింగ్

ఏపీ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని హామీల‌ను కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు నెర‌వేరుస్తుంద‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కానీ.. ఏ ఒక్క‌దాన్ని నెర‌వేర్చ‌కుండా మోదీ స‌ర్కారు మోసం చేసింది. ఈ పదేళ్లలో విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చ‌కుండా ద‌గా చేసింది. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేదు. పారిశ్రామిక రాయితీల సంగతి పూర్తిగా మరిచిపోయింది. లక్షలాది తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. దేశవ్యాప్తంగా 22 సాప్ట్‌వేర్‌ పార్కులు ప్రకటించి తెలంగాణకు మొండిచేయి చూపింది. దేశవ్యాప్తంగా వందలాది మెడికల్‌ కాలేజీలు, పదుల సంఖ్యలో ఐఐఎంలు, ట్రిపుల్‌ ఐటీలు, నవోదయ పాఠశాలలు ప్రకటించిన మోదీ స‌ర్కారు ఒక్క విద్యా సంస్థను కూడా తెలంగాణకు కేటాయించలేదు. ఏపీలో అక్ర‌మంగా క‌లిపిన తెలంగాణ గ్రామాల‌పై ఎన్నిసార్లు విన్న‌వించినా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఇప్పుడు సాక్షాత్తూ లోక్‌స‌భ‌లో విభ‌జ‌న హామీల‌న్నీ నెర‌వేర్చామ‌ని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ విమర్శకులు ఎదురుదాడులు చేస్తున్నారు. అవాస్త‌వాలు, అస‌త్యాల‌తో ఇంకెన్నిరోజులు త‌మ‌ను ఇంకెన్ని రోజులు మోసం చేస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

చెల్లింపుల్లో తీరని జాప్యం

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి ట్యాక్స్‌గా వెళ్తే తిరిగి వచ్చేది 40 పైసలు మాత్రమే. కేంద్రప్రభుత్వం తెలంగాణకు నిధులుకేటాయించకపోవడం, చెల్లింపుల్లో జాప్యం చేయడమే కాకుండా జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించడం లేదు. కేంద్ర మంత్రులు చేస్తున్న‌ వాదనలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణకు గత మూడేళ్లుగా కేంద్రం రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉంది. GST ప్రారంభమైనప్పటి నుండి, తెలంగాణకు GST పరిహారంగా రూ. 16,570 కోట్లు అందాయి. ఇది దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల కంటే తక్కువ. 2020-21,2021-22 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1,371 కోట్లు, అలాగే 2022-23కి సంబంధించి మరో రూ. 1,061 కోట్ల జీఎస్టీ పరిహారం బకాయిలను కేంద్రం ఇంకా క్లియర్ చేయలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ బకాయిలు చెల్లించాలని పదే పదే విన్నవించినా నేటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేదు. ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడంతోపాటు చట్టపరమైన అవకాశాలను అన్వేషించాల్సిన పరిస్థితి రానుంది.

అన్ని రకాలుగా.. తెలంగాణ బెస్ట్

కేంద్రం జీఎస్టీ పరిహారం సెస్ విధించడం ద్వారా రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం, అత్యధిక పరిహారం అందుకుంటున్న మొదటి ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పంజాబ్. గత ఐదేళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 13.9 శాతంతో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ విధంగా, ఇతరుల కంటే మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ చెబుతోంది. అందుకే, తెలంగాణకు కేంద్రం ‘గాడిద గుడ్డు’ ఇచ్చిందనే ప్రచారాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్. చేయాల్సిందంతా చేసి అది చేశాం, ఇది చేశాం అంటూ తెలంగాణ పాట పాడుతున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలని అంటోంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...