Tuesday, May 28, 2024

Exclusive

New Delhi : ‘ఫేక్’ ఇన్ ఇండియా

  • ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ సర్కార్
  • పదేళ్లుగా భర్తీ చేసినవి 7 లక్షల ఉద్యోగాలు
  • పట్టణ ప్రాంతాలలో 8 నుంచి 12 శాతం పెరిగిన నిరుద్యోగులు
  • పల్లెల్లో 7 శాతం కన్నా అధికంగా నమోదు
  • కొత్తగా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు 21.8 కోట్లు
  • ప్రకటనలకే పరిమితం అయిన మేక్ ఇన్ ఇండియా
  • రైల్వే రంగంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు పెండింగ్
  • లాభాలొచ్చే పబ్లిక్ సెక్టార్లు బడా కార్పొరేట్లకు అప్పగింత
  • మోదీ ఇచ్చిన హామీలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వాటా 0.35 శాతం

Modi government injustice to Un-employees  fill up the jobs 0.35 percent:

దేశంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందేవారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఎన్నో ఏళ్లుగా రిటైర్ అయిన పోస్టులు భర్తీ చేయకపోగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వక దేశంలోనే నిరుద్యోగిత శాతం పెరిగిపోతూ వస్తోంది. ప్రైవేటు ఉద్యోగాలలోనూ కరోనా ప్రభావంతో ఉన్న కొద్దిమందితోనే పనిచేయించుకుంటూ సంస్థలు కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఇందుకు మోదీ అనుసరిస్తున్న వ్యవస్థాగత లోపాలు నిరుద్యోగులకు శాపాలుగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం 7 శాతం కన్నా ఎక్కువగా ఉంది. అదే పట్టణాలలో 8 నుంచి 10 శాతం నిరుద్యోగం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతి బడ్జెట్ లోనూ ఉపాధి హామీ కేటాయింపులను తగ్గిస్తూ వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ లో చిన్న, మధ్య, కుటీర పరిశ్రమలపై శ్రద్ధ చూపకపోవడం కూడా తెలంగాణ నిరుద్యోగుల పాలిట పాపంగా మారింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర 33 శాతం మేరకు నిధులలో కోత పెట్టింది. ఆర్థిక పురోగతిలో భారత్ అంటూ లెక్కలు చూపిస్తున్న బీజేపీ వాస్తవాలను బయటపెట్టడం లేదు. ప్రగతి పథంలో భారత్ వెలిగిపోతోందంటూ..ప్రపంచ దేశాలలోనే భారత్ 5 వ స్థానం అంటూ ఊదరగొడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర 33 శాతం మేరకు నిధులలో కోత పెట్టింది. అలాగే గ్రామీణ గృహ నిర్మాణం, జాతీయ జీవనోపాధి మిషన్ వంటి సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు భారీ ఎత్తున కేంద్రం తగ్గించడంతో ఆ ప్రభావం ఉపాధి కల్పన రంగంపై పడింది. స్టార్టప్ కంపెనీలకు తగిన ప్రోత్సాహం కరువైంది. మేక్ ఇన్ ఇండియా పథకం ప్రకటనలకే పరిమితం అయింది. వీటన్నింటి ప్రభావంతో ఒక్కసారిగా భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది.

తగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు

దేశంలోని మొత్తం 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014 నాటికి 16..9 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 2022 సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 14.6 లక్షలకు తగ్గిపోయింది. ప్రతిష్టాత్మక బీఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి పదేళ్ల మోదీ పాలనలో లక్షా 81 వేల మంది ఉద్యోగులను ఉద్వాసన పలికారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని ఊదరగొట్టిన ప్రధాని మోదీ కేవలం ప్రభుత్వ రంగంలో 7 లక్షల ఉద్యోగులను మాత్రమే భర్తీ చేసింది. యావరేజ్ న చూసుకుంటే ఏడాదికి 70 వేల పోస్టులు భర్తీ చేసింది. కనీసం ఇచ్చిన హామీలో 0.35 శాతం కూడా లేదని ప్రతిపక్షాలు మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. భారత జనాభా సుమారు 140 కోట్ల మంది. ఇందులో పనిచేయగల శ్రామిక వర్గం 85 కోట్ల మంది దాకా ఉంటుంది. అయితే తమ అర్హతతో సంబంధం లేకుండా పనిచేసేవారి సంఖ్య 32 కోట్లకు పై మాటే. పనికి తగిన వేతనం పొందేవారి సంఖ్య సుమారు 30.4 కోట్ల మంది దాకా ఉంటారు. కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారు 21 కోట్ల మంది.

ఉపాధి రహిత భారత్

గత పదేళ్లుగా మోదీ అనుసరిస్తున్న ఉదారవాద విధానాలు ఉపాధి రహిత భారత్ గా మార్చేస్తున్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇంత జరుగుతున్నా ఉపాధి హామీ ఇచ్చే ప్రభుత్వం తమదే అని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటుంటారు. ఇంకా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోంది బీజేపీ సర్కార్. మంచి లాభాలలో ఉన్న ఎల్ఐసీ వంటి సంస్థలను సైతం ప్రైవేటు కార్పొరేటర్లకు తాకట్టు పెడుతోందని ప్రతిపక్షాలు గొడవ పెడుతున్నాయి. ప్రపంచ స్థాయిలోనే మన రైల్వే రవాణా వ్యవస్థ అని పెద్దది. భారత రైల్వే రంగంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు బీజేపీకి నిరుద్యోగులపై ఎంత ప్రేమ ఉందో అని విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. తాజాగా పిఎల్‌ఎఫ్‌ఎస్‌ తాజా రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 24 శాతం. జాతీయ సగటు కంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘బీమార్‌’ రాష్ట్రాలుగా పేర్కొనే అత్యంత వెనకబడ్డ రాష్ట్రాల కంటే తెలంగాణలో నిరుద్యోగిత అధికంగా ఉండటం మన రాష్ట్ర ప్రజలను, యువతను కలవరవరిచే విషయం.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy name: ఒక తరానికి ఆయన ఆరాధ్య పురుషుడు. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, పౌరాణిక పాత్రల కోసమే పుట్టాడా అనిపించే యశస్సు కలిగిన...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు సన్నాహాలు కేసును నీరుగార్చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నయీంతో రాజకీయ నేతల సంబంధాలపై ఆరా గ్యాంగ్ స్టర్ ఆస్తులపై తేలని లెక్కలు ...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో ఒక్కోప్రచార దిశ మార్చిన మోదీ మొదట్లో వికసిత్ భారత్ అంటూ ప్రచారం చివరికి వచ్చేసరికి విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు ముస్లింల...