Saturday, May 18, 2024

Exclusive

Komatireddy : కేసీఆర్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్

– మూడు నెలల్లో బీఆర్ఎస్‌ను బొంద పెడుతాం
– కాంగ్రెస్ వీర సైనికులు మీకు పునాదులు లేకుండా చేస్తారు
– పాస్ పోర్టు దొంగవి నువ్వే సీఎం అయ్యావ్
– అలాంటిది, పేదింటి బిడ్డ రేవంత్ ఎందుకు కాకూడదు
– రాజకీయాలకు కేటీఆర్ బచ్చా
– నీ కొడుకు, అల్లుడు కూడా తీహార్ జైలుకే
– కనీసం బిడ్డకు బెయిల్ తెచ్చుకోలేని స్థితిలో ఉన్నావ్
– పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా గెలవరు
– కేసీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

Komatireddy Mass Warning To KCR : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ సోదిలోనే లేదనే టాక్ ఉంది. కానీ, పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ తెగ తాపత్రయ పడుతున్నారు. అధికార కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బిడ్డా, కేసీఆర్ నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరించారు.

బుధవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, మమ్మల్ని టచ్ చేసి చూడు, మా పార్టీ వీర సైనికులు నీ పార్టీ పునాదులు లేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకో బిడ్డా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘గత కొద్ది రోజులుగా కేటీఆర్ ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బచ్చా కాబట్టి రాజకీయాలు తెలియవు పోనీలే అని ఊరుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడడం నీ మూర్ఖత్వానికి అద్దం పడుతోంది. పాస్ పోర్ట్ దొంగవు నువ్వు సీఎం కాగా లేనిది కష్టపడి సీఎం పదవిని అలంకరించిన రేవంత్ రెడ్డికి నీకు పోలికా’’ అంటూ ఎద్దేవ చేశారు.

రేవంత్ రెడ్డికి ముఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలకు రాని దొంగవు నువ్వు. నీ కొడుకు, అల్లుడు కూడా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్‌ను చూస్తే జాలేస్తోందని అయినా బుద్ధి ఆయనకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. కనీసం బిడ్డకు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలని పనికిరాని మాటలు ఎందుకు అంటూ ఫైరయ్యారు మంత్రి. మేం తలచుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చేరేవారని అన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్‌కు రాదని చెప్పారు కోమటిరెడ్డి. దీనిపై ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని, జూన్ 5వ తారీఖు నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ - భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి - అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం - ఇరిగేషన్ శాఖపై...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బాహాటంగా ప్రకటిస్తున్నారు. చాలా సార్లు ఈ విషయమై ఆయన వివాదాల్లోనూ చిక్కుకున్నారు. రామ్ గోపాల్...