Anshu Ambani: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మూవీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి అన్షు అంబానీ. తర్వాతప్రభాస్ హీరోగా వచ్చిన రాఘవేంద్ర, మిస్సమ్మ మూవీలో గెస్ట్ రోల్ చేసింది. అయితే మన్మధుడు చిత్రంలో వచ్చిన గుర్తింపుతో అన్షు కు తెగ ఆఫర్లు వచ్చిపడ్డాయి. అయినా ఈ బ్యూటీ కేవలం సెలక్టివ్ గా పాత్రలు చేస్తూ మధ్యలోనే విదేశాలకు వెళ్లిపోయింది.
తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. చేసింది కొన్ని సినిమాలే కానీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు మన్మథుడు వంటి మంచి అవకాశం అందుకుంది అన్షు.. అయితే ఆ సమయంలో తాను చాలా ఇబ్బందిని ఫేస్ చేశానని ఓ ఇంటరవ్యూలో చెప్పుకొచ్చింది. . ఆ సమయానికి తాను చాలా యంగ్ కావడంతో వాళ్ల నాన్న ఓవర్ ప్రొటెక్టీవ్‌గా ఉండేవారట. దీంతో తాను ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలవాలి అనేవి కూడా ఆయనే నిర్ణయించేవారట. అలాంటి సిట్యుయేషన్స్ మధ్యలో సినిమా పరిశ్రమలో ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే ఇప్పుడు సినిమా నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ కొన్నాళ్ళు తరువాత వద్దాము అని అనుకుంది అన్షు. అందుకనే ఇప్పుడు ఇండియాకు మళ్ళీ తిరిగి వచ్చాను అంటూ పేర్కొన్నారు అయితే ఇటీవల మన్మథుడు మూవీ రీ రిలీజ్ టైములో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ రీ రిలీజ్ సమయంలోనే రీ ఎంట్రీ బెటర్ అనుకున్నారు ఏమో గానీ, ఈ ఇంటర్వ్యూలో.. ‘మళ్ళీ వచ్చాను’ అని చెబుతూ రీ ఎంట్రీని కన్ఫార్మ్ చేసేసారు.. తాను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. తన పూర్వీకులు భారతీయులేనని తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని.. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆ సినిమా చేసి మళ్ళీ లండన్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.
కీ రోల్ పాత్రలో అన్షు
తాజాగా ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అన్షు కి దర్శకుడు కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ , తన పాత్ర నచ్చడంతో ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు తెలుగులో రీఎంట్రీ సినిమాగా నిలవబోతున్నట్లు చెబుతున్నారు. మరి అవి ఎంత వరకూ నిజమో తెలియాలి అంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.