MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. మరో 14 రోజులు కస్టడీని పొడిగించింది. వచ్చే నెల 7వ తేదీన కోర్టులో హాజరు కావాలని సూచించింది. వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 4వ తేదీతో ముగిసింది. దీంతో మరోసారి వారిని కోర్టు ముందు వర్చువల్‌గా హాజరుపరిచారు. వారి కస్టడీని పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు.. రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
ఇదే రోజు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైనా రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు విన్నది. కవిత తన పిటిషన్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను ఈడీ తోసిపుచ్చింది. అలాగే.. ఆమెకు బెయిల్ మంజూరు చేయరాదని, ఆమె కేసు పురోగతిని దెబ్బతీసే ముప్పు ఉన్నదని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, సూర్యాస్తమయంలోగా ఆమెను అరెస్టు చేశామని, 24 గంటల్లోపే కోర్టులో ఆమెను హాజరుపరిచామని స్పష్టం చేశారు.
Also Read: ఆ ముగ్గురి గురించి మాట్లాడితే నా టైం వేస్ట్ అయినట్టే: కడియం
తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించలేదని, కవిత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు.. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని, వారి వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్టు చేసినటట్టు వివరించారు. 60 రోజుల్లో కవితపై చార్జిషీట్ వేస్తామనీ తలెిపారు. ఇండో స్పిరిట్‌లో కవిత బినామీగా అరుణ్ పిళ్లై ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంపై మరింత స్పష్టంగా వాదించడానికి సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కోర్టు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మొదలవుతుంది. బుధవారం కూడా ఈడీ వాదనలు ఉంటాయి. ఈడీ వాదనల తర్వాత కవిత తరఫు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉంటుంది.