KCR: కేసీఆర్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రొజెక్టర్ వేసి కేసీఆర్ చెప్పిన అబద్ధాలను వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్‌కు మంచి నాలెడ్జ్ ఉందని తాను అనుకున్నారని, కానీ, అది తప్పని తేలిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఏ పనీ లేక కేసీఆర్ నాలుగు గంటలు మీడియాతో మాట్లాడారని కామెంట్ చేశారు.
బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా మెంటల్‌గా బ్యాలెన్స్ తప్పుతుందని, కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉన్నదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. జైలు నుంచి బయటికి వచ్చేటప్పుడు కవిత ఫ్రీడమ్ ఫైటర్‌లా చేయి ఊపుతుందని సెటైర్ వేశారు. కవిత వల్ల తెలంగాణ తలదించుకుందని అన్నారు. కేసీఆర్ తన బిడ్డలనైనా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో.. ఏదైనా మంచిదే.. ఇక ఆమెని ఇంటిలో పెట్టుకోవడం మంచిదని సూచించారు.
Also Read: కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్.. ప్రొజెక్టర్ పెట్టి మరీ లెక్కలు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఆయన సభకు జనాలు రాలేదని కేసీఆర్ రోడ్లపై గంటలకు గంటలు వెయిట్ చేస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని పేర్కొన్నారు.