Harish Rao: గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు. హరీశ్ రావు ఎంతో మంది అమరవీరుల చావుకు కారణమయ్యారని, ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఆ హంతకుడు అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతమంతా మైల పడిందని అన్నారు. అందుకే అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్టు వివరించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారా? ఎవరికైనా ఆ దశాబ్ద కాలంలో అమరవీరులు గుర్తుకు వచ్చారా? అని నిలదీశారు.
హరీశ్ రావు బీఆర్ఎస్ ఒక జీతగాడు మాత్రమేనని ఎమ్మెల్సీ బల్మూరి సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతారని అన్నారు. ఇందులో సందేహాలేమీ అక్కర్లేదని వివరించారు. హరీశ్ రావు మాత్రం సవాల్ విసిరి నాటకాలు ఆడారని విమర్శించారు. హరీశ్ రావు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను రాయలేదని, కేవలం రాజకీయం చేయడానికే ఆ రాజీనామా తీసుకువచ్చారని అన్నారు. అయితే, హరీశ్ రావు రాజీనామా లేఖను వృథాగా పోనివ్వనని అన్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత కచ్చితంగా హరీశ్ రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు బల్మూరి తెలిపారు.
అమరవీరుల స్థూపాని పసుపు నీళ్లతో శుద్ధి.
*అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు @BRSHarish ఉద్యమ సమయంలో నిరుద్యోగులను,యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు.
*అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం తో ఈ ప్రాంతం మైల పడింది. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది.
*10… pic.twitter.com/1Oag1BwHCv
— Venkat Balmoor (@VenkatBalmoor) April 26, 2024
Also Read: జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్.. దమ్ముంటే మెదక్‌లో డిపాజిట్ తెచ్చుకోండి
శాసన సభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన హరీశ్ రావుకు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలియదా? అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసితీరుతామని, మరి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారో లేదో కూడా కేసీఆర్ గారిని చెప్పమనండని అడిగారు. హరీశ్ రావుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దొంగలా వచ్చి వెళ్లడం కాదు.. పదేళ్లలో ఏం చేశారో చెప్పండి అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా తాను హరీశ్ రావుకు సవాల్ విసురుతున్నట్టు పేర్కొన్నారు.