– కవితకి ఊహించని షాకిచ్చిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
– బెయిల్ మంజూరు చేయాలని కోరిన కవిత తరపు న్యాయవాదులు
– సాక్ష్యాలు తారుమారు చేసే ఛాన్సుందని చెప్పిన సీబీఐ
– మరో 14 రోజులు పొడగిస్తూ కోర్టు నిర్ణయం
MLC Kavitha judicial custody updates(Telugu breaking news): ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తరలించారు. కవిత అరెస్ట్ అయ్యి సుమారు నెలకి పైగా అయ్యింది. మంగళవారంతో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగిసింది. ఈ క్రమంలో కవితకి మరోసారి షాకిచ్చింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. కవిత జ్యూడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించింది. దీంతో కవితను తీహార్ జైలు నుంచి వర్చువల్ కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. అయితే కస్టడీని పొడగించాలంటూ సీబీఐ కోర్టును ఈడీ, సీబీఐ కోరడంతో అందుకు కోర్టు అంగీకరించింది. కస్టడీ పొడిగించే వాదనలతోపాటు కవిత బెయిల్ పిటిషన్ పైనా రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించింది.
లిక్కర్ స్కాంలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు కవిత తరపు న్యాయవాదులు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్సుందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు.
Also Read:లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ మొనగాడు ఎవరో…?
అయితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారు. పాత విషయాన్నే పదే పదే చెబుతున్నారని, కొత్తగా చెప్పేది ఏమీ లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జీషీట్ సమర్పిస్తామని ఈ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మే 2న తీర్పు వెల్లడించనున్నారు.