Tuesday, December 3, 2024

Exclusive

Hyderabad : మోదీజీ..ఏ క్యాజీ?

  • మాటలకు, చేష్టలకు పొంతన లేని మోదీ
  • నల్లధనం తెస్తామ‌న్నారు కానీ న‌ల్ల చ‌ట్టాలు తెచ్చారు
  • రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని .క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వలేదు
  • ఆత్మనిర్భర్ అంటూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు
  • ఉపాధి హామీ అంటూ పనులు లేకుండా చేశారు
  • కరప్షన్ పై కన్నెర్ర అంటూ కరప్షన్ కింగ్ లకు పార్టీ తీర్థం
  • పన్ను ఎగవేతదారులకు రూ.15 లక్షల కోట్ల మాఫీ
  • మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ
  • అంబానీ, ఆదానీలకే పట్టం కడుతున్న ప్రధాని
  • విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు

PM Modi latest news(Political news telugu): ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలా రంగు చొక్కాలు మారుస్తూ..తాను చెప్పేదానికీ చేష్టలకూ సంబంధం లేనివిధంగా ఉంటున్నాయి మోదీ చేష్టలు. గతంలో నల్లధనం, సర్జికల్ స్త్రైక్ వంటి అంశాలతో పదేళ్లు మభ్యపెడుతూ వచ్చిన మోదీ ఈ ఎన్నికలలో సరికొత్త రాగం అందుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ‘మోదీ గ్యారంటీ’ అంటూ జబ్బ చరిచి మరీ ప్రకటించుకున్నారు. మోదీ మౌనం వెనుక, మాటల వెనుక ఒక రహస్యం వుంటుంది. స్వప్రయోజనం వుంటే మౌనం నటిస్తూ పనికానిచ్చేస్తారు. ఈ పనులకు బహిరంగ ప్రకటనలు వుండవు. జబ్బ చరుపులు వుండవు. అంతా నిగూఢ గుప్తమే. ఆదానికి విమానా శ్రయాలు, పోర్టులు, సహజ వనరులుకట్టబెడతారు. అంబానీకి ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలను టెలి కమ్యూనికేషన్‌లు విస్తరించడానికి గేట్లు తెరుస్తారు. ఎన్నికల బాండ్లు సమర్పిస్తే ప్రాజెక్టులు, వారికి మంజూరవుతాయి. ఎలాంటి ప్రకటనలూ లేకుండానే ఆప్త మిత్రులకు కాసుల పంట పండిస్తారు మోదీ అని రాజకీయ విమర్శకులు చెబుతున్న మాట.

జేబు సంస్థలే అస్త్రాలు

ఐటీ, ఈడీ, సీబీఐ ఆయన అంబులపొదిలో అస్త్రాలు. వాటితో దాడులు చేయిస్తారు. లొంగిన వాళ్లకు పార్టీ కండువాలు కప్పి కేసులను పక్కన పెడతారు. లొంగకపోతే జైళ్లపాలు చేస్తారు. వీటన్నింటినీ మోదీ చెప్పకుండా చేస్తారు. అడ్డదారుల్లో పార్టీ నిధులను పోగేస్తారు. ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం అంటారు. ఈ డబ్బుతో ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చేస్తారు. వారిని భయభ్రాంతులను చేస్తారు. మోదీ మౌనతంత్రంతో సాగించే కుతంత్రాలకు ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే అంటున్నారు విమర్శకులు. ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీలు ఇచ్చే మోదీ. ఈ హామీలను పదేపదే వల్లిస్తారు. వీటినే ఎన్నికలప్పుడు గ్యారంటీలు అని జబ్బ చరిచి మరీ ప్రకటిస్తారు. ఏతావాతా ఇవన్నీ వారంటీ లేని గ్యారంటీలు. కొన్ని ప్రకటనలతోనే తుస్సు మంటాయి.. మరికొన్ని ఆచరణకు ఆమడదూరంలో మహిళా రిజర్వేషన్ల చట్టంలా మురిపిస్తాయి.

పొంతన లేని స్టేట్ మెంట్లు

నల్లధనం తెస్తామ‌న్నారు కానీ న‌ల్ల చ‌ట్టాలు తెచ్చారు నిరుద్యోగ నిర్మూల‌న అన్నారు..ఇంటికో నిరుద్యోగిని త‌యారు చేసారు. పన్నులు తగ్గిస్తామని చెప్పి పనులు లేకుండా చేసారు. ధ‌ర‌లు నియంత్రిస్తామ‌న్నారు..రేట్లు రెట్టింపు చేశారు. టాక్స్ లు తగ్గుతాయని చెప్పి దొడ్డి దారిన సెస్ ల భారాన్ని మోపారు. ప‌ట్ట‌ణ ఉపాధి హ‌మీ అని చెప్పి గ్రామీణ ఉపాధి ప‌ని దినాలు త‌గ్గించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర లేకుండా చేశారు. ఇక రైతులకు పింఛన్ ఇస్తామని చెప్పి రైత‌ల‌ అప్పులు రెట్టింపుచేశారు. జాతి గౌరవాన్ని పెంచుతామని చివరకు జాతి సంపదను అమ్మేస్తున్నారు. అవినీతి అంతం అన్నారు..చ‌ట్ట‌బ‌ద్దం చేసి దోచేస్తున్నారు. కరప్షన్ పై కన్నెర్ర అంటూ కరప్షన్ కింగ్ లకు పార్టీ తీర్థం ఇస్తున్నారు. ఎగవేత దారుల‌కు ముకుతాడు అని చెప్పి 15 ల‌క్ష‌ల కోట్ల‌ మాఫి చేశారు
ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రభుత్వాలను కూలుస్తున్నారు డైనమిక్ పాలన అన్నారు..డిక్టేటర్ షిప్ ను దేశం పై రుద్దారు టీమిండియా అన్నారు..రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అన్నారు..ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు వికసిత్ భారత్ అంటున్నారు.. విద్వేషాలను రెచ్చగొట్టి చలి కాచుకుంటున్నారు అరచేతిలో వైకుంఠం చూపారు..ఆదానీకే అన్నీ కట్టబెడుతున్నారు.
అందుకే దేశం బతకాలన్నా..రాజ్యాంగం గెలవాలన్నా.. రిజర్వేషన్లు కొనసాగాలన్నా బీజేపీ నీ ఓడించాలంటున్నారు మేధావి వర్గం. ఇప్పుడు మోదీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తే రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామంటున్నారు. ఇది మోదీ గ్యారంటీ అంటున్నారు. మోదీ చేతల భాష మౌనం. మోదీ కోతల భాష హామీలు, గ్యారంటీలు. అందుకే ఆయన మాటలకు అర్ధాలే వేరులే అంటారు విమర్శకులు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...